E-Paper
Advertisement

లంబోర్ఘిని ఉరస్ SE వచ్చేస్తోంది, ఫెరారీ, పోర్షేకు ఇక చుక్కలే!

లంబోర్ఘిని ఉరస్ SE వచ్చేస్తోంది, ఫెరారీ, పోర్షేకు ఇక చుక్కలే!
Advertisement

Lamborghini Launches Urus SE Hybrid SUV: ఇటలీకి చెందిన ప్రీమియం కార్ తయారీ సంస్థ లంబోర్ఘిని తాజాగా కొత్త స్పెషల్ ఎడిషన్ SUVని తీసుకొచ్చింది. లంబోర్ఘిని ఉరస్ SE టెట్టోనెరో క్యాప్సూల్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. మిలన్ డిజైన్ వీక్ 2026లో ఈ కారును ఆవిష్కరించబడింది. ఈ మోడల్‌ చూడ్డానికి క్రేజీగా ఆకట్టుకుంటుంది. డిజైన్, పనితీరు, టెక్నాలజీతో ముందుంటుంది.

ఉరస్ SE టెట్టోనెరో క్యాప్సూల్ ప్రత్యేకత ఏంటంటే?

కొత్త ఉరస్ SE టెట్టోనెరో క్యాప్సూల్ ప్రత్యేకతను పరిశీలిస్తే, ఇది ప్లగ్ ఇన్ హైబ్రిడ్ సిస్టమ్‌ తో వస్తుంది. 4.0 లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజన్‌ కు ఎలక్ట్రిక్ మోటార్‌ ను జోడించారు. ఈ కాంబినేషన్ ద్వారా మొత్తం 789 bhp పవర్, 950 Nm టార్క్ అందిస్తుంది. ఈ SUV కేవలం 3.4 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. అంతేకాదు, గరిష్ట వేగం 312 కిమీ వరకు ఉంటుంది. అవసరమైతే ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌ లో కూడా ప్రయాణిస్తుంది. సుమారు 60 కిలోమీటర్ల వరకు బ్యాటరీతోనే నడుస్తుంది. పనితీరు, సామర్థ్యం రెండింటినీ కలిపిన మోడల్‌ గా నిలుస్తుంది.

Advertisement

ఇక డ్రైవింగ్ అనుభవం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. కొత్త టార్క్ స్ప్లిటర్, ఎలక్ట్రానిక్ రియర్ డిఫరెన్షియల్ లాంటి టెక్నాలజీలతో, పెద్ద SUV అయినప్పటికీ చురుకుగా, స్పోర్టీగా ఉంటుంది. దాదాపు 2.5 టన్నుల బరువు ఉన్నా, రోడ్డు మీద చాలా సులభంగా హ్యాండిల్ చేయవచ్చు. డిజైన్ విషయానికి వస్తే, ఈ మోడల్ పూర్తిగా కస్టమైజేషన్‌ పై దృష్టి పెట్టింది. 70కి పైగా కాంబినేషన్లతో, ప్రతి కస్టమర్‌ కు తనకు నచ్చినట్లు కారును మార్చుకునే అవకాశం ఉంటుంది. బయట భాగంలో ప్రత్యేక రంగులు, నల్లటి టాప్ డిజైన్, పెద్ద వీల్స్, కార్బన్ ఫైబర్ ఎలిమెంట్స్ కలిసి ప్రీమియం లుక్ ఇస్తాయి. లోపల కూడా అదే థీమ్ కొనసాగుతుంది. నల్లటి క్యాబిన్, హై క్వాలిటీ మెటీరియల్స్, కస్టమ్ ఎంబ్రాయిడరీ సీట్లు లగ్జరీ ఫీలింగ్ ఇస్తాయి.

Read Also: టయోటా షాక్.. ఫార్చ్యూనర్, హైరైడర్ సహా పలు కార్ల ధరలు పెంపు!

ప్రపంచ వ్యాప్తంగా కేవలం 630 యూనిట్లు

Advertisement

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ మోడల్ ప్రపంచ వ్యాప్తంగా కేవలం 630 యూనిట్లకు పరిమితం చేయబడింది. అంటే. ఇది చాలా ప్రత్యేకమైన వాహనం. ప్రతి యూనిట్ కూడా దాదాపు యూనిక్‌ గా ఉండేలా డిజైన్ చేయవచ్చు. ఉరస్ SE టెట్టోనెరో క్యాప్సూల్ కేవలం వేగం, లగ్జరీ గురించి మాత్రమే కాదు. లంబోర్ఘిని భవిష్యత్తులో ఎలాంటి దిశలో వెళ్లబోతోందో చూపించే మోడల్. హైబ్రిడ్ టెక్నాలజీ వచ్చినా, వారి ప్రత్యేకమైన స్టైల్, పవర్ తగ్గలేదని ఈ కారు స్పష్టంగా చెబుతోంది.

Read Also: ప్రీమియం నుంచి బడ్జెట్ వరకు.. కొత్త టెక్నాలజీతో రాబోయే 4 అద్భుతమైన కార్లు!

Related News

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

Big Stories

Advertisement
×