E-Paper
Advertisement

Kawasaki Versys: కవాసకీ లవర్స్ కు క్రేజీ న్యూస్, ఈ బైక్ మీద ఏకంగా లక్ష డిస్కౌంట్!

Kawasaki Versys: కవాసకీ లవర్స్ కు క్రేజీ న్యూస్, ఈ బైక్ మీద ఏకంగా లక్ష డిస్కౌంట్!
Advertisement

Kawasaki Versys 1100 Discount: స్టోర్ట్స్ బైక్స్ కు పెట్టింది పేరు అయిన కవాసకీ.. ఎప్పటికప్పుడు యువతను ఆకట్టుకునే సరికొత్త బైక్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో పలు మోడల్స్ ను సేల్ చేస్తోంది. తాజాగా కంపెనీ వినియోగదారులకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. కవాసకి తన MY2025 మోటార్‌ సైకిళ్లపై భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది. నూతన సంవత్సర ఆఫర్ లో భాగంగా ఈ తగ్గింపు అందిస్తోంది. 2025 వెర్సిస్ 1100 మోడల్ ఏకంగా రూ. 1 లక్ష తగ్గింపుతో లభిస్తుంది.

ఈ ఆఫర్ ఎప్పటి వరకు అంటే?

కవాసకీ తాజాగా ఆఫర్ జనవరి 31, 2026 వరకు లేదంటే, స్టాక్ ఉన్నంత వరకు చెల్లుతుందని కంపెనీ వెల్లడించింది. డిస్కౌంట్ వోచర్‌ ను బైక్ ఎక్స్ షోరూమ్ ధరతో రీడీమ్ చేసుకోవచ్చని తెలిపింది. వాస్తవానికి వెర్సిస్ 1100 మోడల్ ధర రూ. 13.89 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తర్వాత ఈ బైక్ రూ. 12.89 లక్షలకు తగ్గుతుంది. ఆన్ రోడ్ విషయానికి వస్తే, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఖర్చులతో కలిపి మరికాస్త ఎక్కువగా ఉంటుంది.

ధరల తగ్గింపునకు కారణం ఏంటంటే?

Advertisement

నిజానికి  GST 2.0 సంస్కరణల తర్వాత, పెరిగిన పన్ను రేటును భర్తీ చేయడానికి కవాసకి వెర్సిస్ 1100 ధరను రూ. 90,000 పెంచింది. ఈ నేపథ్యంలో అమ్మకాలు తగ్గిపోయాయి. గత ఏడాది యూనిట్లు చాలా వరకు అలాగే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో ఇన్వెంటరీని ఆఫ్‌ లోడ్ చేయడంలో భాగంగా డిస్కౌంట్ ఆఫర్ ను తీసుకొచ్చింది. ఈ తగ్గింపుతో మిగిలిపోయిన యూనిట్లను సేల్ చేయాలని భావిస్తోంది. ఏకంగా రూ. 1 లక్ష తగ్గడంతో కొనుగోలుదారులు ఆసక్తి కనబరుస్తున్నారు.

Read Also: చేతక్ లవర్స్ కు గుడ్ న్యూస్, ఆ ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్!

వెర్సిస్ 1100 బైక్ గురించి..

Advertisement

వెర్సిస్ 1100 బైక్ లో 1,099cc ఇంజిన్ ఉంటుంది. ఇన్‌ లైన్ ఫోర్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ తొ వస్తుంది. ఇది  9,000rpm దగ్గర 133bhp పవర్ ను అందిస్తుంది. 7,600 rpm వద్ద 112Nm గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ ఆరు స్పీడ్ గేర్‌ బాక్స్‌ ను కలిగి ఉంటుంది.

Read Also: రాయల్ ఎన్ఫీల్డ్ To హీరో.. ఇండియాలో బెస్ట్ అండ్వెంచర్ బైక్స్ ఇవే!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×