E-Paper
Advertisement

ఓర్ని.. హ్యూందాయ్ i10 కారును ఇలా మార్చేశారా? వీడియో చూస్తే షాకవుతారు!

ఓర్ని.. హ్యూందాయ్ i10 కారును ఇలా మార్చేశారా? వీడియో చూస్తే షాకవుతారు!
Advertisement

Modified Hyundai Grand i10: రోడ్ల మీద తరచుగా మోడిఫై కార్లు కనిపిస్తుంటాయి. కానీ, తాజాగా గుజరాత్ లో కనిపించి వీడియో నెటిజన్లు ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో చిన్న కారు అయిన హ్యుండాయ్ గ్రాండ్ ఐ10ను పూర్తిగా మార్చిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా ఈ కారు కాంపాక్ట్ డిజైన్‌ తో ఉంటుంది. కానీ, వీడియోలో కారు రూఫ్ చాలా ఎత్తుగా పెంచారు. ఇంకా చెప్పాలంటే, టాల్‌ బాయ్ వెహికల్ గా మార్చేశారు. ఈ మార్పుతో కారులోని హెడ్‌ రూమ్ భారీగా పెరిగింది. లోపల కూర్చునే వారికి తలపై ఎక్కువ స్థలాన్ని కలిగి ఉంటుంది. కారు లోపలికి చూస్తే అదో చిన్న రూమ్ లా అనిపిస్తుంది. సాధారణ కార్లతో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే, కారులో హ్యాపీగా నిలబడి ప్రయాణించేలా తయారు చేశారు.

బయటి నుంచే చూస్తే క్రేజీ లుక్

కారు బయట నుంచి చూస్తే చాలా విచిత్రంగా కనిపిస్తుంది. బాక్స్ లాంటి ఆకారం, పైకప్పు అసాధారణ ఎత్తుగా ఉండటం వల్ల  సాధారణ కారులా కాకుండా ఒక చిన్న వ్యాన్, మినీ రూమ్ లా కనిపిస్తుంది. ఈ డిజైన్ చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోవడమే కాకుండా, చాలా మంది సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

నెటిజన్లు ఏమంటున్నారంటే?

Advertisement

సోషల్ మీడియాలో ఈ కారు వీడియో చూసి క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు. వీల్స్ మీద తిరిగే 1 BHK ఫ్లాట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. లోపల ఉన్న స్పేస్ చూసినప్పుడు నిజంగా ఒక చిన్న గది లాంటి ఫీలింగ్ కలుగుతుందని మరికొంత మంది కామెంట్స్ చేశారు. ఇందులో బెడ్ కూడా పెట్టేస్తే ఫుల్ హౌస్ అయిపోతుందంటూ సరదాగా స్పందించారు.

ఈ మోడిఫై ఎందుకు చేసినట్లు?

ఈ కారును ఎందుకు ఇలా మోడిఫై చేశారు? అనే విషయం చాలా మందికి తెలియదు. కేవలం ప్రయోగం కోసం చేశారా? లేదంటే ప్రత్యేక అవసరాల కోసం చేశారా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. కొందరు దీన్ని క్యాంపింగ్ లేదంటే లాంగ్ ట్రిప్స్ కోసం ఉపయోగపడేలా డిజైన్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. అటు ఇలాంటి మార్పులు చేయడం చట్టబద్ధంగా సరైనదేనా? అనే చర్చ జరుగుతుంది. కారులో పెద్ద మార్పులు చేయాలంటే RTO అనుమతి తప్పనిసరి. లేదంటే రోడ్డుపై నడిపితే కేసు నమోదు అయ్యే అవకాశం ఉంది. భద్రతా పరంగా కూడా ఇలాంటి మార్పులు ఎంతవరకు సురక్షితం అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

ఆకట్టుకుంటున్న క్రియేటివ్ ఐడియా

ఈ మార్పు ఓ క్రియేటివ్ ఐడియాగా చెప్పుకోవచ్చు. సాధారణ కారును పూర్తిగా భిన్నంగా మార్చి, అందరి దృష్టిని ఆకర్షిపంతెవది, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి ప్రధాన కారణం కూడా అదే. కొంతమందికి ఇది ఫన్నీగా అనిపిస్తే, మరికొందరికి ఇది ఒక కొత్త ప్రయోగంగా భావిస్తున్నారు.

Read Also: సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, అదిరిపోయే రేంజ్, హోండా క్రేజీ ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది!

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×