E-Paper
Advertisement

Historical Movie : హిట్లర్ అరాచకానికి మూగబోయిన సంగీతం… యుద్ధానికి మించిన వేదన ఇది

Historical Movie : హిట్లర్ అరాచకానికి మూగబోయిన సంగీతం… యుద్ధానికి మించిన వేదన ఇది
Advertisement

Historical Movie : రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. హిట్లర్ యుగంలో యూదులు ఎంతలా హింసకు గురయ్యారో మాటల్లో చెప్పలేము. యమలోకంలో కూడా ఇలాంటి శిక్షలు ఉండవు అన్నట్లు ఉండేది అప్పటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆకాలంలో ఆ నరకం నుంచి బయటపడ్డ ఒక రియల్ స్టోరీ తో సినిమా కూడా వచ్చింది. ఈ చిత్రం పోలాండ్‌లోని వార్సా నగరంలో నాజీల నిరంకుశ పాలన  సమయంలో, ఒక యూదు పియానిస్ట్ ఎదుర్కొన్న కష్టాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. సుమారు 2 గంటల 30 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకు IMDbలో 8.5/10 రేటింగ్ కూడా ఉంది.

ఎందులో చూడవచ్చు అంటే

2002లో వచ్చిన ఈ హిస్టారికల్ మూవీ పేరు ‘ది పియానిస్ట్’ (The Pianist). ఒక యూదు పియానిస్ట్ వ్లాడిస్లావ్ స్జ్పిల్మాన్ ఆత్మకథ ఆధారంగా ఇది తెరకెక్కింది. ఇందులో అడ్రియన్ బ్రాడీ (వ్లాడిస్లావ్ స్జ్పిల్మాన్), థామస్ క్రెట్స్చ్మాన్ (కెప్టెన్ విల్మ్ హోసెన్‌ఫెల్డ్) లీడ్ రోల్స్ లో నటించాగా, రోమన్ పోలన్స్కి దీనికి దర్శకత్వం వహించారు. సినిమా ఫ్రెడరిక్ చోపిన్ అద్భుతమైన క్లాసికల్ సంగీతాన్ని అందించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది. 75వ అకాడమీ అవార్డుల్లో ఉత్తమ నటుడు (అడ్రియన్ బ్రాడీ), ఉత్తమ దర్శకుడు (రోమన్ పోలన్స్కి), ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగాల్లో అవార్డులు కూడా పొందింది. 29 ఏళ్ల వయసులో ఆస్కార్ ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా అడ్రియన్ బ్రాడీ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం prime videoలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

1939వ సంవత్సరం జర్మనీ పోలాండ్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్న సమయం. అక్కడ వ్లాడిస్లావ్ స్జ్పిల్మాన్ (అడ్రియన్ బ్రాడీ) ఒక రేడియో స్టేషన్‌లో పియానో వాయిస్తూ ఉంటాడు. హిట్లర్ నేతృత్వంలో నాజీలు యూదులపై అనేక ఆంక్షలు విధిస్తారు. స్జ్పిల్మాన్ కుటుంబం తమ ఆస్తులను కోల్పోయి, చివరకు వార్సాలోని అత్యంత ఇరుకైన ప్రాంతంలో బతకాల్సి వస్తుంది. ఆ ప్రాంతం యూదుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినది. అక్కడ యూదుల ఆకలిని, అవమానాలను, తోటివారి మరణాలను కళ్లారా చూస్తారు.

ఇక మరో ఘట్టం మొదలవుతుంది. 1942లో నాజీలు యూదులందరినీ ‘ట్రెబ్లింకా’ (Extermination Camp) అనే శిబిరానికి తరలించాలని నిర్ణయిస్తారు. అక్కడ వీళ్ళను చంపడానికే తీసుకెళ్తుంటారు. స్జ్పిల్మాన్ కుటుంబాన్ని నాజీలు క్యాంపులకు తరలించినప్పుడు, స్జ్పిల్మాన్ ఒక్కడే తప్పించుకుని శిథిలాల మధ్య దాక్కుంటాడు. ఆకలి, చలి మరణం అంచున ఉండి కూడా అతను ప్రాణాలతో పోరాడుతుంటాడు. యుద్ధం చివరి రోజుల్లో, పాడుబడిన ఆ ఇంట్లో ఆహారం కోసం వెతుకుతుండగా, స్జ్పిల్మాన్ ఒక జర్మన్ అధికారి కంటపడతాడు. ఇక స్జ్పిల్మాన్ కూడా రైలు ఎక్కాల్సి వస్తుందని ప్రాణాల మీద ఆశలు వదిలేసుకుంటాడు.

Advertisement

భయంతో వణికిపోతున్న అతన్ని నీ వృత్తి ఏంటి? అని అధికారి అడుగుతాడు. అతను నేను ఒక పియానిస్ట్‌ని అని చెప్పడంతో అసలు కథ ఉంటుంది. అక్కడ ఉన్న పియానోపై ఒక అద్భుతమైన రాగాన్ని వాయించమని అధికారి కోరతాడు. ఇక స్జ్పిల్మాన్ ప్రతిభను చూసి చలించిన ఆ జర్మన్ అధికారి, అతన్ని చంపకుండా రహస్యంగా ఆహారాన్ని అందిస్తూ కాపాడతాడు. చివరకు రష్యా సైన్యం రావడంతో యుద్ధం ముగుస్తుంది. స్జ్పిల్మాన్ ప్రాణాలతో బయటపడి, తిరిగి తన సంగీత ప్రపంచంలోకి అడుగుపెడతాడు. ఒక సంగీతకారుడి కథ ఇలా ముగుస్తుంది.

Read Also : శరీరాలను మార్చే ఆత్మలు… గందరగోళంలో పడే ఫ్యామిలీ… మనసుకు హత్తుకునే క్లైమాక్స్

Related News

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

Big Stories

Advertisement
×