E-Paper
Advertisement

Heavy Rains: రాష్ట్రంలో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో దంచికొడుతున్న వాన, భారీ ట్రాఫిక్ జామ్

Heavy Rains: రాష్ట్రంలో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో దంచికొడుతున్న వాన, భారీ ట్రాఫిక్ జామ్
Advertisement

తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గత కొద్ది రోజులుగా భానుడి ప్రతాపంతో అల్లాడిపోతున్న ప్రజలకు వరుణుడు ఊరటనిచ్చాడు. ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోతతో సతమతమవుతున్న జనాలకు ఈ ఆకస్మిక వర్షం ఎంతో ఉపశమనాన్ని కలిగించింది. హైదరాబాద్ మహానగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తున్నాయి.

నగరంలోని ప్రధాన ప్రాంతాలైన మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ వంటి చోట్ల భారీ వర్షం కురుస్తోంది. చందానగర్, పటాన్ చెరు, కొండాపూర్, కుత్బుల్లాపూర్, లింగంపల్లి పరిసరాల్లోనూ వాన పడుతోంది. ఐటీ కారిడార్‌లో కురుస్తున్న ఈ వర్షం కారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.

Advertisement

ముఖ్యంగా సాయంత్రం వేళ ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడటంతో ట్రాఫిక్ సమస్య జటిలమైంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. అటు వర్షం.. ఇటు ట్రాఫిక్ జామ్‌తో భాగ్యనగర రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే కొన్ని గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బలమైన గాలులు వీచే సూచనలు ఉన్నందున విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద నిలబడకూడదని స్పష్టం చేసింది. వర్షం పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండటం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి. పంట నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. ప్రకృతి వైపరీత్యాల పట్ల ప్రజలు అప్రమత్తంగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ALSO READ: BARC Recruitment 2026: నిరుద్యోగులకు ఇది సూపర్ న్యూస్.. BARC‌లో ఉద్యోగాలు, నోటిఫికేషన్ పుల్ డీటైల్స్ ఇవే..

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×