E-Paper
Advertisement

జేఎస్‌డబ్ల్యూ కొత్త SUV వచ్చేస్తోంది, ఫార్చ్యూనర్‌కు ఇక చుక్కలే!

జేఎస్‌డబ్ల్యూ కొత్త SUV వచ్చేస్తోంది,  ఫార్చ్యూనర్‌కు ఇక చుక్కలే!
Advertisement

New JSW Hybrid SUV India Launch: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో కొత్తగా అడుగుపెడుతున్న జేఎస్‌డబ్ల్యూ మోటార్స్.. తన తొలి SUVతో సంచలనాలు సృష్టించేందుకు రెడీ అవుతోంది. జెటూర్ T2 ఆధారంగా రూపొందిస్తున్న ఈ కొత్త SUV, 2026 సెప్టెంబర్ లో మార్కెట్ లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కారు ధర సుమారు రూ. 38 లక్షల నుంచి రూ.40 లక్షల మధ్య ఉంటుందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.

స్పెషల్ అట్రాక్షన్ గా ప్లగ్ ఇన్ హైబ్రిడ్ పవర్‌ ట్రెయిన్

ఈ SUVలో ప్రధాన ఆకర్షణ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ (PHEV) పవర్‌ ట్రెయిన్. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 26.7kWh బ్యాటరీ ప్యాక్, డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఈ సెటప్ అంతా కలిసి సుమారు 381hp పవర్, 610Nm టార్క్‌ ను అందిస్తుంది. ఈ మోడల్‌లో ఉపయోగించిన ప్రత్యేకతల్లో ఒకటి డెడికేటెడ్ హైబ్రిడ్ ట్రాన్స్ మిషన్(DHT). ఇది సాధారణంగా ఉపయోగించే e-CVT కంటే మెరుగైన యాక్సిలరేషన్‌ను ఇస్తుంది. అయితే, కొద్దిగా మైలేజ్ తగ్గే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ, డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ బాగుంటుంది.

మొత్తం 1000 కిలో మీటర్లకు పైగా రేంజ్

Advertisement

ఈ SUV కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే సుమారు 139 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. పెట్రోల్ + ఎలక్ట్రిక్ కలిపి  1,000 కిలోమీటర్లకు పైగా రేంజ్ అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని వల్ల సుదూర ప్రయాణాలు కూడా సులభంగా ఉంటుంది.

డిజైన్ గురించి..

డిజైన్ విషయానికి వస్తే, ఈ SUV బాక్సీ స్టైల్‌తో, దృఢమైన లుక్‌ను ఇస్తుంది. బయట నుంచి చూస్తే కొంతవరకు ప్రీమియం ఆఫ్ రోడ్ వాహనాల స్టైల్‌ ను గుర్తు చేస్తుంది. పరిమాణాల పరంగా చూస్తే, టయోటా ఫార్చ్యూనర్ లాంటి పెద్ద SUVలకు సమానంగా ఉంటుంది. బూట్ స్పేస్ కూడా సుమారు 580 లీటర్ల వరకు ఉంటుంది. కుటుంబ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. లోపల కూడా ప్రీమియం ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. 15.6 ఇంచ్ టచ్‌ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 540 డిగ్రీ కెమెరా, లెవెల్ 2 ADAS సిస్టమ్స్, పనోరమిక్ సన్‌ రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇవన్నీ డ్రైవింగ్‌ ను మరింత సౌకర్యవంతంగా, సేఫ్ గా మారుస్తాయి.

Advertisement

జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ ఈ SUVను తమ ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే, కంపెనీ మార్కెట్‌ లోకి ఎంట్రీని ఒక ప్రీమియం ఉత్పత్తితో ప్రారంభించాలనుకుంటోంది. తరువాత మరిన్ని మోడళ్లను కూడా తీసుకురావాలని భావిస్తోంది. మొత్తంగా ఈ SUV ధర శ్రేణిలో ప్రస్తుతం ఉన్న స్కోడా కోడియాక్, టయోటా ఫార్చ్యూనర్ లాంటి  మోడళ్లతో ఇది పోటీ పడుతుంది. అయితే, పవర్, టెక్నాలజీ పరంగా చూస్తే, ఈ కొత్త SUV వాటికంటే ముందంజలో ఉంటుంది.

Read Also: టాటా బిగ్ ప్లాన్.. మార్కెట్లోకి ఏకంగా 5 కొత్త కార్లు!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×