E-Paper
Advertisement

Flying Motorcycle: గాల్లో ఎగిరే మోటార్ సైకిల్ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Flying Motorcycle: గాల్లో ఎగిరే మోటార్ సైకిల్ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Flying Motorcycle- LEO Solo JetBike: ఖాళీ రోడ్ల మీద బైక్ రైడ్ అంటే సరదాగా ఉంటుంది. ట్రాఫిక్ జామ్ ఏర్పడితేనే చిరాకేస్తుంది. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో బైక్ జర్నీ అంటే తల ప్రాణం తోకకు వస్తుంది. ఈ ఇబ్బందుల నుంచి బయటపడేసేందుకు అమెరికాకు చెందిన LEO Solo JetBikeను రూపొందించింది అమెరికాకు చెందిన LEO Flight కంపెనీ.  ఇది సాధారణ మోటార్‌ సైకిల్ కాదు.  ఎగిరే పర్సనల్ eVTOL (ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్) వెహికిల్. రోటర్లకు బదులు 48 డక్టెడ్ ఎలక్ట్రిక్ మైక్రోజెట్ ఫ్యాన్స్ ఉపయోగించి ఎగురుతుంది. సైన్స్ ఫిక్షన్ లాంటి డిజైన్ ను కలిగి ఉంటుంది.  కానీ, రిక్రియేషనల్ జాయ్‌ రైడ్ కోసం రూపొందించింది.

LEO Solo JetBik ఫీచర్లు, స్పెసిఫికేషన్స్

ఈ బైక్ 48 ఎలక్ట్రిక్ డక్టెడ్ ఫ్యాన్స్ (మైక్రోజెట్స్) తో పైకి ఎగురుతుంది. ప్రొపెల్లర్లు లేవు. సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది. సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ తో రానుంది.ఇందులో అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఒక్క ఛార్జ్ కు 10 నుంచి 15 నిమిషాల పాటు గాల్లో ఎగిరే అవకాశం ఉంటుంది. ఆప్టిమల్ కండిషన్స్‌ లో సుమారు 15 మైళ్ల రౌండ్ ట్రిప్ వేసే అవకాశం ఉంటుంది. దీని టాప్ స్పాట్ గంటకు 96 కిలో మీటర్లు ఉంటుంది. మాక్సిమమ్ ఆల్టిట్యూడ్ 15 ఫీట్ల వరకు ఉంటుంది. గ్రౌండ్ ఎఫెక్ట్ హోవరింగ్ కోసం ఈ పరిధిని రూపొందించారు. దీని సైజు సుమారు 2×2 మీటర్లు ఉంటుంది.  సాధారణ గ్యారేజీలో పార్క్ చేయవచ్చు. సీటింగ్ విషయానికి వస్తే, సింగిల్ సీట్ ఉంటుంది. ఒక్కరు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంటుంది. జాయిస్టిక్స్ తో సెమీ-రిక్లైన్డ్ పొజిషన్ కంట్రోల్స్ ఉంటాయి. నాయిస్ సుమారు 80 డెసిబెల్స్ ఉంటుంది. రెగ్యులేషన్స్ విషయానికి వస్తే US FAA Part 103 అల్ట్రాలైట్ కేటగిరీ కిందికి వస్తుంది. దీనికి పైలట్ లైసెన్స్ అవసరం లేదు.

అంచనాధర, అవైలబిలిటీ

Advertisement

ఎగిరే బైక్ బేస్ ప్రైస్ సుమారు $99,900 (రూ. 85 లక్షల దాకా) ఉంటుందని భావిస్తున్నారు. ప్రీ ఆర్డర్ బుకింగ్ ఓపెన్ అయ్యింది. రిఫండబుల్ డిపాజిట్ $999. 2025లోనే ప్రొడక్షన్ మొదలుకావాల్సి ఉంది. కానీ, కొంత డిలే అయ్యింది. సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ సమస్య వల్ల ఆలస్యం అయ్యింది. ఇంకా ప్రోటోటైప్ స్టేజ్‌లోనే ఉంది. మాస్ డెలివరీస్ ఆలస్యం కావచ్చు.

Read Also:  క్రాష్ టెస్ట్ లో దుమ్మురేపిన టయోటా హిలక్స్, ఏకంగా ఎన్ని పాయింట్స్ సాధించిందంటే..

Advertisement

ఈ ఎగిరే మోటార్ సైకిల్ డైలీ ట్రాన్స్‌ పోర్ట్ కోసం కాకుండా, అడ్వెంచర్, జాయ్‌రైడ్, బ్రాగింగ్ రైట్స్ కోసం రూపొందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ప్రోటోటైప్ టెస్టింగ్‌ లో స్టేబుల్ హోవరింగ్ చూపించింది. త్వరలోనే ప్రొడక్షన్ ప్రారంభం కానుంది. ముందుగా ఈ ఎగిరే మోటార్ సైకిళ్లు అమెరికాలో అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాత ఇతర దేశాలకు పరిచయం కానున్నాయి.

Read Also: దేశీ మార్కెట్లో నెక్సాన్ ఈవీ దూకుడు, అమ్మకాల్లో సరికొత్త రికార్డు!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×