E-Paper
Advertisement

Kawasaki Ninja 300: కవాసకి అదిరిపోయే డిస్కౌంట్, నింజా 300 మీద ఏకంగా..

Kawasaki Ninja 300: కవాసకి అదిరిపోయే డిస్కౌంట్, నింజా 300 మీద ఏకంగా..
Advertisement

Kawasaki Ninja 300 Bike Discount: యువతను అద్భుతంగా ఆకట్టుకునే సూపర్ డూపర్ బైక్స్ తీసుకురావడంలో కవాసకి ముందుంటుంది. రేసర్లకు అనుకూలంగా ఉండే పలు రకాల మోడల్స్ ను తీసుకొచ్చింది. ఇండియాలోనూ ఈ కంపెనీకి చెందిన పలు సూపర్ బైక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇయర్ ఎండింగ్ సందర్భంగా పలు కంపెనీలు తమ బైక్స్ మీద భారీ డిస్కౌంట్లు ఇస్తున్న నేపథ్యంలో నింజా కూడా భారీ తగ్గింపు అందిస్తోంది. ముఖ్యంగా పాపులర్ ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ అయిన నింజా మీద క్రేజీ ఆఫర్ అందిస్తుంది. డిజైన్, పెర్ఫార్మెన్స్ సూపర్‌ స్పోర్ట్ స్టైల్‌ తో ఆకట్టుకునే ఈ బైక్ మీద రూ. 25,000 తగ్గింపు ఇస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లోనూ రూ. 25,000 డిస్కౌంట్ ఆఫర్ ఉండేది. అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతోంది. ఈ బైక్ ఖరీదు ప్రస్తుత ధర రూ. 3.43 లక్షల నుంచి రూ. 3.18 లక్షల(ఎక్స్ షోరూమ్)కు తగ్గింది.

నింజా 300 ప్రస్తుత ధర, ఆఫర్లు

ప్రస్తుతం ఈ బైక్ ఎక్స్ షో రూమ్ ధర సుమారు రూ. 3.17 లక్షలు నుంచి రూ. 3.43 లక్షల వరకు లభిస్తుంది. సిటీ, మోడల్ ఆధారంగా మారే అవకాశం ఉంటుంది. కొంత మంది డీలర్లు MY2024 స్టాక్‌పై డిస్కౌంట్లు ఇస్తున్నారు. సుమారు రూ. 25,000 వరకు నిర్దిష్ట తగ్గింపు అందిస్తున్నారు. Versys-X 300పైనా ఇదే మొత్తంలో తగ్గింపు అందిస్తుంది.

కవాసకి నింజా 300 స్పెసిఫికేషన్స్

Advertisement

296 cc, లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్ పారలల్-ట్విన్, DOHC, 8-వాల్వ్స్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 39 PS @ 11,000 rpm పవర్ అందిస్తుంది. 26.1 Nm @ 10,000 rpm టార్క్ ను అందిస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్, అసిస్ట్,  స్లిప్పర్ క్లచ్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంటుంది. టాప్ స్పీడ్ సుమారు 160-180 km/h ఉంటుంది. 6 సెకెన్లలో 0-100 km/h స్పీడ్ అందుకుంటుంది. మైలేజ్ 25-30 kmpl వరకు లభిస్తుంది. వెయిట్ 179 kg ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 17 లీటర్లు ఉంటుంది.

Read Also: వోక్స్‌ వ్యాగన్ నుంచి మైండ్ బ్లోయింగ్ కార్లు, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

సస్పెన్షన్, బ్రేక్స్,  టైర్స్

Advertisement

ఫ్రంట్ సస్పెన్షన్ 37 mm టెలిస్కోపిక్ ఫోర్క్, రియర్ సస్పెన్షన్ బాటమ్ లింక్ యూని ట్రాక్ గ్యాస్ చార్జ్డ్ షాక్ను కలిగి ఉంటుంది.  ఫ్రంట్ బ్రేక్ 290 mm పెటల్ డిస్క్ తో వస్తుంది. రియర్ బ్రేక్ 220 mm పెటల్ డిస్క్ ఉంటుంది. సేఫ్టీ విషయానికి వస్తే డ్యూయల్ ఛానల్ ABSను కలిగి ఉంటుంది. హెడ్‌ లైట్  డ్యూయల్ ప్రొజెక్టర్ ఉంటుంది. లార్జర్ సైజ్ విండ్‌ స్క్రీన్ ఉంటుంది.  సుమారు మూడు రంగుల్లో ఈ బైక్ అందుబాటులో ఉంటుంది. స్లిప్పర్ క్లచ్, పెటల్ డిస్క్ బ్రేక్స్, అనలాగ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ను కలిగి ఉంటుంది. ఈ బైక్ స్మూత్ ఇంజన్, గుడ్ హ్యాండ్లింగ్, హైవే క్రూజింగ్‌కు బెస్ట్. కానీ మోడర్న్ ఫీచర్స్ ముఖ్యంగా LED లైట్స్, TFT డిస్‌ ప్లే, ట్రాక్షన్ కంట్రోల్ లేవు.

Read Also: స్కోడా నుంచి దుమ్మురేపే కార్లు, మొత్తం ఎన్ని మోడల్స్ వస్తున్నాయంటే?

Related News

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

Big Stories

Advertisement
×