E-Paper
Advertisement

మెగాస్టార్ ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న సిల్క్ స్మిత.. చిరు ఏం చేశారంటే?

మెగాస్టార్ ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న సిల్క్ స్మిత.. చిరు ఏం చేశారంటే?
Advertisement

Silk Smitha:తెలుగు వెండితెరపై సిల్క్ స్మిత అంటే అప్పట్లో ఒక సంచలనం. ఆమె కళ్ళల్లోని మ్యాజిక్, వెండితెరపై ఆమె చేసే డ్యాన్స్‌లు చూసి కుర్రకారు వెర్రెక్కిపోయేవారు. అయితే, ఆమె జీవితం బయటకు కనిపించేంత రంగులమయంగా ఏమీ లేదు. తాజాగా ప్రముఖ దర్శకులు కనగాల జయకుమార్ ఒక ఇంటర్వ్యూలో సిల్క్ స్మిత వ్యక్తిత్వం గురించి, షూటింగ్ సెట్స్‌లో ఆమె ప్రవర్తన గురించి, చివరికి ఆమె ఎలా మోసపోయిందనే విషయాల గురించి సంచలన నిజాలు పంచుకున్నారు. అప్పట్లో ఆమె ఎదుర్కొన్న అవమానాలు, ఆమె సాధించిన క్రేజ్ వింటే ఆశ్చర్యం కలగక మానదు.

ఎవరికీ తలవంచని మనస్తత్వం.. స్టార్స్ అయినా డోంట్ కేర్..

సిల్క్ స్మిత సెట్‌కు వచ్చిందంటే అప్పట్లో ఒక రేంజ్‌లో ఉండేది. ఆమె ఎవరికీ భయపడేది కాదు, పెద్ద హీరోలు వచ్చినా లెక్కచేయకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చునేదట. “నా కాలు నా ఇష్టం.. నేను వేసుకుంటే మీకేంటి?” అన్నట్టుగా ఉండే ఆమె మనస్తత్వం అప్పట్లో చర్చనీయాంశం. ఇక చిరంజీవి వచ్చినా, క్రాంతి వంటి బడా దర్శకుల ముందు కూడా ఆమె అదే గర్వంతో ఉండేది. ఒకసారి సెట్ లో క్రాంతి సూచన మేరకు చిరంజీవి ఆమెను చిన్న దెబ్బ వేశారు. అది ఆమె తట్టుకోలేక పోయింది. చిరంజీవి అంటే క్రాంతి గారికి చాలా ఇష్టం, ఓసారి ఆమె.. చిరంజీవి డైలాగ్ చెప్పేటప్పుడు ఎదురుగా వచ్చింది. అక్కడే వున్న క్రాంతి వైపు చిరంజీవి చూడగానే ఆయన చిన్నగా కన్ను కొట్టాడు.. ఇక వెంటనే చిరంజీవి చిన్నగా ఆమె చెంప పైన టచ్ చేసారు. అంతే అమ్మో అంటూ అక్కడే పడిపోయింది. ఆ తరువాత ఆమెను లేపి, సంజాయిషీ చెప్పాము, అయినా సరే ఆమె ఎంతమంది వున్నా కాలు మీద కాలు వేసుకొని కూర్చొనేది. ఇదంతా ఆమె ఎదుర్కొన్న అవమానాల వల్ల వచ్చిన మొండితనమని జయకుమార్ వివరించారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఆమె తన గుండెను రాయి చేసుకుని ఎవరినీ లెక్క చేయకుండా నిలబడింది.

వేలల్లో పలికిన ఆపిల్ పండు ధర:

Advertisement

సిల్క్ స్మితకు అప్పట్లో ఉన్న క్రేజ్ గురించి చెబుతూ జయకుమార్ ఒక ఆసక్తికర సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఒక ఫంక్షన్‌లో సిల్క్ స్మిత సగం కొరికిన ఆపిల్ పండును వేలం వేయగా, ఒక అభిమాని దానిని ఏకంగా రూ. 25,000 పెట్టి కొనుగోలు చేశాడట. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. అంతేకాదు, డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమాలో సిల్క్ స్మిత పాట ఉంటేనే ఆ సినిమాను కొనేవారు. హీరో ఎవరైనా సరే, సిల్క్ డ్యాన్స్ ఉంటే చాలు సినిమా హిట్ అని నమ్మేంత స్థాయికి ఆమె క్రేజ్ పెరిగిపోయింది.

అతని చేతిలో మోసం.. కెరీర్ పతనం:

సిల్క్ స్మిత మరణం వెనుక ఉన్న అసలు రహస్యాలను జయకుమార్ బయటపెట్టారు. ఆమె జీవితంలోకి ఒక డాక్టర్ ప్రవేశించి, ఆమెను హీరోయిన్ గా చేస్తే ఎక్కువ స్టార్ డమ్ వస్తుందని, నమ్మించాడట. “వ్యాంప్ వేషాలు ఎన్నాళ్ళు వేస్తావు? నీలో హీరోయిన్ అయ్యే లక్షణాలు ఉన్నాయి” అని చెప్పి ఆమెతో సినిమాలు తీయించి నష్టపోయేలా చేశాడని జయకుమార్ తెలిపారు. ఆ క్రమంలోనే సిల్క్ స్మిత తన ఆస్తులను కోల్పోయింది. చివరకు ఆ డాక్టర్ ఆమె ఆస్తులను తన పేరు మీదకు మార్చుకున్నాడని, ఆ ఆర్థిక ఇబ్బందులు మరియు మోసం తట్టుకోలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ఆయన వెల్లడించారు.

Advertisement

also read:ప్రదీప్ రంగనాథన్ సైన్స్ ఫిక్షన్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

విషాదాంతమైన అందాల తార ప్రస్థానం:

సిల్క్ స్మిత చివరి రోజులు చాలా భయంకరంగా గడిచాయని జయకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో సంపాదించినా, చివరకు ఓ డాక్టర్ చేతిలో చిక్కి అన్నీ కోల్పోయి ఒంటరిగా కన్నుమూయడం సినిమా ఇండస్ట్రీలోని చీకటి కోణాన్ని చూపిస్తుంది. ఆమె రాసిన సూసైడ్ నోట్ గురించి, ఆ డాక్టర్ ప్రమేయం గురించి ఇప్పటికీ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. వెండితెరపై వెలిగిపోయిన ఒక ధ్రువతార ఇలా విషాదకరంగా ఆత్మహత్య చేసుకోవడం తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది. ఆ గ్లామర్ వెనుక ఉన్న కన్నీటి కథ ఎంతోమందిని ఆలోచింపజేస్తుంది.

Related News

నోరు జారితే అంతే.. నెక్స్ట్ స్కిట్‌లో నో ఛాన్స్! జబర్దస్త్ సీక్రెట్ లీక్ చేసిన నటి సత్యశ్రీ

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

Big Stories

Advertisement
×