Gadwal Politics: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో ఉందని ధీమా తప్ప జిల్లా మండల స్థాయిలో ఉన్న నేతలకు మాత్రం వేసి చూడక తప్పడం లేదు. అధికార కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గం కమిటీల నియామకంలో జాప్యం చేస్తున్నడంతో నాయకులు, కార్యకర్తల్లో నిరుత్సాహం పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇటీవల పార్టీ సంస్థాగతంగా వ్యవస్థీకరణలో వేగం పెంచింది.ఇప్పటికే డిసిసి అధ్యక్షులను నియమించిన పార్టీ తాజాగా కొన్ని జిల్లాలలో పూర్తిస్థాయి కమిటీలను సైతం ప్రకటించింది. అయితే జోగులాంబ గద్వాల జిల్లాలో మాత్రం ఇంకా పూర్తిస్థాయి కార్యవర్గం, కమిటీలు పెండింగ్ లోనే ఉన్నాయి. ఇటీవల ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని 14 జిల్లాలలో పూర్తిస్థాయి జిల్లా కాంగ్రెస్ కమిటీలను ప్రకటించారు. వీరిలో జిల్లా ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రెటరీ, ట్రెజరర్ ,అధికార ప్రతినిదులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులతోపాటు విస్తృత స్థాయి నిర్మాణం పూర్తి చేశారు. జిల్లాస్థాయిలో పార్టీ ముఖ్య నేతల మధ్య సయోధ్య లేని కారణంగా గద్వాల జిల్లాలో డిసిసి కార్యవర్గ జాబితా ఆగిపోయింది పూర్తి స్థాయి కమిటీలను మోక్షం కలగకపోగా పార్టీ పదవులు ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ నెలకొంది.
డిసిసి అధ్యక్షుడిగా రాజీవ్ రెడ్డిని గత నాలుగు నెలల క్రితం ప్రకటించారు. గద్వాల నియోజకవర్గానికి చెందిన యువ కాంగ్రెస్ నాయకుడు జాతీయ,రాష్ట్ర స్థాయిలో పార్టీ తరపున వివిధ స్థాయిలో బాధ్యతలను చేపట్టారు.జిల్లా స్థాయిలో యూత్ కాంగ్రెస్ పదవులు నిర్వహించి పార్టీ అధిష్టానం ఆశీస్సులతో జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టారు. పూర్తిస్థాయి కార్యవర్గం గానీ అనుబంధ కమిటీలు కానీ నియామకం జరగలేదు. దీంతో జిల్లాలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తికి గురికాగా కేడర్ లో తర్జనభర్జన నెలకొంది.తాజాగా పూర్తిస్థాయి కమిటీల ఏర్పాటు విషయం వచ్చేసరికి మళ్ళీ రాజకీయ సిఫారసులు పెరగడం పాత, కొత్త నాయకుల కలయిక తలనొప్పిగా మారుతోందన్న చర్చ పార్టీ నేతల్లో సాగుతోంది.
Also read: నూతన రైతు డిస్కంలో ప్రాంతీయ చిచ్చు.. సీఎండీ ఆఫీసులో అవమానకర సీన్లు..?
నాలుగు నెలల కిందటే డిసిసి అధ్యక్షుదీని నియమించిన కాంగ్రెస్ అధిష్టానం పలు జిల్లాల్లో పూర్తిస్థాయి కమిటీలను ఇంకా పెండింగ్లోనే ఉంచింది. దీంతో స్థానిక కేడర్లో గందరగోళం నెలకొంది.వాస్తవానికి ఫిబ్రవరి చివరి వారంలోని జిల్లాల వారీగా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ,అధికార ప్రతినిధులు, ఇతర పోస్టులకు టీపీసీసీకి జాబితా పంపడంలో సమన్వయం కుదరక వాయిదా పడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఉగాది సందర్భంగా 14 జిల్లాల కమిటీ ప్రకటించిన అధిష్టానం గద్వాలతో పాటు మరికొన్ని జిల్లా కమిటీని మాత్రం ప్రకటించలేదు. జిల్లా కమిటీలో అన్ని పోస్టుల్లో సీనియర్, కొత్త ,పాత, వర్గ పోరు పార్టీ పట్ల విధేయత వంటి వాటిపై అంచనాలలో పార్టీ తల మునకలైంది.గద్వాల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జిగా నిలబడిన సరిత సైతం పార్టీ కోసం తన వెంట ఉన్న నాయకులకు సైతం పదవులు దక్కేలా ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దగ్గర రావడం పూర్తిస్థాయిలో ఆధిపత్యం చలాయిస్తుండడం, జిల్లా అధ్యక్షుడు ఎంపికలో సైతం ఎమ్మెల్యే ప్రభావం ఉన్నట్లు చర్చ నడుస్తోంది. గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ సరిత స్థానిక నాయకత్వ తీరుపై అసంతృప్తిగా ఉంది. జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ తరపున సంపత్ కుమార్ సైతం పూర్తిస్థాయిలో ప్రభావం చూపుతున్నారు. జిల్లాలో కీలక ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యే మధ్య పోసకకపోవడం వల్ల సమస్య కొలిక్కి రావడం లేదు. ప్రస్తుతానికి పంపిన జాబితాలో అధిష్టానం పరిశీలనలో ఉండగా గద్వాల జిల్లా జాబితా మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లు కార్యకర్తలు అంటున్నారు.చాలా చోట్ల గ్రూప్ రాజకీయాలు కీలక ప్రజాప్రతినిధులు నేతల వర్గపోరు, నాయకులు, స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోటీ కారణంగా కమిటీ ఆలస్యమవుతుందన్న చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావడం, జిల్లా కమిటీ ఏర్పాటుపై నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. పార్టీ పదవి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థల్లో ఎన్నికలలో భాగంగా జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలలో సైతం పార్టీ సంస్థాగతంగా బలపడే అభ్యర్థుల గెలుపుకు కృషి చేసేందుకు జిల్లా కమిటీ దోహదపడుతుందని నేతలు అభిప్రాయపడుతున్నారు.
Also read: కానిస్టేబుల్ కళ్ళముందే దారుణం.. భార్యను అతి దారుణంగా హత్య చేసిన భర్త