2026 June Bike Launches: ఇండియన్ మార్కెట్ లోకి ఈ నెలలో పలు కొత్త బైక్ మోడళ్ల విడుదల కానున్నాయి. ఈసారి విడుదల అవుతున్న బైక్స్ లో హై పర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ బైక్ లతో పాటు రోజువారీ ప్రయాణాలకు ఉపయోగపడే కమ్యూటర్ మోడళ్లు కూడా ఉన్నాయి. బైక్ ప్రియుల్లో ఇప్పటికే ఆసక్తి పెరుగుతోంది. ఇక ఈ నెలలో విడుదలయ్యే మోడల్స్ ఏవనేది ఇప్పుడు తెలుసుకుందాం..
యమహా YZF-R7 ప్రీమియం సూపర్ స్పోర్ట్ బైక్ గా రాబోతోంది. దీని అంచనా ధర సుమారు రూ.10 లక్షల నుంచి రూ.10.10 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. జూన్ 2026 మధ్యలో ఇది మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. స్పీడ్, హ్యాండ్లింగ్ పై దృష్టి పెట్టిన ఈ మోడల్ స్పోర్ట్స్ రైడింగ్ ఇష్టపడే వారికి ఎక్కువగా నచ్చుతుంది.
హీరో నుంచి రాబోతున్న మరో క్రేజీ మోడల్ కరిజ్మా XMR 250. ఈ బైక్ పైనా కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. స్పోర్ట్స్ టూరర్ సెగ్మెంట్ లోకి అడుగు పెడుతోంది. దీని ధర సుమారు రూ.2 లక్షల నుంచి రూ.2.20 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. జూన్ 2026 చివర్లో ఈ బైక్ విడుదల కావచ్చని తెలుస్తోంది. సుదూర ప్రయాణాలకు అనువుగా ఉండేలా ఈ బైక్ ను డిజైన్ చేశారు.
తేలికపాటి సూపర్ స్పోర్ట్ బైక్ గా మార్కెట్ లోకి రానుంది. దీని ధర సుమారు రూ.3.50 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. జూన్ 2026లో మార్కెట్ లోకి రానుంది. యంగ్ రైడర్లను లక్ష్యంగా చేసుకుని ఈ బైక్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ వెర్షన్ కూడా ఈ నెలలోనే విడుదల కానుంది. దీని ధర రూ.3.70 లక్షల నుంచి రూ.4.80 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ఇది పూర్తిస్థాయి సూపర్ స్పోర్ట్ కేటగిరీలోకి వస్తుంది. మిడ్ రేంజ్ స్పోర్ట్స్ బైక్‌లలో బలమైన పోటీదారుగా నిలవనుంది.
టీవీఎస్ కూడా కొత్త అపాచీ RTX 300 మోడల్ ను తీసుకురానుంది. నేకడ్ స్ట్రీట్ ఫైటర్ సెగ్మెంట్ లో వస్తుంది. దీని ధర సుమారు రూ.1.99 లక్షల వరకు ఉంటుంది. రోజువారీ సిటీ రైడింగ్ కు అనుకూలంగా ఉంటుంది.
హీరో మరోసారి కమ్యూటర్ సెగ్మెంట్ లో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్ ను విడుదల చేయనుంది. దీని ధర రూ.88,000 ఉంటుందని తెలుస్తోంది. ఇంధన పొదుపు, తక్కువ మెయింటెన్స్ ఖర్చుల కారణంగా సాధారణ వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుంది.
అటు యమహా WR155 R కూడా జూన్ 2026లో మార్కెట్‌లోకి రానుంది. ఆఫ్ రోడ్, అడ్వెంచర్ రైడింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. దీని ధర సుమారు రూ. 1.70 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.
Read Also: హీరో To హోండా.. ఇండియన్ మార్కెట్ లో ఎంట్రీ ఇస్తున్న ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్స్ ఇవే!