E-Paper
Advertisement

Long-range Electric Cars: టాటా TO బెంజ్.. బెస్ట్ లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Long-range Electric Cars: టాటా TO బెంజ్.. బెస్ట్ లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
Advertisement

దేశీయ మార్కెట్ లోకి క్రేజీ ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒక్క ఛార్జ్ తో వందల కిలో మీటర్ల రేంజ్ అందించే కార్లు విడుదల అవుతున్నాయి. ఇండియాలో ఇప్పటికే పలు లాంగ్ రేంజ్ ఈవీలు అందుబాటులో ఉన్నాయి.  డిసెంబర్ 2025 నాటికి దేశంలో అత్యధిక లాంగ్ రేంజ్ (ARAI క్లెయిమ్డ్) కలిగిన 10 ఎలక్ట్రిక్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ Mercedes-Benz EQS

ఈ కారు 857 km రేంజ్ అందిస్తుంది. దీని ధర రూ.1.55 కోట్లు ఉంటుంది. లగ్జరీ సెడాన్ కారుగా గుర్తింపు తెచ్చుకుంది. అతి ఎక్కువ రేంజ్ అందించే కార్లలో ఒకటిగా కొనసాగుతోంది.

⦿  Mahindra BE 6

Advertisement

ఈ కారు 557-683 km రేంజ్ అందిస్తుంది. దీని ధర రూ.18.90 లక్షలు నుంచి ప్రారంభం అవుతుంది. ఫ్యూచరిస్టిక్ SUV, బెస్ట్ వాల్యూ లాంగ్ రేంజ్.

⦿ Kia EV6

ఈ కారు 663 km రేంజ్ ను అందిస్తుంది. ధర రూ. 65.97 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. స్టైలిష్ క్రాస్ఓవర్, ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యాన్ని కలిగి ఉంటుంది.

⦿ BYD Seal

Advertisement

ఈ కారు 650 km రేంజ్ ను అదిస్తుంది. దీని ధర రూ, 41-53 లక్షలు ఉంటుంది.  ప్రీమియం సెడాన్, స్మూత్ పెర్ఫార్మెన్స్ ను కలిగి ఉంటుంది.

⦿  Mahindra XEV 9e

దీని రేంజ్ 542-656 km ఉంటుంది. దీని ధర రూ. 21.90 లక్షలు నుంచి ప్రారంభం అవుతుంది. బోర్న్ ఎలక్ట్రిక్ SUV, మోడర్న్ డిజైన్ ను కలిగి ఉంటుంది.

⦿  Tata Harrier EV

ఈ కారు రేంజ్ 538-627 km ఉంటుంది. దీని ధర రూ. 21.49 లక్షలు నుంచి ప్రారంభం అవుతుంది. AWD ఆప్షన్, ఆఫ్-రోడ్ కెపాబిలిటీని కలిగి ఉంటుంది.

⦿ Hyundai Ioniq 5

ఈ కారు రేంజ్ 631 km ఉంటుంది. ధర రూ. 46.30 లక్షలు ఉంటుంది. రెట్రో ఫ్యూచరిస్టిక్ డిజైన్ ను కలిగి ఉంటుంది.

⦿ BMW i7

ఈ కారు రేంజ్ 596-625 km ఉంటుంది. దీని ధర రూ. 2.05 కోట్ల నుంచి ప్రారంభం అవుతుంది. ఇది అల్ట్రా లగ్జరీ సెడాన్.

Read Also: ఒడియమ్మ బంటీ.. కార్లపై ఆఫర్లే ఆఫర్లు, ఏకంగా రూ.10 లక్షల రాయితీ!

⦿ టాటా నెక్సాన్ EV

ఈ కారు రేంజ్ 465-489 km ఉంటుంది. దీని ధర రూ. 12.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. పనోరమిక్ సన్‌రూఫ్,  ADAS , 5 సీటర్ SUV, బెస్ట్ సేఫ్టీని కలిగి ఉంటుంది.

⦿ హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్

ఈ కారు రేంజ్ 452 km ఉంటుంది. దీని ధర రూ.23.84 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. వెంటిలేటెడ్ సీట్స్, వైర్‌ లెస్ ఛార్జింగ్,  5 సీటర్ SUV, ప్రీమియం ఫీల్, స్మూత్ డ్రైవ్ అనుభూతిని అందిస్తుంది.

⦿ BYD e6

ఈ కారు 415-520 km రేంజ్ అందిస్తుంది. దీని ధర రూ. 29.15 లక్షలు ఉంటుంది. బిగ్ బూట్, ఫాస్ట్ ఛార్జింగ్, సేఫ్ బ్యాటరీ టెక్, 5-7 సీటర్ MPVగా గుర్తింపు తెచ్చుకుంది.

Read Also: గాల్లో ఎగిరే మోటార్ సైకిల్ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×