E-Paper
Advertisement

KTM vs Royal Enfield: KTM 390 అడ్వెంచర్ R vs రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450.. వీటిలో ఏది బెస్ట్ అంటే?

KTM vs Royal Enfield: KTM 390 అడ్వెంచర్ R vs రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450.. వీటిలో ఏది బెస్ట్ అంటే?
Advertisement

KTM 390 Adventure vs Royal Enfield Himalayan 450 Comparison: ఇండియన్ టూవీలర్ మార్కెట్ లో KTM, రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీలో అదిరిపోయే బైక్స్ యూత్ ను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా క్రేజీ స్పోర్ట్స్, అండ్వెంచర్ బైక్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. రెండు కంపెనీల నుంచి విడుదలైన టాప్ అడ్వెంచర్ బైక్స్ KTM 390 అడ్వెంచర్ R, రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450. ప్రస్తుతం మార్కెట్ లో ఈ రెండు బైక్స్ పోటీపడుతున్నాయి. KTM అత్యుత్తమ పనితీరు, క్రూయిజ్ కంట్రోల్ లాంటి అధునాతన లక్షణాలను కలిగి ఉండగా, హిమాలయన్ 450 452cc ఇంజిన్, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.

ముఖ్యమైన తేడాలు, పోలికలు

⦿ ఇంజిన్, పనితీరు: KTM 390 అడ్వెంచర్ R 45.3 bhp పవర్, 39 Nm టార్క్ ఉత్పత్తి చేసే 399cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. హిమాలయన్ 450 452cc సామర్థ్యంతో కూడిన లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఇది 39.4 bhp పవర్, 40 Nm టార్క్ ను అందిస్తుంది. రెండు బైక్స్ లీటర్‌ కు 25 నుంచి 30 కిలో మీటర్ల మైలేజీని కలిగి ఉంటాయి.

Advertisement

⦿ ఆఫ్ రోడ్ కెపాసిటీ: KTM 390 అడ్వెంచర్ R 176 కేజీల బరువు ఉంటుంది. హిమాలయన్ 450  196 కేజీల బరువు ఉంటుంది. . KTM, రాయల్ ఎన్ఫీల్డ్ కంటే తేలికగా ఉంటుంది. గుంతలు, రాళ్లు ఉన్న రోడ్ల మీద  సులభంగా ప్రయాణిస్తుంది. హిమాలయన్ 230mmతో పోలిస్తే KTM 272mm గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉంటుంది.

⦿ సస్పెన్షన్, వీల్స్: 390 అడ్వెంచర్ R లో 21 ఇంచుల ఫ్రంట్, 18 ఇంచుల్ రియర్ స్పోక్డ్ వీల్ సెటప్ ను కలిగి ఉంటుంది. అడ్జెస్ట్ చేసే WP అపెక్స్ ఫోర్కులు ఉన్నాయి. హిమాలయన్ 450లో ఇంచుల ఫ్రంట్, 17 ఇంచుల బ్యాక్ ట్యూబ్‌ లెస్ స్పోక్డ్ వీల్స్ ఉంటాయి. కానీ, అడ్జెస్ట్ చేయలేని షోవా ఫోర్కులు ఉన్నాయి.

Advertisement

⦿ ఫీచర్లు: KTM రైడ్ బై వైర్, కార్నరింగ్ ABS, క్రూయిజ్ కంట్రోల్‌ తో అత్యుత్తమ టెక్నాలజీని కలిగి ఉంది. హిమాలయన్ 450 ఇంటిగ్రేటెడ్ గూగుల్ మ్యాప్స్ నావిగేషన్‌ తో 5 ఇంచుల TFT డిస్ ప్లేను కలిగి ఉంది.

⦿ బరువు, ఎర్గోనామిక్స్: 390 అడ్వెంచర్ R 176 కిలోల బరువుతో తేలికగా ఉంటుంది. హిమాలయన్ 196 కిలోల బరువును కలిగి ఉంటుంది. సుదూర ప్రయాణాలకు సౌకర్యవంతమైన సీటును కలిగి ఉంది. కానీ, నిలబడి ఉన్నప్పుడు బరువుగా అనిపిస్తుంది.

⦿ ధర: KTM 390 అడ్వెంచర్ R ధర ఎక్కువగా ఉంటుంది. సుమారు రూ. 3.68 లక్షల నుండి ప్రారంభమవుతుంది. అటు హిమాలయన్ 450 రూ. 3.06 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

Read Also:

మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కు గుడ్ న్యూస్, జస్ట్ 34 వేలకే క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్!

ఏది ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే?  

ఆఫ్ రోడ్ రైడింగ్ కోసం తేలికైన, శక్తివంతమైన, ఫీచర్లతో కూడిన బైక్‌ను ఇష్టపడితే KTM 390 అడ్వెంచర్ R బెస్ట్. సుదూర ప్రయాణాలు, సౌకర్యం, బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్ కోసం చూస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 ను ఎంచుకోవడం మంచిది.

Read Also:  8 సెకెన్లలో 40 కిమీ వేగం, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తో మామూలుగా ఉండదు భయ్యా!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×