E-Paper
Advertisement

Bad Breath: నలుగురిలో మాట్లాడాలంటే భయమా? నోటి దుర్వాసనను చిటికెలో తరిమికొట్టే చిట్కాలు

Bad Breath: నలుగురిలో మాట్లాడాలంటే భయమా?  నోటి దుర్వాసనను చిటికెలో తరిమికొట్టే చిట్కాలు
Advertisement

Bad Breath: ప్రతిరోజూ బ్రష్ చేసిన తర్వాత కూడా కొన్ని సార్లు నోటి నుంచి దుర్వాసన వస్తుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. కానీ ఆరోగ్యవంతమైన వ్యక్తిలో నోటి నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందంటే ఇందుకు ప్రధాన కారణం నోటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడమే. అలాగే, కొన్నిసార్లు ఆహారంలో ఉల్లిపాయ, వెల్లుల్లి తినడం వల్ల, వాటి వాసన  నోటిలో ఎక్కువసేపు ఉంటుంది. ఇది మన చుట్టూ ఉన్న వ్యక్తులకు ఇబ్బందిని కలిగిస్తుంది. అంతే కాకుండా మనం కూడా తీవ్ర ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తుంది. కొన్నిసార్లు.. తీవ్రమైన కడుపు సంబంధిత సమస్యలు కూడా దుర్వాసనకు కారణమవుతాయి. ఈ సమస్యను ఎలా వదిలించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నోటి దుర్వాసనను నివారించడానికి మార్గాలు:
మీ నోరు ఎక్కువసేపు పొడిగా ఉండనివ్వకండి. మీ నోరు తాజాగా ఉంచడానికి రోజంతా నీరు లేదా డ్రింక్స్ తాగండి.

Advertisement

1.ప్రతి సారి భోజనం తర్వాత చిన్న ఏలకులు, దాల్చిన చెక్కలను నమలండి . మీ నోటిలో ఉత్పత్తి అయ్యే లాలాజలం మీ ఆహారాన్ని మరింత సులభంగా జీర్ణం చేయడానికి అంతే కాకుండా నోటి దుర్వాసనను నివారించడానికి సహాయ పడుతుంది.

2.గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి ఉదయం,సాయంత్రం తాగడం వల్ల నోటిలో మంట తగ్గుతుంది. అంతే కాకుండా ఇది నోటి దుర్వాసన కూడా తగ్గిస్తుంది.

Advertisement

3.నోటి దుర్వాసన నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి.. బే లీఫ్ టీ తాగండి. నాలుగు బిర్యానీ ఆకులను నీటిలో కొన్ని నిమిషాలు మరిగించి,ఆపై జల్లెడ ద్వారా వడకట్టి తాగండి.

4.కొత్తిమీర గింజలను వేయించి, రుబ్బుకుని.. దానికి కొద్దిగా నల్ల ఉప్పు వేసి, తిన్న తర్వాత కాస్త నమలండి.

Also Read: చలికాలంలో ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు..మీ కొలెస్ట్రాల్ పెంచే అలవాట్లపై ఓ కన్నేయండి

5.రోజుకు కనీసం ఒక్కసారైనా గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగాలి.

6.తులసి ఆకులను నీటిలో మరిగించి, కొద్దిగా ఉప్పు వేసి, రోజంతా ఎక్కువ సార్లు పుక్కిలించండి. ఇది నోటి దుర్వాసనను తొలగించడానికి  ఎంతగానో సహాయ పడుతుంది.

7.దుర్వాసన రాకుండా ఉండటానికి.. రోజువారీ నోటి పరిశుభ్రతను పాటించండి. ఉదయం, పడుకునే ముందు రోజుకు రెండు సార్లు బ్రష్ చేయండి. ప్రతి భోజనం తర్వాత మీ నోరు శుభ్రం చేసుకోండి. వీలైతే మౌత్ వాష్ వాడండి. ఎక్కువసేపు ఆకలితో ఉండకండి.  అంతే కాకుండా పుష్కలంగా నీరు తాగండి.

Related News

పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ.. హార్ట్‌బీట్‌తో తెలుసుకోవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

Big Stories

Advertisement
×