E-Paper
Advertisement

Bentley GTS VS GTC S: బెంట్లీ GT S Vs GTC S.. ఈ లగ్జరీ కార్లలో ఏది బెస్ట్ అంటే?

Bentley GTS VS GTC S: బెంట్లీ GT S Vs GTC S.. ఈ లగ్జరీ కార్లలో ఏది బెస్ట్ అంటే?
Advertisement

Bentley GTS VS GTC S Comparison: లగ్జరీ కార్ల తయారీ సంస్థ బెంట్లీ నుంచి విడుదలైన విలాసవంతమైన, పవర్ ఫుల్ స్పోర్ట్స్ కార్లు  GT S, GTC S. ఈ రెండూ స్పోర్టి లుక్, బ్లాక్ కలర్ డిజైన్, డైనమిక్ రైడ్, మెరుగైన ఎగ్జాస్ట్ సౌండ్ ను కలిగి ఉన్నాయి. ఇవి 4.0 లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజన్‌ తో పని చేస్తాయి. 542 bhp పవర్, 770 Nm టార్క్‌ ను అందిస్తాయి. 0 నుంచి 100 కిలో మీటర్ల వేగాన్ని కేవలం 4 సెకన్లలో అందుకుంటాయి. ఈ రెండు కార్లలో తేడాలు ఏంటి? ఏది బెస్ట్ కారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

GT S, GTC S  మోడల్స్ గురించి..

⦿ ఇంజిన్, పనితీరు:  GT S, GTC S  మోడల్స్ 4.0-లీటర్ ట్విన్-టర్బో V8 పెట్రోల్ ఇంజిన్, హైబ్రిడ్ సిస్టమ్‌ తో పని చేస్తాయి. ఇవి 671 bhp పవర్, 930 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తాయి.

Advertisement

⦿ స్పీడ్: GT S, GTC S మోడల్స్ 0-100 కిలో మీటర్ల వేగాన్ని కేవలం 4 సెకన్లలో అందుకుంటాయి. వీటి గరిష్ట వేగం గంటకు 306 కిలో మీటర్లు.

⦿ డిజైన్: ఈ రెండు మోడల్స్ బ్లాక్ స్పెసిఫికేషన్స్ తో అందుబాటులో ఉన్నాయి. అంటే ఎక్స్టీరియర్ పార్ట్స్ అన్నీ గ్లాస్ బ్లాక్ ఫినిషింగ్‌ లో ఉంటాయి. 22 అంగుళాల పది స్పోక్ వీల్స్, స్పోర్ట్స్ ఎగ్జాస్ట్,  డార్క్ టింట్ హెడ్‌ ల్యాంప్స్ ను కలిగి ఉంటాయి.

Advertisement

⦿ ఇంటీరియర్: ఈ లగ్జరీ కార్ల లోపలి భాగంలో డైనమికా  మెటీరియల్, ప్రత్యేకమైన టూ టోన్ అప్‌హోల్స్టరీ, పియానో బ్లాక్ వెనీర్ ఉపయోగించి రూపొందించారు.

⦿ ధర: భారత్ లో ఈ బెంట్లీ కాంటినెంటల్ కార్ల ధరలు రూ. 5.23 కోట్ల నుంచి ప్రారంభం అవుతుంది. టాప్ మోడల్స్‌  ధర  రూ. 8.45 కోట్లకు పైగా ఉంటుంది. GTC S మోడల్స్, GT S కన్నా కాస్త ఎక్కువ ధరను కలిగి ఉంటాయి.

Read Also: రోల్స్ రాయిస్ కార్లకు ఎందుకు అంత ధర.. అల్టిమేట్ లగ్జరీ వెనుక రహస్యం ఇదే!

GT S, GTC S  మోడల్స్ ప్రత్యేకతలు

GT S, GTC S  మోడల్స్ అద్భుతమైన పనితీరు, అంతకు మించిన విలావంతంగా ఉంటాయి. అద్భుతమైన లగ్జరీ కార్లు కొనుగోలు చేయాలనుకునే వారి కోసం కంపెనీ వీటిని తయారు చేసింది. కారులో కూర్చొని ఆకాశాన్ని చూసేలా రూఫ్ ఓపెన్ అవుతుంది.  ఎయిర్ స్కార్ఫ్ ఫీచర్, చల్లని వాతావరణంలో కన్వర్టిబుల్ డ్రైవింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. 48V యాక్టివ్ బాడీ కంట్రోల్ తో మెరుగైన హ్యాండ్లింగ్ అవకాశం ఉంటుంది. ఆల్ వీల్ డ్రైవ్, కన్వర్టిబుల్ కోసం 7 రంగులలో ఫ్యాబ్రిక్ రూఫ్, 8 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌ మిషన్ లాంటి ఫీచర్లు ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇదో కదిలే లగ్జరీ మహల్ అంటే సరిపోతుంది.

Read Also: టాటా ఆల్ట్రోజ్ CNG మైలేజ్ టెస్ట్, బాబోయ్.. అంతదూరం వెళ్లొచ్చా?

Related News

జూలైతో పోల్చితే ఆగస్టులో తగ్గిన EV స్కూటర్ అమ్మకాలు.. కారణం ఏంటంటే?

కైనెటిక్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఏకంగా 132 కి.మీ రేంజ్!

టెస్లా సైబర్‌ ట్రక్‌కు ఇండియన్ టచ్.. ఫొటోలు చూస్తే నవ్వు ఆపుకోలేరు!

నెక్సాన్ To కర్వ్.. సెప్టెంబర్ లో టాటా కార్లపై ఊహించని డిస్కౌంట్లు!

మహీంద్రా SUVలపై భారీ డిస్కౌంట్లు.. స్కార్పియో Nపై ఏకంగా రూ.3 లక్షల తగ్గింపు!

ఎలక్ట్రిక్ స్కూటర్లకు సూపర్ డిమాండ్.. 8 నెలల్లోనే 13 లక్షలకు పైగా అమ్మకాలు!

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

Big Stories

Advertisement
×