E-Paper
Advertisement

WhatsApp Accounts: రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. ‘ఘోస్ట్ పెయిరింగ్‌’తో వాట్సప్ హ్యాక్, ఆదమరిస్తే ఖాతా మొత్తం ఖాళీ!

WhatsApp Accounts: రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. ‘ఘోస్ట్ పెయిరింగ్‌’తో వాట్సప్ హ్యాక్, ఆదమరిస్తే ఖాతా మొత్తం ఖాళీ!
Advertisement

WhatsApp Accounts: రోజురోజుకు పెట్రేగి పోతున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కొత్త తరహా మోసానికి తెరలేపారు. దీని కోసం వాట్సాప్ వినియోగదారుల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ విషయంపై భారత ప్రభుత్వ సైబర్ భద్రతా సంస్థ CERT-In అధికారికంగా అలర్ట్ జారీ చేసింది. హ్యాకర్లు వాట్సాప్‌లో ఉన్న డివైజ్ లింకింగ్ ఫీచర్‌ను దుర్వినియోగం చేస్తూ, యూజర్లకు తెలియకుండానే వారి అకౌంట్లను తమ డివైస్‌లకు కనెక్ట్ చేసుకుంటున్నారు. ఈ విధానాన్ని ‘ఘోస్ట్ పెయిరింగ్’గా పిలుస్తున్నారు. ఇందులో పాస్‌వర్డ్, OTP లేదా SIM స్వాప్ అవసరం లేకుండానే అకౌంట్ పూర్తిగా హ్యాకర్ల కంట్రోల్‌లోకి వెళ్తోంది.

ప్రమాదకరమంటున్న CERT-In:

ఈ ఘోస్ట్ పెయిరింగ్ మోసం చాలా ప్రమాదకరమని CERT-In హెచ్చరిస్తోంది. ఒకసారి అకౌంట్ హ్యాకర్ల డివైస్‌తో లింక్ అయితే, వారు యూజర్ మెసేజ్‌లను రియల్ టైమ్‌లో చదవగలరు. ఫోటోలు, వీడియోలు, వాయిస్ నోట్స్‌ను వీక్షించగలరు. యూజర్ పేరుతోనే ఇతరులకు మెసేజ్‌లు పంపడం కూడా సాధ్యమవుతుంది. ఇవన్నీ ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో జరుగుతాయి కాబట్టి యూజర్లకు చాలా కాలం వరకు అకౌంట్ హ్యాక్ అయిన విషయం కూడా తెలియదు.

ఎలా హ్యాక్ చేస్తారంటే? 

Advertisement

ఈ హ్యాకింగ్ ప్రక్రియ సాధారణంగా అనుమానాస్పద లింక్‌తో మొదలవుతుంది. ‘ఈ ఫోటో చూడండి’, ‘మీ అకౌంట్ గురించి సమాచారం’ వంటి మెసేజ్‌లతో పంపిన లింక్‌పై క్లిక్ చేస్తే, ఫేస్‌బుక్ మాదిరి కనిపించే నకిలీ వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ వెరిఫికేషన్ పేరుతో మీ ఫోన్ నంబర్ అడుగుతారు. యూజర్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే, హ్యాకర్ డివైస్ పెయిరింగ్ ప్రక్రియ పూర్తి అవుతుంది. దీంతో హ్యాకర్లకు మీ వాట్సాప్ అకౌంట్‌పై పూర్తి నియంత్రణ లభిస్తుంది.

అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కు:

ఘోస్ట్ పెయిరింగ్ ద్వారా అకౌంట్ హ్యాక్ అయిన తర్వాత, హ్యాకర్లు పాత మెసేజ్‌లతో పాటు తాజా మెసేజ్‌లను కూడా చూడగలరు. మీ అకౌంట్ నుంచి గ్రూప్‌లకు, కాంటాక్ట్‌లకు మెసేజ్‌లు పంపి మరిన్ని అకౌంట్లను కూడా టార్గెట్ చేస్తారు. ఈ విధంగా ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కు మోసం వేగంగా వ్యాపిస్తుంది. యూజర్ ఫోన్‌లో ఎలాంటి హెచ్చరికలు లేకపోవడంతో, నష్టం జరిగే వరకు చాలా మందికి అసలు విషయం అర్థం కావడం లేదు.

కేంద్రం కీలక నిర్ణయం:

Advertisement

ఇలాంటి డిజిటల్ మోసాలను అరికట్టేందుకు టెలికమ్యూనికేషన్స్ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌లకు రాబోయే రోజుల్లో SIM బైండింగ్‌ను తప్పనిసరి చేయనుంది. యాక్టివ్ SIM ఉన్న డివైస్‌లో మాత్రమే అకౌంట్ యాక్సెస్ ఉండేలా ఈ మార్పులు తీసుకురానున్నారు. వాట్సాప్ వెబ్ లేదా లింక్డ్ డివైజ్‌లలో తరచూ లాగ్ అవుట్ అయ్యే విధానాన్ని కూడా అమలు చేయనున్నారు.

ఆదమరిస్తే ఖాతా ఖాళీ:

యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్ భద్రత కోసం మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అనుమానాస్పద లింక్‌లను ఓపెన్ చేయకుండా ఉండాలి. ఎవరైనా ఫోన్ నంబర్ అడిగితే వెంటనే అలర్ట్ అవ్వాలి. వాట్సాప్‌లో లింక్ అయిన డివైజ్‌లను తరచూ చెక్ చేయాలి. టూ-స్టెప్ వెరిఫికేషన్ ఆన్‌లో ఉంచడం, యాప్ అప్డేట్స్ ఇన్‌స్టాల్ చేయడం కూడా చాలా అవసరం. ఒకవేళ అకౌంట్ హ్యాక్ అయినట్లు అనిపిస్తే వెంటనే వాట్సాప్ సపోర్ట్‌ను సంప్రదించి, సైబర్ క్రైమ్ సెల్‌కు ఫిర్యాదు చేయాలని CERT-In సూచిస్తోంది.

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×