E-Paper
Advertisement

Upcoming Volkswagen Cars 2026: వోక్స్‌ వ్యాగన్ నుంచి మైండ్ బ్లోయింగ్ కార్లు, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

Upcoming Volkswagen Cars 2026: వోక్స్‌ వ్యాగన్ నుంచి మైండ్ బ్లోయింగ్ కార్లు, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!
Advertisement

Volkswagen Cars 2026: వోక్స్‌ వ్యాగన్ ఇండియా 2026లో ఆటో మోబైల్ మార్కెట్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతోంది. ముఖ్యంగా మూడు కొత్త మోడల్స్ తో వినియోగదారుల ముందుకు రాబోతోంది. వీటిలో ఒక కొత్త ప్రీమియం 7-సీటర్ SUV, రెండు పాపులర్ మోడల్స్ ఫేస్‌లిఫ్ట్స్ ఉన్నాయి. ఇవి Taigun, Virtus సేల్స్‌ కు బూస్టింగ్ ఇచ్చి,  ప్రీమియం సెగ్మెంట్‌ లో వోక్స్‌ వ్యాగన్ బ్రాండ్‌ను మరితం బలోపేతం చేయనున్నాయి.  ఇంతకీ ఆ మూడు కొత్త మోడల్స్ ఏవి? వాటి ప్రత్యేకత ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ Volkswagen Tayron (కొత్త 7-సీటర్ ప్రీమియం SUV)

ఈ కారు 2026 మిడ్ ఇయర్ లో లాంచ్ కావచ్చని ఆటో మోబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. జనవరి-జూన్ మధ్య ఈ కారును పరిచయం చేసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. అంచనా ధర విషయానికి వస్తే రూ.45-50 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని భావిస్తున్నారు.

Advertisement

Volkswagen Tayron  కీ ఫీచర్లు

Tiguan Allspace రీప్లేస్‌ మెంట్, 3-రో సీటింగ్, లాంగర్ వీల్‌ బేస్, Tiguan R-Line లాంటి డిజైన్, మరింత స్పేషియస్ ను కలిగి ఉంటుంది. 2.0L TSI పెట్రోల్ (204 hp, 320 Nm) ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 7-స్పీడ్ DSG ఆటోమేటిక్, AWDను కలిగి ఉంటుంది.  ప్రీమియం ఇంటీరియర్, లార్జ్ టచ్‌ స్క్రీన్, డిజిటల్ కాక్‌ పిట్, ADASతో వస్తుంది. ఈ కారు Toyota Fortuner, Skoda Kodiaq, Jeep Meridianతో పోటీ పడుతుంది. .

⦿ Volkswagen Taigun Facelift (కాంపాక్ట్ SUV అప్‌డేట్)

Advertisement

ఈ కారు 2026 థర్డ్ క్వార్టర్ లో జులై-సెప్టెంబర్ మధ్య విడుదల కానుంది. అంచనా ధర రూ.  12-19 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు.

Volkswagen Tayron  కీ ఫీచర్లు

రివైజ్డ్ ఫ్రంట్/రియర్, న్యూ అల్లాయ్ వీల్స్, అప్‌ గ్రేడెడ్ ఫీచర్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 360° కెమెరా, లెవెల్ 2 ADAS లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇంజన్ విషయానికి వస్తే, 1.0L TSI (115 hp), 1.5L TSI (150 hp) సామర్థ్యంతో వస్తుంది. 1.0Lకి కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్ రావచ్చు. ఈ కారు Hyundai Creta, Kia Seltos, Maruti Grand Vitara లాంటి కార్లకు పోటీ ఇవ్వనుంది.

⦿ Volkswagen Virtus Facelift (మిడ్-సైజ్ సెడాన్ అప్‌డేట్)

ఈ కారు 2026 చివరి క్వార్టర్ లో అంటే అక్టోబర్-డిసెంబర్ మధ్యలో విడుదల కానుంది. దీని అంచనా ధర రూ. రూ. 12-18 లక్షలు ఉంటుంది.

Volkswagen Virtus Facelift కీ ఫీచర్లు

అప్‌డేటెడ్ ఫ్రంట్, రియర్, న్యూ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. Taigun ఫేస్‌ లిఫ్ట్‌ తో లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ADAS, బెటర్ టచ్‌ స్క్రీన్ ఉంటుంది. ఇంజన్స్ 1.0L, 1.5L TSI పెట్రోల్ వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి. ఈ కార్లు Honda City, Hyundai Verna, Skoda Slavia లాంటి కార్లకు గట్టిపోటీ ఇవ్వనుంది.

అటు Volkswagen Tera (సబ్-4m కాంపాక్ట్ SUV), Volkswagen ID.4 (ఎలక్ట్రిక్ SUV) లాంటి కార్లు కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Read Also: కియా To హోండా.. 2026లో లాంచ్ కాబోతున్న సూపర్ మిడ్ సైజ్ SUVలు ఇవే!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×