E-Paper
Advertisement

Bommarillu 2: బొమ్మరిల్లు 2 చేస్తే ఆ హీరో కథతోనే సినిమా చేస్తా: దిల్ రాజు

Bommarillu 2: బొమ్మరిల్లు 2 చేస్తే ఆ హీరో కథతోనే సినిమా చేస్తా: దిల్ రాజు
Advertisement

Bommarillu 2: సినీ ఇండస్ట్రీలో ప్రేక్షకులు ఇప్పటికీ కూడా ఎంతో ఇష్టంగా చూసే కొన్ని సినిమాలు ఉంటాయి. ఆ సినిమాలు టీవీలలో ఇప్పుడు ప్రసారమైన కళ్లార్పకుండా చూస్తారు. ఇలాంటి సినిమాలలో బొమ్మరిల్లు సినిమా కూడా ఒకటి. దర్శకుడు భాస్కర్ డైరెక్షన్లో దిల్ రాజు(Dil Raju) నిర్మాణంలో జెనీలియా, సిద్ధార్థ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఈ సినిమా రీ రిలీజ్ అయినప్పటికీ అదే ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా సీక్వెల్ గురించి ఎన్నో రకాల వార్తలు వినపడుతూనే ఉన్నాయి.

ఆది సాయికుమార్ కథతో బొమ్మరిల్లు 2..

తాజాగా బొమ్మరిల్లు 2 (Bommarillu)గురించి నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి .ఇటీవల ఆది సాయికుమార్ (Aadi Sai Kumar) హీరోగా నటించిన శంభాల (Shambhala) సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం నేడు థాంక్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దిల్ రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా దిల్ రాజు సీనియర్ నటుడు సాయికుమార్ గురించి అలాగే వారి అబ్బాయి ఆది గురించి కూడా ఎన్నో విషయాలను తెలియజేశారు.

కొడుకు సక్సెస్ కోసం తండ్రి ఆరాటం..

Advertisement

సంక్రాంతి పండుగ సందర్భంగా ఐదు సినిమాలు విడుదల కాగా 5లో శంభాల సినిమా సూపర్ సక్సెస్ అవ్వడం అంటే మామూలు విషయం కాదని ఈ సినిమా మంచి సక్సెస్ అయినందుకు చిత్ర బృందానికి దిల్ రాజు అభినందనలు తెలియజేశారు. ఇక ఆదిను ఇండస్ట్రీలో సక్సెస్ చేయడం కోసం తన తండ్రి సాయికుమార్ పడుతున్న తపన గురించి కూడా దిల్ రాజు మాట్లాడారు. సాయికుమార్ తన కొడుకు ఆదికి బ్యాక్ బోన్ లాగా నిలిచారని ఆయనకు మాత్రమే కాకుండా చిత్ర బృందం మొత్తానికి బ్యాక్ బోన్ లా నిలిచి ఈ సినిమాని ముందుకు నడిపించారని దిల్ రాజు తెలియజేశారు.

హిందీలోకి శంభాల..

Advertisement

నేను కనుక బొమ్మరిల్లు 2 సినిమా చేస్తే ఖచ్చితంగా సాయికుమార్, తన కొడుకు ఆది నిజ జీవితం గురించి సినిమా చేస్తాను అంటూ ఈ సందర్భంగా దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి దిల్ రాజు బొమ్మరిల్లు 2 సినిమాని ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారనేది తెలియాల్సి ఉంది. ఇక శంభాల సినిమా ద్వారా ఆది ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైన ఆది శంభాల సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తెలుగులో మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ సినిమాని హిందీలో కూడా విడుదల చేయడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read: Peddi Movie: పెద్ది వాయిదా రూమర్లకు చెక్…ఒక్క పోస్టర్ తో క్లారిటీ!

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×