E-Paper
Advertisement

Mahindra BE 6 EV Fire: చూస్తుండగానే కాలి బూడిదైన మహీంద్రా ఈవీ, కంపెనీ ఏం చెప్పిందంటే?

Mahindra BE 6 EV Fire: చూస్తుండగానే కాలి బూడిదైన మహీంద్రా ఈవీ, కంపెనీ ఏం చెప్పిందంటే?
Advertisement

Mahindra BE 6 EV Fire Accident: ఇండియన్ ఆటో మోబైల్ కంపెనీ మహీంద్రా.. ఎలక్ట్రిక్ విభాగంలో రోజు రోజుకు సరికొత్త కార్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. మంచి స్టైల్ తో పాటు అద్భుతమైన రేంజ్ ఇచ్చేలా వీటిని రూపొందిస్తుంది. అయితే, తాజాగా మహీంద్రా కంపెనీకి చెందిన ఓ ఎలక్ట్రిక్ కారు రన్నింగ్ లోఉండగానే నడిరోడ్డు మీద మంటలు అంటుకున్నాయి. అందరూ చూస్తుండగానే కాలి బూడిద అయ్యింది. ఈ ఘటనపై స్పందించని మహీంద్రా కంపెనీ, ఈ ప్రమాదానికి బ్యాటరీ వ్యవస్థ కారణం కాదని చెప్పింది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

తాజాగా మహీంద్రా BE 6 ఎలక్ట్రిక్  కారు ఉత్తరప్రదేశ్‌ లోని అగ్ని ప్రమాదానికి కారణం అయ్యింది. హాపూర్ జిల్లాలో ఓ కారు రన్నింగ్ లో ఉండగానే మంటల్లో చిక్కుకుంది. UP 13U 7555 రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన EV హైవేపై ప్రయాణిస్తుండగా  మంటలు చెలరేగి, కాలి బూడిద అయ్యింది. కారు ఓనర్ అమన్ ఖర్బందా బులంద్‌ షహర్ నుంచి  హాపూర్ వైపు ప్రయాణిస్తుండగా కురానా టోల్ ప్లాజా సమీపంలో కారు నుంచి పొగలు రావడం ప్రారంభించాయి. క్షణాల్లోనే, పొగ మంటలుగా మారింది. వెంటనే కారులోని ప్రయాణీకులు కిందికి దిగారు. రోడ్డు మీదే ఈ కారు క్షణాల్లో కాలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే, హఫీజ్‌పూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఫైరింజన్ తో మంటలు ఆర్పారు.  ఈ సంఘటన కారణంగా హైవేపై కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Advertisement

అగ్ని ప్రమాదంపై స్పందించిన మహీంద్రా కంపెనీ

అటు ఈ అగ్ని ప్రమాదంపై మహీంద్రా కంపెనీ ప్రతినిధులు ఆరా తీశారు. స్పాట్ కు వచ్చి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. కారు సెన్సార్ డేటా, సాఫ్ట్‌ వేర్ డయాగ్నస్టిక్స్ ను విశ్లేషించారు. ఈ ఘటనకు EV బ్యాటరీ కారణం కాదని వెల్లడించారు. “ యూపీలో తాజాగా మహీంద్రా BE6  ఎలక్ట్రిక్ కారు అగ్ని ప్రమాదానికి కారణం అయ్యింది. టైర్ హై టెంపరేచర్ అలర్ట్  తర్వాత డ్రైవర్, అందులోని ఇతర ప్రయాణీకులు సేఫ్ గా బయటకు వచ్చారు. ఆన్ బోర్డ్ సెన్సార్లు, సాఫ్ట్‌ వేర్ డయాగ్నస్టిక్‌ లను ఉపయోగించి ఈ ఘటనకు EV బ్యాటరీ కారణం కాదని గుర్తించాం. ఈ సంఘటనకు అసలు కారణం ఏంటనేదానిపై పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది. యాక్సిలరేటర్, బ్రేక్ పెడల్స్ ఒకేసారి యూజ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు కారు డేటా చూపిస్తుంది. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడి అవుతాయి” అని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అయితే, మహీంద్రా BE 6 ఎలక్ట్రిక్ SUV మంటల్లో కాలిపోతున్న ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్యాటరీతో నడిచే వాహనాల భద్రత పట్ల ప్రజల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

మహీంద్రా BE 6 గురించి..  

Advertisement

మహీంద్రా BE 6 ఇండియ్ ఆటో మేకర్ నుంచి ఎక్కువగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారుగా గుర్తింపు తెచ్చుకుంది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) డేటా ప్రకారం, మహీంద్రా & మహీంద్రా గత సంవత్సరం 33,513 ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలను అమ్మింది.

Read Also: మారుతి నుంచి క్రేజీ కారు, వామ్మో.. అంత మైలేజ్ ఇస్తుందా?

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×