E-Paper
Advertisement

Kawasaki Discounts: కవాసకీ క్రేజీ డిస్కౌంట్లు.. ఆ బైక్స్ మీద ఏకంగా రూ. 2.50 లక్షలు తగ్గింపు!

Kawasaki Discounts: కవాసకీ క్రేజీ డిస్కౌంట్లు.. ఆ బైక్స్ మీద ఏకంగా రూ. 2.50 లక్షలు తగ్గింపు!
Advertisement

Kawasaki Feb 2026 Discounts: స్పోర్టీ బైక్స్ తయారీ సంస్థ కవాసకి ఇండియా ఫిబ్రవరి 2026కు సంబంధించి క్రేజీ ఆఫర్లను ప్రకటించింది. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరిలో ప్రకటించిన ఆఫర్ల మళ్లీ కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్లలో రూ. 2.50 లక్షల వరకు నగదు తగ్గింపులను అందిస్తుంది. అదే సమయంలో ఫ్రీ యాక్సెసరీస్ ను కూడా అందిస్తున్నాయి. ఈ ఆఫర్లు ఫిబ్రవరి 28, 2026 వరకు అందుబాటులో ఉంటాయని కవాసకి ఇండియా ప్రకటించింది. అయితే, ఏ బైక్స్ మీద ఎంద డిస్కౌంట్ అందిస్తుంది? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఎంపిక చేసిన మోడల్స్ కు మాత్రమే!

కవాసకి ఇండియా డిస్కౌంట్లు నిర్దిష్ట మోడల్స్ మాత్రమే వర్తిస్తాయని ప్రకటించింది. నింజా 650, నింజా 500, నింజా 300కు ఈ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ తగ్గింపును సద్వినియోగం చేసుకోవాలనుకునే కస్టమర్లు పాత మోడళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ మోడల్స్ E20కి అనుగుణంగా లేవు. కవాసకి పాత స్టాక్‌ ను క్లియర్ చేయడానికి డిస్కౌంట్లను అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, కొత్త నిబంధనలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వినియోగదారులకు ఇబ్బందులు కలగనున్నాయి. ఇది మోటార్‌ సైకిల్‌ ను దీర్ఘకాలికంగా మెయింటెయిన్ చేయడం అనేది ఇబ్బంది కానుంది. ఎందుకంటే E20 ఇంధనాన్ని నాన్ కంప్లైంట్ ఇంజిన్‌లపై ఉపయోగించడం వల్ల పనితీరు, ఇంధన సామర్థ్యం తగ్గే అవకాశం ఉంటుంది.

Advertisement

Read Also: ఒకే ఛార్జ్ తో 200 కి.మీ ప్రయాణం, అదిరిపోయే మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో వచ్చేసింది!

పోటీ బైక్స్ తో పోల్చితే ధరలు ఎక్కవే!

తాజాగా డిస్కౌంట్లు బైక్‌లను మునుపటి కంటే సరసమైనవిగా చేసినప్పటికీ, 650cc కంటే తక్కువ సామర్థ్యం గల లైనప్ ప్రత్యర్థులతో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఉన్నాయి. నింజా 300 లాంచ్ అయినప్పటి నుంచి ఎటువంటి కొత్త ఆప్ డేట్స్ ను తీసుకురాలేదు. ధర ఎక్కువ అయినప్పటికీ అత్యాధునిక ఫీచర్లను కలిగి లేకపోవడంతో వినియోగదారులు నిరాసక్తి చూపిస్తున్నారు. అయితే, నింజా 300ని  ఇంజిన్ పని తీరు బాగా ఆకట్టుకుంటుంది. అయితే, పాత తరహా రైడింగ్ అనుభవం మొత్తం హార్డ్‌ కోర్ కవాసకి ఔత్సాహికులు మాత్రమే ఇష్టపడుతున్నారు. తాజా డిస్కౌంట్లతో తమ ప్రీమియం బైక్స్ అమ్మకాలను పెంచుకోవాలని కవాసకి ఇండియా భావిస్తుంది.

Advertisement

Read Also:  కళ్లు చెదిరేలా టయోటా హైలాండర్ EV 2027, ఈ కారు ప్రత్యేకతలు ఏంటో తెలుసా భయ్యా!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×