E-Paper
Advertisement

రేవంత్ కేబినెట్ విస్తరణ దాదాపుగా.. హోంమంత్రిగా గడ్డం ప్రసాద్‌ ఛాన్స్, స్పీకర్ పదవి ఎవరికి?

రేవంత్ కేబినెట్ విస్తరణ దాదాపుగా..  హోంమంత్రిగా గడ్డం ప్రసాద్‌ ఛాన్స్, స్పీకర్ పదవి ఎవరికి?
Advertisement

Hyderabad: రేవంత్ కేబినెట్ విస్తరణ రేపో మాపో జరగనుంది? కొత్తగా మంత్రివర్గంలోకి ఎవరు రానున్నారు? పలువురు మంత్రుల శాఖలు మారుతున్నాయా? స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కేబినెట్‌లోకి తీసుకోవాలని పార్టీ భావిస్తోందా? అందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? రేవంత్ కేబినెట్ విస్తరణపై రకరకాల వార్తలు జోరందుకున్నాయి.

రేవంత్ కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్

Advertisement

తెలంగాణలో రేవంత్‌రెడ్డి కేబినెట్ విస్తరణకు మార్గం సుగమమైంది. వచ్చేవారంలో విస్తరణ జరగవచ్చిన గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. కొందరు మంత్రులను పక్కన పెట్టవచ్చని, కొత్తగా కొందరు రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రాతినిధ్యం లేని జిల్లాలకు ఈసారి మంత్రివర్గంలో అవకాశం ఉన్నట్లు చెబుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఈసారి మంత్రి పదవి రావచ్చని అంటున్నారు.

కేబినెట్‌లోకి గడ్డం ప్రసాద్‌ను తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. పోయినవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో ఆయన భేటీ అయ్యారట. రాష్ట్రంలో రాజకీయాల గురించి ఆయన  వివరించినట్టు తెలిసింది. తనకు మంత్రి పదవి ఇవ్వాలని రాహుల్‌‌ను ఆయన కోరడం, అందుకు సానుకూలత వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాల మాట.

Advertisement

మంత్రివర్గంలోకి గడ్డం ప్రసాద్ వచ్చే అవకాశం

ప్ర‌స్తుతం ముఖ్యమంత్రి రేవంత్ వద్ద హోంశాఖ‌ ఉంది. ఆ పదవికి గడ్డం ప్రసాద్ అన్ని విధాలుగా అర్హుడని కొందరు కాంగ్రెస్ నేతల మాట. దీనికితోడు రంగారెడ్డి జిల్లా నుంచి ఆపార్టీ ఎమ్మెల్యే మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి మంత్రి ప‌దవి ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రసాద్ అయితే కరెక్టని అంటున్నారు. అదే సమయంలో నల్గొండ జిల్లా నుంచి రాజ‌గోపాల్‌రెడ్డి మంత్రి పదవి రేసులో ఉన్నారు.

ఇక గడ్డం ప్రసాద్ విషయానికి వద్దాం. ఆయన ఢిల్లీ టూర్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రసాద్ ను కేబినెట్ లోకి తీసుకుంటారన్న విషయం తెలియగానే ఆయన మద్దతుదారుల్లో ఒకటే సందడి. ప్రసాద్ కుమార్‌కు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలిసారి మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం సాగింది. కాకపోతే జిల్లాలు, సామాజిక సమీకరణల కారణంగా మంత్రి పదవికి ఆయన దూరమయ్యారు.

ALSO READ: కేంద్రమంత్రి బండి సంజయ్ కోసం ఊహించని యాత్ర

ఈ జిల్లా నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. వారిలో ఎవరికి ఇచ్చినా మళ్లీ రెడ్లకే ప్రయారిటీ ఇచ్చినట్లే అవుతుందని ఆలోచన చేస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రసాద్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదని కాంగ్రెస్ సీనియర్ల మాట. మొత్తానికి కేబినెట్ విస్తరణకు సంబంధించి రేపో మాపో అధిష్టానం నుంచి కబురురానున్నట్లు సమాచారం.

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×