E-Paper
Advertisement

Isuzu V-Cross 2026: క్రేజీ ఇసుజు D-Max V-క్రాస్ వచ్చేసింది, ఫీచర్లు అదుర్స్ అంతే!

Isuzu V-Cross 2026: క్రేజీ ఇసుజు D-Max V-క్రాస్ వచ్చేసింది, ఫీచర్లు అదుర్స్ అంతే!
Advertisement

Isuzu V-Cross 2026 Launched: ప్రముఖ ఆటో మోబైల్ దిగ్జగం ఇసుజు కంపెనీ సరికొత్త కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. D-Max V-క్రాస్ పేరుతో ఈ కారును లాంచ్ చేసింది. డిజైన్, ఫీచర్లు, మెకానికల్స్‌ లో కీలక అప్ డేట్స్ తో భారతీయ మార్కెట్ కు పరిచయం చేసింది.   లైఫ్‌ స్టైల్ పికప్ ఇప్పుడు ప్రత్యేకంగా 4×4 డ్రైవ్‌ ట్రెయిన్‌తో వస్తుంది.  ఈ కారు ధర రూ. 25.50 లక్షల నుంచి రూ. 30.28 లక్షల వరకు ఉంటాయని భావిస్తున్నారు.

2026 ఇసుజు D-Max V-క్రాస్ ఇంజిన్ గురించి

ఈ కారులో హుడ్ కింద 1.9 లీటర్ డీజిల్ ఇంజిన్ కొనసాగుతుంది. ఇది 161 bhp పవర్, 360 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. కొనుగోలుదారులు ఆరు స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్ ను ఎంచుకోవచ్చు. ఇందులో 4×2 వేరియంట్‌ను తొలగించడం, లైనప్ అంతటా 4WD ప్రమాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ని ట్రిమ్‌లలో ఆటో లాకింగ్ డిఫరెన్షియల్‌ను యాడ్ చేయడంతో పాటు ఆఫ్ రోడ్ సామర్థ్యాన్ని పెంచింది.

2026 ఇసుజు D-Max V-క్రాస్ డిజైన్, ఫీచర్లు

Advertisement

2026 ఇసుజు డి-మ్యాక్స్ V-క్రాస్  ఫ్రంట్ ఫాసియా ఇప్పుడు బ్లాక్ కలర్ డౌన్ లిప్ తో బోల్డర్ గ్రిల్‌ను కలిగి ఉంది. బంపర్ తగ్గించబడిన క్లాడింగ్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్ ను తొలగించింది. కొత్త 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ లుక్‌ కు కొత్తదనాన్ని తీసుకొచ్చాయి. అయితే క్లీనర్ ప్రొఫైల్ కోసం బ్లాక్ వీల్ ఆర్చ్, సైడ్ క్లాడింగ్ తొలగించబడ్డాయి. ఇక ఇంటీరియర్, ఫీచర్లును గమనిస్తే, లోపల, పిక్ అప్ టెక్నాలజీలో కీలక అప్ గ్రేడ్స్ ఉన్నాయి. పాత 9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ స్థానంలో పెద్ద 10.3 అంగుళాల టచ్‌ స్క్రీన్ వచ్చింది. ఇప్పుడు వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లేకు సపోర్టు చేస్తుంది. క్యాబిన్‌ లో డ్యాష్‌ బోర్డ్, డోర్లపై కాంట్రాస్ట్ ట్రిమ్ ఇన్సర్ట్‌ లు ఉన్నాయి. ఇది ప్రీమియం టచ్‌ను జోడిస్తుంది. టాప్ స్పెక్ Z ప్రెస్టీజ్ వేరియంట్ రూఫ్ మౌంటెడ్ 8 స్పీకర్ ఆడియో సిస్టమ్‌ తో మంచి మ్యూజికల్ ఎక్స్ పీరియెన్స్ ను అందిస్తుంది. ఇక భద్రత, సౌలభ్యం కూడా మెరుగుపరచబడ్డాయి. V-క్రాస్ ఇప్పుడు 360 డిగ్రీల కెమెరా సెటప్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ తో వస్తుంది. ఈ కారు రోజువారీ ఉపయోగంతో పాటు ఆఫ్ రోడ్ అడ్వెంచర్స్ కు అనుకూలంగా ఉంటుంది.

Read Also:  కియా సెల్టోస్ To హ్యుందాయ్ క్రెటా.. 2027లో లాంచ్ కాబోతున్న క్రేజీ హైబ్రిడ్ కార్లు ఇవే!

2026 ఇసుజు D-Max V-క్రాస్  వేరియంట్స్, ధర   

Advertisement

అప్ డేట్ చేసిన V-క్రాస్ మూడు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. V-క్రాస్ 4WD MT Z, V-క్రాస్ 4WD MT Z ప్రెస్టీజ్, V-క్రాస్ 4WD AT Z ప్రెస్టీజ్. ఈ కారు ధరలు రూ. 25.50 లక్షల నుంచి ప్రారంభమై రూ. 30.28 లక్షల వరకు ఉంటాయి.

Read Also:  టాటా To ఎంజీ.. ఇండియాలో చౌకైన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×