E-Paper
Advertisement

Left-Hand vs Right-Hand: లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్- రైట్ హ్యాండ్ డ్రైవ్.. రెండింటి మధ్య తేడాలేంటి? ఏ డ్రైవింగ్ బెస్ట్?

Left-Hand vs Right-Hand: లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్- రైట్ హ్యాండ్ డ్రైవ్.. రెండింటి మధ్య తేడాలేంటి? ఏ డ్రైవింగ్ బెస్ట్?
Advertisement

Left-Hand vs Right-Hand Driving: కారులో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ (Left-Hand Drive – LHD), రైట్ హ్యాండ్ డ్రైవింగ్(Right-Hand Drive – RHD) అనే రెండు పద్దతులు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ చేస్తే, మరికొన్ని దేశాల్లో రైట్ హ్యాండ్ డ్రైవింగ్ చేస్తారు. ఇవి ముఖ్యంగా డ్రైవర్ సీటు, స్టీరింగ్ వీల్ పొజిషన్, రోడ్డు ట్రాఫిక్ నియమాలపై ఆధారపడి ఉంటాయి. ఈ సిస్టమ్స్ మధ్య తేడాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

రెండు రకాల డ్రైవింగ్ సిస్టమ్స్ , ట్రాఫిక్ రూల్స్   

⦿ LHD (లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్): డ్రైవర్ కారు ఎడమవైపు కూర్చుంటాడు. స్టీరింగ్ వీల్ ఎడమ వైపు ఉంటుంది. ఇలాంటి కార్లు సాధారణంగా రోడ్డు కుడివైపు డ్రైవ్ చేయబడతాయి (Right-Hand Traffic – RHT).  అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో ఈ రకమైన డ్రైవింగ్ ఉంటుంది.

Advertisement

⦿ RHD (రైట్ హ్యాండ్ డ్రైవింగ్): డ్రైవర్ కుడి వైపు కూర్చుంటాడు. స్టీరింగ్ వీల్ కుడివైపు ఉంటుంది. ఇవి రోడ్డు ఎడమ వైపు డ్రైవ్ చేయబడతాయి (Left-Hand Traffic – LHT). ఇండియా, యూకే, ఆస్ట్రేలియా, జపాన్ లాంటి దేశాల్లో ఈ విధానం ఉంటుంది.

రెండు రకాల డ్రైవింగ్ విధానాలు చరిత్రాత్మక కారణాల వల్ల ఏర్పడ్డాయి. బ్రిటిష్ సామ్రాజ్యం ప్రభావంతో LHT (RHD) దేశాలు ఎక్కువగా ఉన్నాయి.  ఫ్రెంచ్, అమెరికన్ ప్రభావంతో RHT (LHD) వ్యాప్తి చెందింది.

రెండు రకాల డ్రైవింగ్స్ మధ్య తేడాలు

Advertisement

⦿ డ్రైవర్ పొజిషన్: LHDలో ఎడమ వైపు (స్టీరింగ్ ఎడమ) ఉంటుంది. RHDలో కుడివైపు (స్టీరింగ్ కుడి) ఉంటుంది.

⦿ డ్రైవింగ్: LDHలో కుడివైపు డ్రైవ్ (RHT) ఉంటుంది. RHDలో ఎడమ వైపు డ్రైవ్ (LHT) ఉంటుంది.

⦿ గేర్ షిఫ్ట్ (మాన్యువల్): LDHలో కుడి చేతితో షిఫ్ట్ చేయాలి. RHDలో ఎడమ చేతితో షిఫ్ట్ చేయాలి

⦿ పెడల్స్: LDHలో క్లచ్ , బ్రేక్, యాక్సిలరేటర్ ఎడమ నుంచి కుడికి (సమానం)గా ఉంటుంది. RHDలో సమానం గా లేదంటే డ్రైవర్ సైడ్ తేడాగా ఉంటుంది.

⦿ వైపర్స్, టర్న్ సిగ్నల్స్: LDHలో వైపర్స్ కుడివైపు నుంచి పైకి స్వింగ్, టర్న్ సిగ్నల్ ఎడమవైపు స్టాక్ ఉంటాయి. RDHలో వైపర్స్ ఎడమ వైపు నుంచి, టర్న్ సిగ్నల్ కుడివైపు ఉంటాయి.

⦿ డాష్‌బోర్డ్ లేఅవుట్: LDHలో  మిర్రర్ ఇమేజ్, గ్లోవ్ బాక్స్ కుడివైపు ఉంటుంది. RDHలో  మిర్రర్ ఇమేజ్, గ్లోవ్ బాక్స్ ఎడమవైపు ఉంటుంది.

⦿ విజిబిలిటీ: LDHలో ఓవర్‌టే కింగ్ సమయంలో ఎడమ కన్ను ప్రధానం. RDHలో ఓవర్‌టే కింగ్ సమయంలో కుడి కన్ను ప్రధానం

⦿ రౌండ్‌ అబౌట్‌లలో LHT (RHD)లో క్లాక్‌ వైజ్ దిశలో సర్క్యులేట్ చేస్తారు. RHT (LHD)లో యాంటీ క్లాక్‌ వైజ్ వెళ్లాల్సి ఉంటుంది.

లాభాలు, నష్టాలు   

⦿ LHD లాభాలు, నష్టాలు: ఎక్కువ మంది రైట్ హ్యాండెడ్ వ్యక్తులకు మాన్యువల్ గేర్ షిఫ్ట్ సులభం. ప్రపంచంలో 70% దేశాలు LHD ఉపయోగిస్తాయి. ఓవర్‌ టేకింగ్, టర్నింగ్‌లో మెరుగైన విజిబిలిటీ ఉంటుంది.  RHD దేశాల్లో డ్రైవ్ చేయడం కష్టం. ఎందుకంటే విజిబిలిటీ తగ్గుతుంది.

⦿ RHD లాభాలు, నష్టాలు: LHT దేశాల్లో మెరుగైన సేఫ్టీ ఉంటుంది. ఎందుకంటే డ్రైవర్ రోడ్డు మధ్యలో ఉండి మెరుగైన వ్యూ పొందే అవకాశం ఉంటుంది.  LHT దేశాల్లో యాక్సిడెంట్లు తక్కువ. రైట్ హ్యాండెడ్ వ్యక్తులకు ఎడమ చేతితో గేర్ షిఫ్ట్ చేయడం సులభం కావచ్చు. LHD దేశాల్లో డ్రైవ్ చేయడం కష్టం, ముఖ్యంగా టోల్ గేట్లు, డ్రైవ్ థ్రూ వంటివి ఇబ్బంది కలిగిస్తాయి. ఈ కార్లు మార్కెట్లలో తక్కువ అందుబాటులో ఉంటాయి. ధర ఎక్కువగా ఉంటుంది.

Read Also: ఓ వైపు మంచు, మరోవైపు ఎండ.. రెండింటి నుంచి కాపాడే క్రేజీ హెల్మెట్!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×