E-Paper
Advertisement

90’s Iconic Bikes: 1990-2000.. ఐకానిక్ బైక్స్ ఆఫ్ ది డికేడ్!

90’s Iconic Bikes: 1990-2000..  ఐకానిక్ బైక్స్ ఆఫ్ ది డికేడ్!
Advertisement

1990 నుంచి 2000 వరకు భారత్ లో కార్లతో పాటు మోటార్ సైకిళ్లు సృష్టించిన ప్రభంజనం ఇప్పటికీ మర్చిపోలేం. ఆ దశాబ్దంలో సుమారు డజన్ బైకులు మార్కెట్ ను ఏలాయి. నైంటీస్ కిడ్స్ ఇప్పటికీ ఆ బైక్స్ ను మర్చిపోలేరు. అంతగా మదిలో నిలిచిపోయాయి. ఇంతకీ ఆ పదేళ్లలో సత్తా చాటిన కొన్ని బైక్స్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ యమహా RX-100

భారతీయ మార్కెట్ లో ఐకానిక్ బైక్ అనగానే ఈ బైక్ గుర్తొస్తుంది. జపాన్‌లో తయారై, భారత్ లో అసెంబుల్ చేయబడిన ఈ బైక్ కుర్రాళ్లకు కలల బైక్ గా ఉండేది. పవర్ ఫుల్ 2 స్ట్రోక్ ఇంజిన్ నుంచి అది చేసే కిక్కస్ సౌండ్ వరకు భలే ఆకట్టుకునేది. తక్కువ ధరతో పాటు చక్కటి స్టైల్ తో యూత్ ను తెగ ఆకట్టుకునేది. 98cc ఇంజిన్, 11 PS పవర్, 10.39 Nm టార్క్ ఉత్పత్తి చేసేది. 4 స్పీడ్ ట్రాన్స్ మిషన్ ఉండేది.

⦿ బజాజ్ చేతక్

Advertisement

90లలో  ఫ్యామిలీ స్కూటర్ గా గుర్తింపు తెచ్చుకుంది. లక్షలాది మంది భారతీయ కుటుంబాలకు సరసమైన రవాణాను అందించేది. బజాజ్ నుంచి వచ్చిన ఈ స్కూటర్ కు భారతీయ యోధుడు రాణా ప్రతాప్ సింగ్ గుర్రం పేరు పెట్టారు. ఈ స్కూటర్ కు 150cc ఇంజిన్ ఉండేది. 7.5 bhp పవర్, 10.8 Nm టార్క్, 4 స్పీడ్ ట్రాన్స్ మిషన్ ఉండేది.

⦿ హీరో హోండా CD100

CD100 దేశంలో తొలి ఫ్యూయెల్ ఎఫిషియెంట్ ఐకానిక్ బైక్‌ లలో ఒకటి. చేతక్, బుల్లెట్, యెజ్డి లాంటి బైకులను కొనడానికి ఇష్టపడని మధ్య తరగతి ప్రజలకు ఇది ఫస్ట్ ఆప్షన్ గా ఉండేది. మరింత కాంపాక్ట్, ధృఢమైన బిల్డ్ క్వాలిటీ, నమ్మకమైన ఇంజిన్, ఆకట్టుకునే ఇంధన సామర్థ్య ఈ బైక్ ను ఎక్కువగా ఇష్టపడేలా చేశాయి. ఈ బైక్ కు 97cc ఇంజిన్ ఉండేది.  7.5 bhp పవర్, 7.2 Nm టార్క్ అందించేది. 4 స్పీడ్ ట్రాన్స్ మిషన్ ఉండేది.

⦿ కైనెటిక్ హోండా

Advertisement

భారత్ లో ఎలక్ట్రిక్ స్టార్ట్ బటన్ కలిగి ఉన్న మొట్ట మొదటి స్కూటర్ ఇది. CVT ట్రాన్స్ మిషన్ కలిగి ఉన్న మొట్ట మొదటి స్కూటర్ కూడా ఇదే కావడ విశేషం. బజాజ్ చేతక్ స్కూటర్ మార్కెట్‌ ను శాసిస్తున్న కాలంలో ఈ స్కూటర్ దాని దూకుడును అడ్డుకుంది. సులభమైన ఎలక్ట్రిక్ స్టార్ట్ వినియోగదారులను భలే ఆకట్టుకుంది. 98cc ఇంజిన్, 7.7 bhp పవర్,   9.8 Nm టార్క్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఉండేది.

⦿ సుజుకి సమురాయ్

సుజుకి సమురాయ్ RX100 మాదిరిగా సత్తా చాటింది. TVSతో సుజుకి భాగస్వామ్యంలో ఈ ఐకానిక్ బైక్‌ వచ్చింది. అత్యధికంగా అమ్ముడైన మోటార్‌ సైకిళ్లలో ఒకటిగా నిలిచింది. ఇది యువతతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకుంది. ఈ బైక్  98.2cc ఇంజిన్ ను కలిగి ఉండేది. 7.8 bhp పవర్, 9.8 Nm టార్క్ ఉత్పత్తి చేసేది. 4 స్పీడ్ ట్రాన్స్ మిషన్ ఉండేది.

⦿ బుల్లెట్ 350

90వ దశకం బైక్స్ గురించి మాట్లాడాలంటే దీని గురించి కచ్చితంగా ప్రస్తావించాల్సిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంది. ప్రజల మనసులలో నలిచిపోయింది. రాయల్ సౌండ్ ఆకట్టుకునేది. లాంగ్ రైడ్‌లకు మరింత సౌకర్యవంతంగా ఉండేది.  డగ్ డగ్ థంపింగ్ సౌండ్ కు ఇప్పటికీ జనాలు ఫిదా అవుతారు. ఈ బైక్ 346cc, 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 18 bhp పవర్, 32 Nm టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. 4 స్పీడ్ ట్రాన్స్ మిషన్ ఉంటుంది.

Read Also: ఒక్క ఛార్జ్ తో 400 కిలో మీటర్ల రేంజ్, సింపుల్ ఎనర్జీ నుంచి అదిరిపోయే ఈవీ!

Related News

యమహా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లుక్ లీక్.. ఫీచర్లు చూస్తే షాక్ అవుతారు!

సిట్రోయెన్ మాస్టర్ స్ట్రోక్.. బసాల్ట్ ఎక్స్ కంఫర్ట్ ఎడిషన్ విడుదల!

అమ్మకాల్లో టాటా పంచ్ జోష్.. ఏకంగా 8 లక్షల మార్క్ క్రాస్!

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

Big Stories

Advertisement
×