E-Paper
Advertisement

సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, అదిరిపోయే రేంజ్, హోండా క్రేజీ ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది!

సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, అదిరిపోయే రేంజ్, హోండా క్రేజీ ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది!

Honda WN7 Electric Motorcycle Unveiled: జపాన్ కు చెందిన ప్రముఖ టూవీలర్ కంపెనీ హోండా.. తొలిసారి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్ లోకి తీసుకురాబోతోంది. హోండా WN7 పేరుతో మార్కెట్ కు పరిచయం చేయబోతోంది.  ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో వేగంగా విస్తరిస్తున్న మార్కెట్‌ ను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన ఈ బైక్‌, పవర్ ఫుల్  పని తీరు, లేటెస్ట్ టెక్నాలజీ, ఆకట్టుకునే డిజైన్‌ తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోబోతోంది. 2026 మోడల్‌ గా రాబోతున్న ఈ బైక్‌ ఇప్పటికే ఆటోమొబైల్ రంగంలో ఆసక్తిని కలిగిస్తోంది.

ఒకే ఛార్జ్ తో 150 కి.మీ ప్రయాణం

ఈ బైక్‌ లో ముఖ్యమైన అంశం దాని రేంజ్. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే, సుమారు 150 నుంచి 156 కిలో మీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. రోజు వారీ వినియోగానికి ఈ బైక్ అనుకూలంగా ఉంటుందని వివరించింది. ముఖ్యంగా నగర ప్రయాణాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించింది.

జస్ట్ 30 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్

ఛార్జింగ్ విషయానికి వస్తే, ఈ బైక్‌ లో CCS2 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ ను అందించారు. దీని వల్ల కేవలం 30 నిమిషాల్లోనే బ్యాటరీ 20 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ ఛార్జింగ్ పొందే వీలుండటంతో, సుదూర ప్రయాణాల సమయంలో సౌకర్యంగా ఉంటుంది.

ఇక ఈ బైక్ పవర్, పనితీరు పరంగా కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇందులో 50kW పవర్, 100 Nm టార్క్ లభిస్తాయి. ఈ పవర్ కారణంగా, సుమారు 600cc పెట్రోల్ బైక్‌ లకు సమానంగా పోటీ ఇస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వేగం, పిక్ అప్ విషయంలో కూడా ఇది మంచి అనుభూతిని ఇస్తుంది. ఈ బైక్ కేవలం 3.5 సెకెన్లలో 0 నుంచి 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఆకట్టుకునే డిజైన్ తో..

ఈ బైక్ డిజైన్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. అల్యూమినియం బ్యాటరీ కేస్‌ ను ఫ్రేమ్‌ గా ఉపయోగించడం వల్ల బైక్ తేలికగా ఉండటంతో పాటు బలంగా ఉంటుంది. మొత్తం బరువు సుమారు 217 కిలోలు ఉంటుంది. రైడింగ్ సమయంలో మంచి కంట్రోల్ అందిస్తుంది. ఫీచర్ల పరంగా కూడా ఈ బైక్ చాలా మోడ్రన్ గా ఉంటుంది. ఇందులో TFT డిస్‌ ప్లే, స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ, వైర్‌ లెస్ కీ లాంటి సదుపాయాలు ఉన్నాయి. ఇవి రైడర్‌ కు మరింత సౌకర్యాన్ని అందిస్తాయి.

ధర ఎంత ఉంటుందంటే?

ఈ బైక్‌ను మొదటగా యూరప్ మార్కెట్‌ లో విడుదల చేయనున్నారు. ధర సుమారు €15,000 వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 13 నుంచి రూ. 15 లక్షల మధ్య ఉంటుంది. అయితే, ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తారనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉంది.

Read Also: కారులోనే హోం థియేటర్, కళ్లు చెదిరే ఇంటీరియర్.. వారెవ్వా ఏముంది భయ్యా!

Related News

ఇండియన్ మార్కెట్ లోకి యమహా NMax 155 ఎంట్రీ, ఫీచర్లు చూస్తే షాక్!

టీవీఎస్, బజాజ్ జోరు.. ఓలా బేజారు.. ఈవీ స్కూటర్ అమ్మకాల్లో టాప్ 5 మోడల్స్ ఇవే!

ఒకే ఇంజిన్.. రెండు బైక్స్.. బుల్లెట్ 650 vs క్లాసిక్ 650 డిఫరెన్స్ ఇవే!

అవెంజర్ లవర్స్ కు గుడ్ న్యూస్.. రెండు రంగుల్లో స్ట్రీట్ 220 మళ్లీ ఎంట్రీ!

95 కి.మీ క్లెయిమ్.. కానీ, నిజంగా ఇ-యాక్సెస్ ఇచ్చిన రేంజ్ ఎంతో తెలుసా?

టాటా మోటార్స్ మాస్టర్ ప్లాన్.. అవిన్యా X లాంచింగ్ డేట్ ఫిక్స్!

మహీంద్రాను దాటేసిన టాటా.. మే 2026 ఈవీ అమ్మకాల్లో సరికొత్త రికార్డు!

పెట్రోల్‌ తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కొత్త వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ ప్రత్యేకతలు ఇవే!

Big Stories

×