E-Paper
Advertisement

కియా సోరెంటో హైబ్రిడ్ టెస్టింగ్ షురూ, లాంచింగ్ ఎప్పుడో తెలుసా?

కియా సోరెంటో హైబ్రిడ్  టెస్టింగ్ షురూ, లాంచింగ్ ఎప్పుడో తెలుసా?
Advertisement

Kia Sorento Test Mule Spotted: భారతీయ మార్కెట్‌ లోకి సరికొత్త ప్రీమియం ఎస్‌యూవీ అడుగు పెట్టబోతోంది. కియా సోరెంట్ హైబ్రిడ్ వెర్షన్ త్వరలోనే విడుదల కాబోతోంది. తాజాగా ఈ కారు రోడ్ టెస్టింగ్ కు సంబంధించిన స్పై షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతకు ముందు ఈ మోడల్ కేవలం ఓ ప్రదేశంలో నిలిపి ఉంచిన ఫోటో కనిపించగా, ఇప్పుడు రియల్ రోడ్ టెస్టింగ్ ప్రారంభమవడంతో, విడుదలకు ముందు స్పీడ్ టెస్ట్ జరుగుతోందని అర్థమవుతోంది.

కేమోఫ్లాజ్‌తో కప్పబడి ఉన్నప్పటికీ..

Advertisement

హైవేలపై కనిపించిన టెస్ట్ వెహికల్ పూర్తిగా కేమోఫ్లాజ్‌ తో కప్పబడి ఉన్నప్పటికీ, దాని ఆకారం, పరిమాణం చూసినప్పుడు సోరెంటోనే అని అర్థం అవుతోంది. డిజైన్‌ లో నిటారుగా ఉండే బాడీ, పెద్ద సైజ్, పొడవైన వీల్‌ బేస్ లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇవి ఈ ఎస్‌యూవీకి రోడ్డుపై బలమైన ప్రెజెన్స్ ను అందిస్తున్నాయి.

ఇక పక్కనుంచి చూస్తే, పెద్ద అల్లాయ్ వీల్స్, బాడీ క్లాడింగ్ లాంటి అంశాలు కనిపిస్తున్నాయి. వెనుక భాగం కూడా పెద్దగా ఉండేలా రూపొందించారు. టెయిల్ ల్యాంప్‌ లు పూర్తిగా కనిపించకపోయినా, గ్లోబల్ మోడల్ తరహాలో లేటెస్ట్ ఎల్ఈడి లైటింగ్‌ తో ఉండే అవకాశముంది. మొత్తంగా, ఈ వాహనం భారతీయ రహదారులకు అనుగుణంగా పరీక్షలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ కొత్త మోడల్ ఏ రేంజ్ లో ఉంటుందంటే?

Advertisement

ఈ కొత్తకారు విడుదలైన తర్వాత, భారత్ లో కియా కంపెనీ లైనప్‌ లో ఉన్న సెల్టోస్, కేరెన్స్ కంటే పై స్థాయిలో ఉంటుంది.  ఇది మూడు వరుసల సీటింగ్‌ తో వచ్చే ఫ్యామిలీ ఎస్‌యూవీగా అందుబాటులోకి రానుంది. సుమారు 4.8 మీటర్ల పొడవు కలిగిన ఈ మోడల్, ప్రస్తుతం టయోటా ఇన్నోవా హైక్రాస్ లాంటి వాహనాలు ఉన్న సెగ్మెంట్‌ లో గట్టి పోటీ ఇవ్వనుంది.

హైబ్రిడ్ టెక్నాలజీతో ఉంటుందా?

ఈ కొత్త మోడల్‌ లో హైబ్రిడ్ టెక్నాలజీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. గతంలో వెల్లడైన వివరాల ప్రకారం, టెస్ట్ యూనిట్‌ లో రోటరీ గేర్ సెలెక్టర్ ఉండటం కనిపించింది.  ఇది హైబ్రిడ్ వేరియంట్ అయి ఉండొచ్చని సూచిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో సోరెంటో పెట్రోల్, టర్బో పెట్రోల్, హైబ్రిడ్ ఆప్షన్లతో లభిస్తుంది. భారత్ లో మాత్రం ఇంధన సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని హైబ్రిడ్ మోడల్‌ కు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది.

ధర ఎంత ఉంటుందంటే?

తయారీ విషయంలో కూడా కియా ప్రత్యేక వ్యూహం అనుసరిస్తోంది. ఈ ఎస్‌యూవీని దేశంలోనే తయారు చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయడం వల్ల ధరను పోటీ స్థాయిలో ఉంచే అవకాశం ఉంది. అంచనా ప్రకారం దీని ధర రూ. 30 లక్షల నుంచి 40 లక్షల మధ్య ఉండవచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఎస్‌యూవీ, 2026 చివరి నాటికి భారత మార్కెట్‌లోకి రావచ్చని భావిస్తున్నారు. త్వరలోనే దీని ఫీచర్లు, డిజైన్, ఇంజిన్ ఎంపికలపై పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Read Also: ఇవి స్కూటర్లు కాదు, కదిలే కళాఖండాలు.. జపాన్‌లో నయా ట్రెండ్!

Related News

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

Big Stories

Advertisement
×