Jawa 42 Bobber All Stars Edition: జావా బైక్ ప్రియులకు మరో కొత్త ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. క్లాసిక్ లుక్, లేటెస్ట్ టచ్ తో ఆకట్టుకునే జావా 42 బాబర్ ఆల్ స్టార్స్ ఎడిషన్ మార్కెట్లోకి వచ్చింది. ఈ స్పెషల్ ఎడిషన్ ను గ్లోబల్ చెస్ లీగ్ స్ఫూర్తితో రూపొందించారు. దీని ప్రారంభ ధర రూ.2.09 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఇప్పటికే జావా 42 FJలో తీసుకొచ్చిన ఆల్ స్టార్స్ ట్రిమ్‌ను తాజాగా 42 బాబర్‌కు కూడా అందించారు. గ్లోబల్ చెస్ లీగ్ 2026 సందర్భంగా ఆనంద్ మహీంద్రా ఈ కొత్త బైక్ ను ఆవిష్కరించారు.
42 బాబర్ ఆల్ స్టార్స్ ఎడిషన్‌లో ముఖ్యంగా డిజైన్ మార్పులపైనే కంపెనీ దృష్టి పెట్టింది. ప్రత్యేకమైన గ్రాఫిక్స్, కొత్త కలర్ ఆప్షన్లతో బైక్‌కు మరింత క్రేజీ లుక్ ఇచ్చారు. ఈ మోడల్ మొత్తం ఐదు రంగుల్లో లభిస్తుంది. రంగును బట్టి ధరలో స్వల్ప తేడా ఉంది.
*Mystic Copper – రూ.2.09 లక్షలు
*Jasper Red – రూ.2.16 లక్షలు
*Silver Knight – రూ.2.18 లక్షలు
*Shadow Black – రూ.2.18 లక్షలు
*Black Mirror – రూ.2.20 లక్షలు
కొత్త ఆల్ స్టార్స్ ఎడిషన్‌లో డిజైన్ పరంగా మార్పులు చేసినప్పటికీ.. మెకానికల్‌గా మాత్రం స్టాండర్డ్ 42 బాబర్‌తో పోలిస్తే ఎలాంటి తేడా లేదు. అదే 334cc, లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ కొనసాగుతుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 7,500rpm వద్ద 29.9hp పవర్, 5,500rpm దగ్గర 30Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంటే, కొత్త ఎడిషన్‌ను కొనుగోలు చేసే వారికి ఇంజిన్ పనితీరులో మార్పు కంటే.. ప్రత్యేకమైన కలర్, గ్రాఫిక్స్, స్టైలింగ్‌నే ప్రధాన ఆకర్షణగా చెప్పొచ్చు.
జావా ఆల్ స్టార్స్ ట్రిమ్‌ను మరిన్ని మోడళ్లకు విస్తరిస్తోంది. గత నెలలో జావా 42 FJలో ఈ ట్రిమ్‌ను తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.2.02 లక్షలుగా ఉంది. ఇప్పుడు అదే ప్రత్యేక థీమ్‌ను 42 బాబర్‌కు కూడా అందించింది. దీంతో క్లాసిక్ బాబర్ డిజైన్‌ను ఇష్టపడే కస్టమర్లకు మరింత ప్రత్యేకమైన ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.
42 బాబర్ ఇప్పటికే తన బాబర్ స్టైలింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఆల్ స్టార్స్ ఎడిషన్ ద్వారా మరింత ప్రత్యేకమైన రంగులు, గ్రాఫిక్స్ అందుబాటులోకి రావడంతో బైక్ లుక్‌ను కోరుకునే యువతను ఇంకా బాగా ఆకట్టుకోనుంది. మెకానికల్ మార్పులు లేకపోవడంతో ఇది పూర్తిగా కాస్మెటిక్ అప్‌డేట్ గానే చెప్పాలి. ప్రత్యేకమైన లుక్ కోసం అదనంగా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నవారికి ఈ ఎడిషన్ అనుకూలంగా ఉంటుంది.
Read Also: టాటా ఈవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. హారియర్ పై ఏకంగా రూ.2.75 లక్షల తగ్గింపు!