Shahid Afridi : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో జరిగే ప్రతి మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. రోజు రోజుకు వ్యూయర్షిప్ పెరుగుతోంది. అయితే ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటు పైన ( Pakistan Super League Tournament) విషం కక్కే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. ఇందులో భాగంగానే లేటెస్ట్ గా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ( Shahid Afridi ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను త్వరలోనే ఐసీసీ చైర్మన్ కాబోతున్నానని.. ఆ తర్వాత పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడేలా కొత్త రూల్ తీసుకువస్తానని సంచలన ప్రకటన చేశాడు. దీంతో షాహిద్ ఆఫ్రిది ( Shahid Afridi ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
పాకిస్తాన్ సూపర్ లీగ్, అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ పోటాపోటీగా సాగుతున్నాయి. అయితే ప్రేక్షకులు లేకుండానే పాకిస్తాన్ సూపర్ లీగ్ కొనసాగుతున్న నేపథ్యంలో, జనాలందరూ ఐపీఎల్ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సంచలన ప్రకటన చేశారు. అతి త్వరలోనే తాను ఐసీసీ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ కాబోతున్నానని స్పష్టం చేశారు. ఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు.
ముందుగా ఇండియన్ ప్లేయర్ లందరూ పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఆడేలా కఠినమైన రూల్ పెడతానని హెచ్చరించారు. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను కొనసాగకుండా కఠినంగా వ్యవహరిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డులు అంతర్జాతీయంగా మరింత డెవలప్ చేస్తానని కూడా హామీ ఇచ్చారు. దీంతో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే అతని వ్యాఖ్యలపై ఇండియన్ ఫ్యాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. నీ ముఖానికి పాకిస్తాన్ చైర్మన్ కావడమే గొప్ప.. ఇంకా ఐసీసీ చైర్మన్ అవుతావా ? అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
2027 వన్డే వరల్డ్ కప్ పూర్తయ్యే వరకు ఐసీసీ చైర్మన్ ఎన్నిక అస్సలు నిర్వహించరు. 2024 డిసెంబర్ మాసంలో ఐసీసీ చైర్మన్ గా జై షా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన కచ్చితంగా మూడు సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగాల్సిందే. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారు. ఇందులో 108 దేశాలు పాల్గొంటాయి. అందరూ ఒకే చెబితేనే షాహిద్ అఫ్రిదికి అవకాశం వస్తుంది. లేకపోతే, మరోసారి జై షానే బాస్ అవుతారు.
https://www.facebook.com/photo?fbid=122175748802784311&set=a.122099109440784311