E-Paper
Advertisement

TATA New EV’s 2026: సియోర్రా To అవిన్యా.. 2026లో లాంచ్ కాబోతున్న టాటా ఈవీలు ఇవే!

TATA New EV’s 2026: సియోర్రా To అవిన్యా.. 2026లో లాంచ్ కాబోతున్న టాటా ఈవీలు ఇవే!
Advertisement

దేశీ మార్కెట్లోకి టాటా మోటార్స్ 2026లో కొత్త ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. తాజాగా  అప్‌డేట్స్ ప్రకారం.. మూడు ప్రధాన మోడల్స్ కన్ఫర్మ్ అయ్యాయి. Sierra EV, Punch EV ఫేస్‌లిఫ్ట్తో పాటు Avinya ప్రీమియం బ్రాండ్ మోడల్ లాంచ్ కానున్నాయి. ఈ మూడు మోడల్స్ టాటా EV పోర్ట్‌ ఫోలియోను మరింత స్ట్రాంగ్ గా మార్చనున్నాయి.

2026లో లాంచ్ కాబోతున్న టాటా ఎలక్ట్రిక్ కార్లు

 

⦿ Tata Sierra EV

Advertisement

లాంచ్ టైమ్‌: మార్చి 2026 నాటికి లాంచ్ కానుంది.

ప్లాట్‌ ఫారమ్: acti.ev+ ప్యూర్ ఎలక్ట్రిక్ ప్లాట్‌ ఫారమ్ మీద రూపొందింది.

Advertisement

బ్యాటరీ, రేంజ్: 55 kWh, 65 kWh ఆప్షన్లు, 500+ km రేంజ్.

ఫీచర్లు: RWD, AWD (డ్యూయల్ మోటార్) ఆప్షన్లు, రెట్రో మోడర్న్ డిజైన్, పెద్ద బూట్ స్పేస్, లైఫ్‌ స్టైల్ SUV.

అంచనా ధర: రూ.16-25 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ప్రత్యేకత ఏంటి: ఐకానిక్ Sierra నేమ్‌ప్లేట్ రిటర్న్, Curvv EV, Harrier EV మధ్య పొజిషన్.

⦿Tata Punch EV Facelift

లాంచ్ టైమ్‌: 2026 ఫస్ట్ హాఫ్ లో లాంచ్ కానుంది.

అప్‌డేట్స్: మైనర్ కాస్మెటిక్ చేంజెస్, కొత్త కలర్స్, ఫ్రంట్ డిజైన్ ట్వీక్స్, అప్‌డేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బెటర్ ఆడియో సెటప్ ను కలిగి ఉంటుంది.

రేంజ్, స్పెస్: ప్రస్తుత Punch EVకి సమానంగా ఉంటుంది. సబ్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVగా రానుంది.

అంచనా ధర: ప్రస్తుత మోడల్‌ కు సమానంగా ఉంటుంది. లేదంటే కాస్త ఎక్కువగా ఉంటుంది.

ప్రత్యేకత ఏంటి: బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ SUV, బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్.

⦿Tata Avinya (ప్రీమియం EV బ్రాండ్)

లాంచ్ టైమ్‌: 2026 ఇయర్ ఎండింగ్ లో లాంచ్ కానుంది.

ప్లాట్‌ ఫారమ్: కొత్త Gen 3 స్కేట్‌బోర్డ్ బోర్న్ ఎలక్ట్రిక్ ప్లాట్‌ ఫారమ్ మీద తయారైంది.

ఫీచర్లు: ఫ్యూచరిస్టిక్ డిజైన్, మినిమలిస్ట్ ఇంటీరియర్, అరోమా డిఫ్యూజర్స్, సౌండ్‌బార్స్, అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్, ప్రీమియం కంఫర్ట్ తో రానుంది.

రేంజ్: 500+ km అంచనా.

అంచనా ధర: రూ. 30-60 లక్షలు.

ప్రత్యేకత ఏంటి: కొత్త ప్రీమియం సబ్ బ్రాండ్, డెడికేటెడ్ షోరూమ్స్, ఫైజిటల్ రిటైల్. BYD Sealion 7, Volvo EX40 లాంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Read Also:  టాటా TO బెంజ్.. బెస్ట్ లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

టాటా EVలు 2026లో వినియోగదారులను మరింత ఎక్సైటింగ్ కలిగిస్తున్నాయి. టాటా 2026లో EV మార్కెట్‌లో ఆధిపత్యం కొనసాగించాలని ప్లాన్ చేస్తోంది. Sierra EV, Avinyaతో మిడ్,  ప్రీమియం సెగ్మెంట్లలో స్ట్రాంగ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ధరలు, స్పెసిఫికేషన్స్ అధికారికంగా కన్ఫర్మ్ అయిన తర్వాత కాస్త మారే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్‌ డేట్స్ కోసం టాటా డీలర్ లేదంటే అధికారిక వెబ్‌ సైట్ చెక్ చేయడం మంచిది.

Read Also: హై మైలేజ్, లో మెయింటెనెన్స్.. మారుతి సుజుకి క్రేజీ CNG కార్లు ఇవే!

Related News

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?

మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లే ఫాస్టా? ఇదీ అసలు కథ!

ఏంటీ.. మారుతీ, హుందాయ్‌లో 5 స్టార్ సేఫ్టీ కార్లు ఉన్నాయా? ఇదిగో లిస్టు!

యమహా R2 వచ్చేసింది.. ఈ బైక్‌ లో అదిరిపోయే 5 హైలైట్స్ ఇవే!

సింపుల్ ఫ్లిప్ అప్ కాదు.. ఈ హెల్మెట్ 180 డిగ్రీలు తిరుగుతుంది!

Big Stories

Advertisement
×