E-Paper
Advertisement

Khammam News: ఖమ్మం జిల్లాలో వింత ఘటన.. కోతికి అంత్యక్రియలు

Khammam News: ఖమ్మం జిల్లాలో వింత ఘటన.. కోతికి అంత్యక్రియలు
Advertisement

Khammam News: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెరువు గ్రామంలో మానవత్వం పరిమళించింది. మూగజీవాల పట్ల అక్కడి గ్రామస్థులు చూపిన ప్రేమ, భక్తి అందరినీ కదిలించింది. విద్యుత్ షాక్‌తో మరణించిన ఒక వానరానికి (కోతికి), మనిషికి నిర్వహించిన తరహాలోనే సకల మర్యాదలతో అంత్యక్రియలు నిర్వహించి తమ ఉదారతను చాటుకున్నారు.

గ్రామంలోని విద్యుత్ తీగలు తగిలి ఒక కోతి మరణించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా మూగజీవాలు చనిపోతే వాటిని పట్టించుకోకుండా వదిలేసే కాలంలో.. జీళ్లచెరువు గ్రామస్థులు మాత్రం భిన్నంగా స్పందించారు. వానరాన్ని సాక్షాత్తు ఆ హనుమంతుడి స్వరూపంగా భావించే గ్రామస్థులు..  దాని మృతికి సంతాపం తెలుపుతూ ఘనంగా వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నారు.

Advertisement

పెండ్ర అంజయ్య ఆధ్వర్యంలో గ్రామస్థులంతా ఏకమై కోతి పార్థివ దేహాన్ని గౌరవపూర్వకంగా సిద్ధం చేశారు. మరణించిన వానరానికి హిందూ సంప్రదాయం ప్రకారం పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. గ్రామం మొత్తం మంగళవాయిద్యాల నడుమ, పూలమాలలతో అలంకరించిన వాహనంపై వానరాన్ని ఊరేగించారు.  మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి పాటలు పాడుతూ అంతిమ యాత్రలో పాల్గొన్నారు.

ఊరేగింపు అనంతరం..  గ్రామ శివారులో హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం దహన సంస్కారాలను పూర్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ‘కోతిని మేము కేవలం ఒక జంతువుగా చూడలేదని.. హనుమంతుడి ప్రతిరూపంగా భావించి ఈ గౌరవాన్ని అందించామని’ తెలిపారు.

Advertisement

యంత్రంలా మారిపోతున్న సమాజంలో..  ఒక మూగజీవి పట్ల చూపిన ఈ నివాళి మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. జీళ్లచెరువు గ్రామస్థులు చేసిన ఈ పని ఇప్పుడు సోషల్ మీడియాలో,  చుట్టుపక్కల గ్రామాల్లో ప్రశంసలందుకుంటోంది.

ALSO READ: Jagtial District: టూరిస్ట్ బస్సుపై పోకిరీల దాడి.. తిరగబడిన స్టూడెంట్స్, చివరకు ఏమైందంటే..?

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×