E-Paper
Advertisement

Kollapur: నాడు బానిస కూలీ.. నేడు గ్రామ ప్రథమ పౌరురాలు, 30 ఏళ్ల చీకటిని చీల్చుతూ ఎగిరిన ఆత్మగౌరవ జెండా!

Kollapur: నాడు బానిస కూలీ.. నేడు గ్రామ ప్రథమ పౌరురాలు, 30 ఏళ్ల చీకటిని చీల్చుతూ ఎగిరిన ఆత్మగౌరవ జెండా!
Advertisement

ఆదివాసీ మహిళ నుంచి అమరగిరి సర్పంచ్ గా ఎదిగిన గాద ఆమెది.. 30 ఏళ్ల బానిస సంకెళ్లను తెంచుకున్న ధైర్యం వారిది…..స్వేచ్ఛ వాయువులు పీల్చుకునీ తమ గ్రామ స్వరాజ్యాన్ని తిరిగి లిఖిస్తున్న చరిత్ర వారిది… పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటి మొట్టమొదటిసారి జెండా ఎగరవేసిన ఘనత ఆ బానిస చెంచు మహిళకే దక్కింది… ఇంతకు ఏమిటా బానిసగాథ ఎవరా గిరిజన మహిళ స్టోరీలో క్లియర్ కట్ గా చూద్దాం….

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గానికి అతి సమీపంలో ఉన్న చిన్న గ్రామపంచాయతీ అమరగిరి.. ఈ ప్రాంతంలో ప్రాంతంలో ఓ ఒక విజయగాద దాగి ఉంది అది ఎవరికీ తెలియనిధి…. మొత్తం 62 కుటుంబాలు 220 మంది ఓటర్లు కలిగిన అతి చిన్న గ్రామం. శ్రీశైలం బ్యాక్ వాటర్ కు ఆనుకొని ఉన్న ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో మరో ఐలాండ్ గా పేరుగాంచింది. నల్లమల అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ఈ ప్రాంతం చుట్టూ పచ్చని చెట్లు కృష్ణమ్మ పరవళ్ళతో అక్కడికి వెళ్లిన వారిని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అయితే ఇక్కడ నివసిస్తున్న వారందరి జీవితాల గతంలో కన్నీటి గాదలే దాగి ఉన్నాయి.

Advertisement

పురుసాల లింగమ్మ పంచాయతీ ఎన్నికలకు ముందు ఈ పేరు పెద్దగా ఎవరికి తెలియదు.. శ్రీశైలం బ్యాక్ వాటర్ లో చుట్టూ నీరు ఉండే గుండ్లపెంట చెంచు పెంటలో జన్మించింది లింగమ్మ. అక్కడే పుట్టి పెరిగిన లింగమ్మకు ఆ పెంటకు చెందిన వారికి బయటి ప్రపంచం తో పెద్దగా సంబంధాలు లేవు. వారి పూర్వీకులలాగే అడవి తల్లి పై ఆధారపడి అక్కడ దొరికే చెట్ల పండ్లు, జిగురు పై ఆధారపడి జీవించేవారు.

గుండ్లపెంట లో జీవించే ఆ గిరిజనుల జీవన విధానాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది ఫిష్ మాఫియా వారిని బానిసలుగా మార్చుకునేందుకు ప్రణాళికలు రచించింది.. అనుకున్నట్టుగానే వారికి తినడానికి ఆహారంతో పాటు కొంత డబ్బు ముట్టజెప్పి వారిని నిర్బంధ కూలీలుగా మార్చారు. తీసుకున్న డబ్బులకు బదులుగా వారితో చేపల వేట కొనసాగించి వారు పెట్టిన రేటుకి చేపలను తీసుకువెళ్లి వారి అమాయకత్వాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. 2009లో కృష్ణమ్మ ఉగ్రరూపంతో గుండ్ల పెంటను ముంచెత్తింది. గుండ్లపెంట తో పాటు కారటాగు, యాసల పెంట, సైతం ముంపు గురయ్యాయి.. ప్రకృతి వైపరీత్యానికి చెంచు పెంటలకు సంబంధించిన 30 కుటుంబాలు 108 మంది బతుకు జీవుడా అనుకుంటూ సమీపాన ఉన్న అమరగిరి ప్రాంతానికి చేరుకొని అక్కడే వాళ్ళు నివాసాలు ఏర్పరుచుకున్నారు.

