E-Paper
Advertisement

4 గంటల విమాన ప్రయాణం.. ఆకాశంలో నరకం చూసిన మహిళ.. చేతులెత్తి మెుక్కుతూ వీడియో!

4 గంటల విమాన ప్రయాణం.. ఆకాశంలో నరకం చూసిన మహిళ.. చేతులెత్తి మెుక్కుతూ వీడియో!
Advertisement

Fly91 Flight Scare: హైదరాబాద్ నుండి హుబ్లీ (Hubballi)కి వెళ్తున్న Fly91 (IC3401) విమానంలో ప్రయాణీకులకు ఎదురైన భయానక అనుభవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ల్యాండింగ్ సాధ్యం కాక విమానం గాల్లో చక్కర్లు కొడ్డటంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సురక్షితంగా ల్యాండ్ అవుతామో లేదో తెలియక.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడిపారు. ఓ మహిళ ప్రయాణికురాలు భగవంతుడ్ని ప్రార్థిస్తూ.. ప్రాణాలతో బయటపడేయాలని ప్రార్ధనలు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

అసలేం జరిగిందంటే?

ఆదివారం (ఏప్రిల్ 19) మధ్యాహ్నం సుమారు 3 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరిన Fly91 (IC3401) విమానం.. హుబ్లీ చేరుకునే సమయానికి చిక్కుల్లో పడింది. వాతావరణం అనుకూలించకపోవడంతో పైలెట్ కు ల్యాండింగ్ సాధ్యం కాలేదు. దీంతో విమానం గాలిలోనే సుమారు 4 గంటల పాటు చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. విమానం గాలిలో ఎక్కువ సేపు ఉండటంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఓ మహిళ చేతులు జోడించి దేవుడిని ప్రార్థిస్తూ, భయంతో ఏడుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

Advertisement

 

ప్రయాణికుల మాటలు రికార్డు

Advertisement

మరోవైపు విమానం లోపల కొందరు ప్రయాణికులు ‘ఓ మై గాడ్’ అని అరవడం కూడా వీడియోలో రికార్డ్ అయ్యింది. మరికొందరు తమను బెంగళూరుకు తీసుకెళ్లాలని పైలట్‌ను వేడుకోవడం కూడా కనిపించింది. ‘అయ్యో దేవుడా .. ఇతను ఎందుకిలా చేస్తున్నాడు’ అని పైలెట్ ను ఉద్దేశించి మరో వ్యక్తి మాట్లాడటం కూడా వీడియోలో వినిపించింది. ‘ఏడవకు, ఏడవకు.. ఏమీ కాదు’ అని ఇంకో వ్యక్తి సర్దిచెప్పడం కూడా రికార్డు అయ్యింది. మరోవైపు ఈ ఘటనపై ప్రయాణికుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానం ల్యాండింగ్ కు 4 గంటలు ఆలస్యమైనా తమకు ఎలాంటి సమాచారం అందించలేదని మండిపడ్డారు. ఎయిర్ లైన్స్ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంగా ప్రవర్తించారని ఆరోపించారు.

Also Read: India Korea: భారత్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు.. మోదీతో అత్యవసర భేటి.. 8 ఏళ్ల తర్వాత ఎందుకీ ఆకస్మిక పర్యటన!

ఎయిర్‌లైన్ వివరణ

మరోవైపు తమ ఫ్లైట్ ఆలస్యంగా ల్యాండ్ కావడంపై Fly91 సంస్థ వివరణ ఇచ్చింది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందని వచ్చిన వార్తలను ఖండించింది. కేవలం ప్రతికూల వాతావరణం వల్లే విమానాన్ని దారి మళ్లించాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. చివరకు విమానాన్ని బెంగళూరు లోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించి రాత్రి 7:30 గంటల ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. వాతావరణం అనుకూలించిన తర్వాత హుబ్లీకి, అక్కడి నుంచి హైదరాబాద్ కు Fly91 విమానం తిరిగివచ్చిందని ఎయిర్ లైన్స్ సంస్థ ప్రకటించింది.

Also Read: శాంసంగ్ ఏఐ స్మార్ట్ గ్లాసెస్.. కుర్రకారుకు పండుగే.. ఫొటోలు, వీడియోలు మీ ఇష్టం!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×