E-Paper
Advertisement

Mexican Chicken: నోరూరించే మెక్సికన్ చికెన్, ఫ్రైడ్ రైస్ తో పాటూ బెస్ట్ కాంబినేషన్

Mexican Chicken: నోరూరించే మెక్సికన్ చికెన్, ఫ్రైడ్ రైస్ తో పాటూ బెస్ట్ కాంబినేషన్
Advertisement

మెక్సికన్ వంటకాలు అంటే కొంచెం స్పైసీగా, ట్యాంగీగా, సాస్‌తో నిండుగా ఉంటాయి. అలాంటి వంటకాల్లో మెక్సికన్ చికెన్ చాలా పాపులర్. వీటిని చాలా సులువుగా ఇంట్లోనే తయారు చేయవచ్చు. రోటీ, ఫ్రైడ్ రైస్, నూడుల్స్ తో పాటూ ఈ మెక్సికన్ చికెన్ తింటే రుచి అదిరిప్్తుంది. మెక్సికన్ చికెన్ ఎలా చేయాలో తెలుసుకోండి.

మెక్సికన్ చికెన్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బోన్‌లెస్ చికెన్ – ఒక కిలో
వంట నూనె – నాలుగు టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
వైట్ పెప్పర్ పొడి – ఒక టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత
వెనిగర్ – 4 టేబుల్ స్పూన్లు
టమాటా పేస్ట్ – 2 కప్పులు
టమాటా క్యాచప్ – 2 కప్పులు
క్యాప్సికం – 2
ఎండు ఎర్ర మిర్చి – 8 నుంచి 10 (చిన్న ముక్కలుగా కోయాలి)
స్ప్రింగ్ ఆనియన్ – కొద్దిగా (గార్నిష్ కోసం)

Advertisement

Also read: Carrot Bobbatlu: క్యారెట్ హల్వా స్టఫ్ చేసిన బొబ్బట్లు రెసిపీ.. చూస్తేనే నోరూరిపోతుంది

మెక్సికన్ చికెన్ రెసిపీ
1. ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి నీరు పూర్తిగా తీసేయాలి. తర్వాత ఒక పెద్ద గిన్నెలో చికెన్ వేసి అందులో వెల్లుల్లి పేస్ట్, వైట్ పెప్పర్ పొడి, ఉప్పు, వెనిగర్ వేసి బాగా కలపాలి.
2. ఆ చికెన్ ను అరగంట పాటూ పక్కన పెట్టి మ్యారినేషన్ కోసం వదిలేయాలి.
3. ఇప్పుడు ఒక వెడల్పైన కళాయిని స్టవ్ మీద పెట్టి నూనె వేసి మీడియం మంట మీద ఉంచాలి.
4. నూనె వేడెక్కిన తర్వాత మేరినేట్ చేసిన చికెన్ ముక్కలను పాన్‌లో వేసాలి. మొదట చికెన్ నుంచి కొంచెం నీరు వస్తుంది.
5. ఆ నీరు పూర్తిగా ఆవిరైపోయే వరకు మూత పెట్టకుండా వండాలి. మధ్య మధ్యలో చికెన్ ముక్కలు అంటుకోకుండా కలుపుతూ ఉండాలి.
6. చికెన్ పూర్తిగా ఉడికే వరకు నెమ్మదిగా వండాలి. ఈ దశలో చికెన్ బాగా సాఫ్ట్‌గా మారుతుంది.
7. చికెన్ బాగా ఉడికిన తర్వాత అందులో టమాటా పేస్ట్, టమాటా కెచప్ వేసి బాగా కలపాలి.
8. ఇప్పుడు మంటను కొంచెం తగ్గించి సాస్ చికెన్‌కు బాగా పట్టేలా 5 నుంచి 7 నిమిషాలు వండాలి. ఈ దశలోనే ఈ డిష్‌కు అసలు మెక్సికన్ ఫ్లేవర్ వస్తుంది.
9. సాస్ ఎక్కువగా నీళ్లలా ఉంటే ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. కొంచెం గట్టిగా ఉంటే రుచి బాగా వస్తుంది.
10. ఇప్పుడు క్యాప్సికం ముక్కలు, ఎండు మిర్చి ముక్కలను వేయాలి. కేవలం 3 నుంచి 4 నిమిషాలు వేయిస్తే చాలు.
11. చివరగా మంట ఆఫ్ చేసి పైన స్ప్రింగ్ ఆనియన్ చల్లి గార్నిష్ చేయాలి. అంతే రుచికరమైన మెక్సికన్ చికెన్ సిద్ధం.

Advertisement

Also read: Chilli Paneer Recipe: చైనీస్ స్టైల్‌లో చిల్లి పనీర్ రెసిపీ, దీన్ని ఎలా చేయాలంటే

ఈ మెక్సికన్ చికెన్‌ను ఫ్రైడ్ రైస్, జీరా రైస్, రోటీ, నాన్ తో తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. లేదా సాయంత్రం స్నాక్ లా తిన్నా కూడా బావుంటుంది. పిల్లలకు కూడా ఇది బాగా నచ్చుతుంది.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×