Advertisement

అమరగిరికి చేరుకున్న వారికి బానిస సంకెళ్లు తప్పలేదు.. పొట్ట చేత పట్టుకొని అక్కడికి వచ్చిన వారినీ వరద బాధితులుగా లెక్కించి కేర్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో 48 ఇండ్లు కట్టించారు …. గుండ్ల పెంట నుండి అమరగిరికి మకాం మారినప్పటికీ…. ఫిష్ మాఫియా వారిని వదిలిపెట్టలేదు.. అదే సమయంలో గుండ్ల పెంటకు చెందిన పురుస లింగమ్మకు నాయకత్వపు లక్షణాలు మొదటి నుండి ఉండేవి.. ఇకపై తమపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళింది.. వీరికి తోడు(FSD) ఫౌండేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండగా నిలబడి 2016లో రెస్క్యూ ఆపరేషన్ తో వారందరికీ స్వేచ్ఛ ను ప్రసాదించారు…. నాగర్ కర్నూల్ ఆర్డీవో శ్రీనివాస్ చేతుల మీదుగా 188 మందికి రిలీజ్ వాంటెడ్ సర్టిఫికెట్స్ జారీ చేయడంతో వారికి బానిస సంకెళ్ల నుండి విముక్తి కలిగింది.

2016లో రిలీజ్ బాండెడ్ సర్టిఫికెట్లు జారీ చేయడంతో ఆ చెంచులకు స్వేచ్ఛ లభించింది.. వారికి మేము ఉన్నామంటూ మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి.. స్వచ్ఛంద సంస్థల సహకారంతో లభించిన పడవలు వారి జీవనోపాధికి మరింత తోడ్పాటు ఇచ్చాయి. నిత్యం చేపల వేటకు వెళ్లి వారి రేటును వారే నిర్ణయించుకుని జీవనోపాధిని మెరుగు పరుచుకున్నారు. అక్కడినుండి వారి జీవితాలు మెల్లిమెల్లిగా మారుతూ వచ్చాయి. పర్యాటక ప్రాంతంగా ఆ ప్రాంతానికి పేరు రావడంతో జీవనోపాధి మెరుగుపడే అవకాశాలు మెరుగుపడ్డాయి…

కొద్దిరోజుల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన పురుసాల లింగమ్మ సర్పంచుగా మరో ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ పరిణామం ఒక్కసారిగా వారి జీవితాల్లో వెలుగులు నింపింద.. సొంత తమ్ముడిపై విజయం సాధించిన అక్క లింగమ్మ ఆనందంతో ఉప్పొంగిపోయింది… ఎన్నడూ జాతీయ జెండాను చూడని వారు నేడు గణతంత్ర వేడుకలు ఘనంగా జరిపారు. జెండా చూడడమే తప్ప ఏమీ తెలియని చెంచు మహిళా పురు సాల లింగమ్మ జెండా ఎగురవేసి ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యారు. తనకు వచ్చిన ఈ అవకాశం ఆదేవుడు కల్పించిందేనని, కాంగ్రెస్ పార్టీ తరఫున అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటానని అంటుంది. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామ అభివృద్ధి చేస్తానని ధైర్యంగా చెబుతుంది. గ్రామానికి రోడ్డుతో తాగునీటి సమస్యలు తీర్చేలా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తుంది.

ALSO READ: Pawan Kalyan: రాజకీయాల్లో బిజీ.. ఫ్యాన్స్ కోసం పవన్ కీలక నిర్ణయం!

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×