E-Paper
Advertisement

కియా సైరోస్, VF6 మధ్య గట్టి పోటీ.. రెండింటిలో ఏ ఎలక్ట్రిక్ SUV కొనడం బెస్ట్?

కియా సైరోస్, VF6 మధ్య గట్టి పోటీ.. రెండింటిలో ఏ ఎలక్ట్రిక్ SUV కొనడం బెస్ట్?
Advertisement

Kia Syros EV vs VinFast VF6 Comparison: భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా కియా కొత్త సైరోస్ EVని మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ మోడల్ ప్రారంభం ధరను రూ.13.50 లక్షలుగా నిర్ణయించింది. ఈ మోడల్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న విన్‌ ఫాస్ట్ VF6తో పోటీ పడుతోంది. ఇంతకీ ఈ రెండు ఎలక్ట్రిక్ SUVల్లో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ధర గురించి..

ధర విషయంలో కియా సైరోస్ EV ముందుంటుంది. దీని ప్రారంభ ధర రూ.13.50 లక్షలు కాగా, టాప్ వేరియంట్ రూ.20 లక్షల వరకు ఉంది. బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) స్కీమ్ ద్వారా ప్రారంభ ధరను రూ.7.99 లక్షలకు తగ్గించే అవకాశం కూడా ఉంది. మరోవైపు విన్‌ఫాస్ట్ VF6 ధర రూ.18.19 లక్షల నుంచి రూ.20.09 లక్షల వరకు ఉంటుంది.

డిజైన్ గురించి..

Advertisement

సైజు పరంగా రెండు SUVలు దాదాపు ఒకే స్థాయిలో ఉన్నా, కొన్ని తేడాలు ఉన్నాయి. విన్‌ఫాస్ట్ VF6 కొద్దిగా పొడవుగా ఉండటం వల్ల వెనుక సీట్లలో లెగ్‌ రూమ్ ఎక్కువగా ఉంటుంది. అయితే, కియా సైరోస్ EVలో 465 లీటర్ల బూట్ స్పేస్ ఉండటం కుటుంబ ప్రయాణాలకు మరింత ఉపయోగపడుతుంది.

బ్యాటరీ, రేంజ్, పనితీరు గురించి..

కియా సైరోస్ EV రెండు బ్యాటరీ ఎంపికల్లో లభిస్తుంది. 42 kWh బ్యాటరీతో 443 కిలోమీటర్ల వరకు, 51.4 kWh బ్యాటరీతో గరిష్టంగా 526 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది. విన్‌ఫాస్ట్ VF6 మాత్రం 59.6 kWh బ్యాటరీతో వస్తుంది. దీని రేంజ్ సుమారు 463 నుంచి 468 కిలోమీటర్ల వరకు ఉంటుంది. పవర్ విషయంలో మాత్రం VF6 కాస్త ముందంజలో ఉంటుంది.  గరిష్టంగా 204 PS శక్తిని అందిస్తుంది. కియా సైరోస్ EVలో టాప్ వేరియంట్ 171 PS పవర్‌ ను ఉత్పత్తి చేస్తుంది. వేగవంతమైన పనితీరు కోరుకునే వారికి VF6 బెస్ట్. కానీ ఎక్కువ రేంజ్ కోరుకునేవారికి సైరోస్ EV అనుకూలంగా ఉంటుంది.

ఫీచర్ల గురించి..

Advertisement

ఫీచర్ల పరంగా రెండు SUVలు కూడా ప్రీమియం రేంజ్ లో ఉన్నాయి. పెద్ద టచ్‌ స్క్రీన్, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే, 360 డిగ్రీ కెమెరా, లెవెల్-2 ADAS, క్రూయిజ్ కంట్రోల్ లాంటి ఆధునిక సదుపాయాలు రెండింటిలోనూ ఉన్నాయి. అయితే కియా సైరోస్ EVలో కొన్ని అదనపు ఫీచర్లు ఉన్నాయి. ముందు, వెనుక వెంటిలేటెడ్ సీట్లు, 64 కలర్స్ యాంబియంట్ లైటింగ్, డిజిటల్ కీ, హార్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, V2L, V2V లాంటి టెక్నాలజీలతో ఆకట్టుకుంటుంది. విన్‌ ఫాస్ట్ VF6లో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 8వే పవర్డ్ డ్రైవర్ సీట్, 7 ఎయిర్‌ బ్యాగ్స్ లాంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా దీనికి 5-స్టార్ BNCAP సేఫ్టీ రేటింగ్ కూడా లభించింది.

ఎవరికి ఏది బెస్ట్ అంటే?

తక్కువ ధరలో ఎక్కువ రేంజ్, ప్రీమియం ఫీచర్లు, పెద్ద బూట్ స్పేస్ కావాలంటే కియా సైరోస్ EV మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఎక్కువ పవర్, పెద్ద క్యాబిన్, అదనపు భద్రతా ఫీచర్లకు ప్రాధాన్యం ఇస్తే విన్‌ఫాస్ట్ VF6ను కొనడం ఉత్తమం.

Read Also: 526 కి.మీ రేంజ్‌తో సైరోస్ ఈవీ సంచలనం.. టాటా, మహీంద్రాకు కియా సవాల్!

Related News

సింగిల్ ఛార్జ్‌ తో 145 కి.మీ రేంజ్.. హోండా నయా ఈవీని చూస్తే మతిపోవాల్సిందే!

ధర తక్కువ.. రేంజ్ ఎక్కువ.. ఈ 3 ఈవీ స్కూటర్లలో విన్నర్ ఎవరు?

526 కి.మీ రేంజ్‌తో సైరోస్ ఈవీ సంచలనం.. టాటా, మహీంద్రాకు కియా సవాల్!

స్కూటర్‌పై ఆఫీసులో రౌండ్ కొట్టిన సీఈఓ.. కారణం తెలిస్తే మెచ్చుకుంటారు!

158 కి.మీ రేంజ్‌తో టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు చూస్తే షాక్ అవుతారు!

హెల్మెట్ కొంటే సరిపోదు.. 2-2-2 రూల్ పాటించకపోతే ప్రాణాలను రిస్క్ లో పెట్టినట్టే!

వోక్స్‌ వ్యాగన్ సూపర్ ఈ-సైకిల్.. కిందపడితే ఇంట్లో వాళ్లకు వెంటనే మెసేజ్!

Big Stories

Advertisement
×