E-Paper
Advertisement

హోండా To BMW.. జూన్‌ లో మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్న 7 కొత్త కార్లు ఇవే!

హోండా To BMW.. జూన్‌ లో మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్న 7 కొత్త కార్లు ఇవే!
Advertisement

June 2026 Car Launches in India: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌ లో జూన్ లో సందడిగా మారబోతోంది. సాధారణ కార్ల నుంచి లగ్జరీ మోడళ్ల వరకు మొత్తం ఏడు కొత్త కార్లు ఈ నెలలో వినియోగదారుల ముందుకు రానున్నాయి. టాటా మోటార్స్, హోండా, BYD, స్కోడా, BMW, MINI, మెర్సిడెస్ బెంజ్ లాంటి ప్రముఖ కంపెనీలు కొత్త మోడళ్లను విడుదల చేసేందుకు రెడీ అయ్యాయి. ఇంతకీ ఆ మోడల్స్ ఏవనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ సియెర్రా EV

మాస్ మార్కెట్ విభాగంలో టాటా మోటార్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సియెర్రా EVను పరిచయం చేసే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ SUV ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించనుంది.  రియర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. హ్యుందాయ్ క్రెటా EV, MG ZS EV, మహీంద్రా BE 6 లాంటి మోడళ్లకు ఇది పోటీగా నిలవనుంది.

⦿ BYD ప్లగ్ ఇన్ హైబ్రిడ్ SUV

Advertisement

చైనా కంపెనీ BYD కూడా ఈ నెలలో కొత్త ప్లగ్ ఇన్ హైబ్రిడ్ SUVను తీసుకురానుంది. ఇది సీలియన్ 6గా ముందుకు రానుంది. ఈ SUV కేవలం 5.5 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 140 కిలోమీటర్ల వరకు ఎలక్ట్రిక్ రేంజ్‌ ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

⦿ హోండా ప్రీమియం SUV

హోండా కూడా ప్రీమియం SUV విభాగంలోకి తిరిగి అడుగుపెట్టనుంది. కంపెనీ ZR-V హైబ్రిడ్ SUVని భారత మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. 22.8 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందించే ఈ మోడల్ కేవలం 7.9 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

⦿ స్కోడా కోడియాక్ RS

Advertisement

స్కోడా కోడియాక్ RSను ఈ నెలలో విడుదల చేయనుంది. 7 సీటర్ వెర్షన్‌ లో వచ్చే ఈ SUV కేవలం 6.3 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా 231 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది.

⦿ BMW X6 M60i

లగ్జరీ విభాగంలో BMW X6 M60i మళ్లీ భారత మార్కెట్లోకి రానుంది. 4.4 లీటర్ ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ తో కూడిన ఈ SUV కూపే 4.3 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. BMW ఇప్పటికే ఈ మోడల్‌ కు బుకింగ్స్ ప్రారంభించింది.

⦿ మినీ కంట్రీమాన్ సి

జూన్ 17న మినీ కంట్రీమాన్ సి విడుదల కానుంది. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ తో వచ్చే ఈ SUVకి 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌ ను అందిస్తున్నారు.

⦿ బెంజ్ ఎస్ క్లాస్ ఫేస్‌లిఫ్ట్

ఇక ఈ నెలలో అత్యంత ఖరీదైన లాంచ్‌గా మెర్సిడెస్-బెంజ్ కొత్త ఎస్ క్లాస్ ఫేస్‌ లిఫ్ట్ నిలవనుంది. జూన్ 15న విడుదల కానున్న ఈ లగ్జరీ సెడాన్‌లో అత్యాధునిక డిజిటల్ హెడ్‌ ల్యాంప్స్, పెద్ద టచ్‌ స్క్రీన్లు, కొత్త MBUX సూపర్‌ స్క్రీన్ లాంటి ఫీచర్లు ఉంటాయి.

Read Also: టయోటా మాస్టర్ స్ట్రోక్.. భారత్‌ లోకి ఏకంగా 10కి పైగా కొత్త కార్ల ఎంట్రీ!

Related News

సింగిల్ ఛార్జ్ తో 200 కిమీ రేంజ్.. భారత్‌ లో బెస్ట్ EV స్కూటర్లు ఇవే!

2026 బ్రెజ్జా Vs హ్యుందాయ్ వెన్యూ.. ఏ SUV కొనడం బెస్ట్?

రైళ్ల భద్రతకు డిజిటల్ టెక్నాలజీ.. మూడు కొత్త యాప్‌లను ప్రారంభించిన ఇండియన్ రైల్వే!

ఒక్కొక్కటి కాదు.. ఒకేసారి 10 కొత్త మోడల్స్.. హోండా దూకుడు మామూలుగా లేదుగా!

హోండా మాస్టర్ స్ట్రోక్.. భారత్‌ లో తొలి E85 మ్యాక్సీ స్కూటర్ లాంచ్!

రూ.1 లక్షలో హీరో కొత్త EV.. మార్కెట్‌ను షేక్ చేయనున్న విడా!

ఏఐ టెక్నాలజీతో అవోర్ ఎలక్ట్రిక్ బైక్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారు!

అల్ట్రావయోలెట్ To వెస్పా.. మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Big Stories

Advertisement
×