హ్యుందాయ్ మోటార్స్ 2026లో ఫిబ్రవరిలో అదిరిపోయే ఆఫర్లు అందిస్తుంది. ముఖ్యంగా ఆ బ్రాండ్ కు చెందిన పలు మోడల్స్ మీద కళ్లు చెదిరే తగ్గింపును అందిస్తుంది. గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20, ఆరా, ఎక్స్ టర్, వెన్యూ, వెర్నా, క్రెటా, అల్కాజార్లతో సహా పలు మోడల్స్ మీద డిస్కౌంట్లను అందిస్తోంది. ఆయా మోడల్, వేరియంట్‌ను బట్టి క్యాష్ డిస్కౌంట్లు, స్క్రాపేజ్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు అందిస్తోంది.
ఈ నెలలో వెర్నా భారీగా డిస్కౌంట్ ను పొందుతోంది. ఈ మోడల్ రూ. 98,000 వరకు తగ్గింపు అందిస్తుంది. ఇందులో రూ. 25,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 70,000 స్క్రాపేజ్ బోనస్, రూ. 3,000 అదనపు ఆఫర్ ఉన్నాయి. టర్బో పెట్రోల్, నాన్ టర్బో పెట్రోల్ వేరియంట్‌లు రెండూ ఈ డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉంటుంది. హోండా సిటీ, స్కోడా స్లావియా, వోక్స్ వ్యాగన్ వర్టస్ కు ప్రత్యర్థిగా ఉన్న వెర్నా ధర రూ. 10.79 లక్షల నుంచి రూ. 17.13 లక్షల మధ్య ఉంటుంది.
ఈ నెలలో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ పై మొత్తం రూ. 90,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. రూ. 30,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 30,000 స్క్రాపేజ్ బోనస్, రూ. 30,000 అప్‌గ్రేడ్ బోనస్ ఉన్నాయి.
i20, i20 N లైన్ మొత్తం రూ. 58,000 వరకు డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉంటుంది. వీటిలో రూ. 30,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000 స్క్రాపేజ్ బోనస్, రూ. 3,000 అదనపు ఆఫర్ ఉన్నాయి. i20 మారుతి బాలెనో, టయోటా గ్లాంజా, టాటా ఆల్ట్రోజ్‌లకు ప్రత్యర్థిగా ఉంది. దీని ధర రూ. 6.87 లక్షల నుంచి రూ. 11.53 లక్షల వరకు ఉంటుంది.
గ్రాండ్ i10 నియోస్ పైన రూ. 58,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ నెలలో రూ. 30,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000 స్క్రాపేజ్ బోనస్, రూ. 3,000 అదనపు ఆఫర్‌ను పొందవచ్చు. మారుతి స్విఫ్ట్, టాటా టియాగోలకు ఈ కారు పోటీగా ఉంది. దీని ధర రూ. 5.66 లక్షల నుండి రూ. 7.92 లక్షల మధ్య ఉంటుంది.
క్రెటా రూ. 30,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. స్క్రాపేజ్ బోనస్ రూపంలో ఈ తగ్గింపు ఉంది. క్రెటా ధర రూ. 10.79 లక్షల నుంచి రూ. 20.05 లక్షల వరకు ఉంది. మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, VW టైగన్, టాటా సియెర్రాకు పోటీగా ఉంది.
వెన్యూ, హ్యుందాయ్ వెన్యూ N లైన్ పై ఈ నెలలో రూ. 5 వరకు తగ్గింపు లభిస్తుంది. స్క్రాపేజ్ స్కీమ్ లో భాగంగా ఈ డిస్కౌంట్ ఇస్తుంది. వెన్యూ ధర రూ. 8 లక్షల నుంచి రూ. 15.51 లక్షల మధ్య ఉంది. ఈ కారు మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్, స్కోడా కైలాక్, కియా సోనెట్ కు పోటీగా ఉంది.
Read Also: టాటా ఈవీలపై అదిరిపోయే ఆఫర్లు, ఆ కార్లపై ఏకంగా రూ. 3.80 లక్షల తగ్గింపు!