E-Paper
Advertisement

Minister Sitharaman: క్లాడ్ మిథోస్ ఏఐ తీవ్ర కలకలం.. మంత్రి సీతారామన్ వార్నింగ్, బ్యాంకులకు సైబర్ ముప్పు?

Minister Sitharaman:  క్లాడ్ మిథోస్ ఏఐ తీవ్ర కలకలం.. మంత్రి సీతారామన్ వార్నింగ్, బ్యాంకులకు సైబర్ ముప్పు?
Advertisement

Minister Sitharaman: బ్యాంకింగ్ వ్యవస్థకు ఏఐ పెను ముప్పుగా మారనుందా? దీంతో ప్రమాదం పొంచివుందా? క్లాడ్ మిథోస్ ఏఐ ప్రకంపనలు సృష్టించనుందా? కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలసీతారామన్ బ్యాంకులను ఎందుకు హెచ్చరించినట్టు? బ్యాంకుల డేటా భద్రత మాటేంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

తీవ్ర కలకలం రేపిన క్లాడ్ మిథోస్ ఏఐ 

Advertisement

క్లాడ్ మిథోస్ ఏఐ నుంచి భారత బ్యాంకింగ్ రంగానికి సైబర్ ముప్పుపై కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వివిధ బ్యాంకుల అధిపతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ హాజరయ్యారు.

బ్యాంకుల భద్రతాపరమైన అంశాలపై ఆర్థికమంత్రి హెచ్చరించారు. భద్రతను పెంచాలని బ్యాంకులను తేల్చిచెప్పారు.ఆంత్రోపిక్ ఏఐ స్టార్టప్ అభివృద్ధి చేసింది క్లాడ్ మిథోస్. సైబర్ భద్రత విషయంలో అత్యంత అధునాతనమైనదని, మనుషులు గుర్తించడంలో విఫలమైన వేలాది సైబర్ భద్రతా లోపాలను కనుగొన్నట్లు తెలుస్తోంది.

Advertisement

కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో దశాబ్దాలుగా ఉన్న లోపాలను బయటపెట్టింది. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలకు అందుబాటులోకి దీన్ని తీసుకురాలేదు. ఒకవేళ చెడు ఆలోచనలు ఉన్నవారికి చేతికి చిక్కితే అధునాతన హ్యాకింగ్ సామర్థ్యాలు పొందినట్లేనని ఆంత్రో పిక్ చెబుతున్నమాట. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు దీన్ని అనధికారికంగా యాక్సెస్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

బ్యాంకులకు మంత్రి సీతారామన్ వార్నింగ్.. నిత్యం కన్నేయాలని ఆదేశం

ఇలాంటి ఏఐ వ్యవస్థలతో ముడిపడిన ఇలాంటి సమస్యలపై ఆర్థిక సంస్థలు-బ్యాంకుల మధ్య అప్రమత్తత, మెరుగైన సమన్వయం అవసరమన్నారు. ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని తలెత్తే పరిణామాలను ఎదుర్కోవడానికి గుర్తింపు వ్యవస్థలను బలోపేతం చేయాలని బ్యాంకులను కోరారు. బ్యాంకులు తమ తమ ఐటీ వ్యవస్థలను పటిష్ఠం చేసుకోవాలన్నారు.

వినియోగదారుల డేటాను కాపాడేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఈ భేటీలో నొక్కి చెప్పారు. ఆ తరహా ముప్పును గుర్తించిన బ్యాంకులు, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వంటి సంస్థలతో పంచుకోవడానికి బలమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు.

తక్షణమే స్పందించేందుకు వీలుగా ఓ యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌‌కు మంత్రి సూచనలు చేశారు.  అంతర్జాతీయ మీడియా కథనాల మేరకు.. క్లాడ్ మిథోస్ అంటే ఏమిటి? ఎందుకు భయపడాల్సి వస్తుంది? క్లాడ్ మిథోస్ అనేది ఆంత్రోపిక్ సంస్థ తయారు చేసిన అత్యంత పవర్‌ఫుల్ ఏఐ.

ALSO READ: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?

సైబర్ భద్రత విషయంలో కచ్చితంగా చేస్తుంది. ఈ నేపథ్యంలో దాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేమని ఆ సంస్థ స్వయంగా వెల్లడించింది. ఆపరేటింగ్ సిస్టమ్‌లు, వెబ్ బ్రౌజర్‌లలో మనుషులు పసిగట్టని వేలాది సైబర్ లోపాలను చిటికెలో కనిపెట్టేయగలదు.

అందరికీ అందుబాటులోకి తెస్తే ల్యాప్‌టాప్ ఉన్న ప్రతి ఒక్కరి చేతిలో అత్యంత ఆధునిక హ్యాకింగ్ అస్త్రాలను ఇచ్చినట్టే అవుతుందని ఆంత్రోపిక్ సంస్థ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ తోపాటు ఎంపిక చేసిన 40 దిగ్గజ కంపెనీలకు ఈ మోడల్‌ను యాక్సెస్ చేసుకునే అవకాశం ఇచ్చారు.

కేవలం భారత్‌లోనే కాకుండా అమెరికాలో ఇదే పరిస్థితి. అందుకే మిథోస్ ముప్పుపై వాల్‌స్ట్రీట్.. బ్యాంకులతో చర్చలు జరుపుతోంది కూడా. మరోవైపు దీనివల్ల ఆర్థిక రంగానికి ఎంత మేరకు ప్రమాదం పొంచివుందనే అంశంపై ఆర్థికమంత్రిత్వ శాఖ-రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యయనం మొదలుపెట్టాయి.

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×