E-Paper
Advertisement

Property Tax: ట్యాక్స్ కలెక్షన్స్ పై ప్రభుత్వం ఫుల్ ఫోకస్.. అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేనా..!

Property Tax: ట్యాక్స్ కలెక్షన్స్ పై ప్రభుత్వం ఫుల్ ఫోకస్.. అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేనా..!
Advertisement

Property Tax: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లోని సుమారు కోటి 40 లక్షల మంది జనాభాకు అవసరాలకు తగిన అభివృద్దితో పాటు పౌర, అత్యవసర సేవలందించే మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రధాన ఆర్థిక వనరుల్లో ఒకటైన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ పై మూడు కార్పొరేషన్ లోని అధికారులు బుధవారం నుంచి ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు. ఇప్పటి వరకు జరిగిన ట్యాక్స్ కలెక్షన్లలో భాగంగా సైబరాబాద్ పేరుకు తగ్గట్టుగా కలెక్షన్ జరిగింది. మూడు కార్పొరేషన్లగా విభజించకముందు తొలుత రూ. 2200 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ ను అధికారులు టార్గెట్ గా పెట్టుకోగా, నవంబర్ 25 తర్వాత కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేయటంతో ట్యాక్స్ కలెక్షన్ ను రూ. 3 వేల కోట్లుగా నిర్ణయించారు.

రూ.2 వేల కోట్ల వరకు ట్యాక్స్ వసూలు

పాత జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 19.5 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్లు (పీటీఐఎన్ ) ఉండగా, పట్టణ స్థానిక సంస్థల విలీనంతో పీటీఐఎన్ ల సంఖ్య అదనంగా మూడున్నర లక్షల వరకు పెరిగి, మూడు కార్పొరేషన్ల పరిధిలో పీటీఐఎన్ ల సంఖ్య సుమారు 23 లక్షలకు పెరిగినట్లు తెలిసింది. ఇప్పటి వరకు మూడు కార్పొరేషన్ల పరిధిలో దాదాపు రూ.2 వేల కోట్ల వరకు ట్యాక్స్ వసూలు కాగా, వీటిలో రూ. 815 కోట్ల కలెక్షన్ తో సైబరాబాద్ మొదటి స్థానంలో ఉండగా, రూ. 750 కోట్లతో జీహెచ్ఎంసీ రెండో స్థానంలో ఉండగా, రూ. 435 కోట్లతో మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ మూడో స్థానంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి.

Advertisement

Also Read: BRS Party: ఆగమాగం గందరగోళం ఉండాలా.. పోవాలా.. అయోమయంలో బీఆర్ఎస్ క్యాడర్..!

రూ.750 కోట్లు వసూలు

పాత జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 19.5 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్లు (పీటీఐఎన్ ) ఉండగా, పట్టణ స్థానిక సంస్థల విలీనంతో పీటీఐఎన్ ల సంఖ్య అదనంగా మూడున్నర లక్షల వరకు పెరిగి, మూడు కార్పొరేషన్ల పరిధిలో పీటీఐఎన్ ల సంఖ్య సుమారు 23 లక్షలకు పెరిగినట్లు తెలిసింది. వీటిలో 11 పీటీఐఎన్ లు జీహెచ్ఎంసీ పరిధిలోకి రాగా, వీటి ద్వారా ఈ నెలాఖరు కల్లా సుమారు రూ. 1100 కోట్ల ట్యాక్స్ కలెక్షన్ చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు రూ.750 కోట్లు వసూలు కాగా, ఈ ఒక్క కార్పొరేషన్ పెట్టుకున్న టార్గెట్ ను చేరేందుకు రానున్న 25 రోజుల్లో దాదాపు రూ. 350 కోట్లను వసూలు చేయాల్సి ఉంది. సైబరాబాద్, మల్కాజ్ గిరి కార్పొరేషన్లను కలుపుని ఈ నెలాఖరు కల్లా మరో రూ. వెయ్యి కోట్లను వసూలు చేయాలన్న టార్గెట్ ఉంది.

ఉచ్చు భిగించనున్నారా?

Advertisement

ఒక వేపు అప్పులతో సంక్షోభం మరో వైపు ఆదాయ మార్గాలు తగ్గిపోవటంతో జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసుకునేందుకు ఉచ్చు భిగించేందుకు సిద్దమవుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఏళ్ల నుంచి పన్ను చెల్లించని మొండి బకాయిదారులను గుర్తించి ఇప్పటికే వారికి రెండో నోటీసులు జారీ చేశారు. మరోసారి రెడ్ నోటీసులు జారీ చేసి వసూళ్ల కోసం ఫీల్డు లెవెల్ కు వెళ్లేందుకు జోనల్, డిప్యూటీ కమిషనర్లు కూడా వ్యూహాం సిద్దం చేస్తున్నట్లు తెలిసింది. మూడోసారి రెడ్ నోటీసు జారీ చేసిన తర్వాత మూడు నుంచి అయిదు రోజుల గడువు విధించి, ఆ తర్వాత కూడా చెల్లించని పక్షంలో నేరుగా ప్రాపర్టీ వద్దకు వెళ్లి, సీజ్ చేసేందుకు అధికారులు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలిసింది.

Also Read: Gajwel District Hospital: గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స.. శభాష్..!

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×