Top 10 Cars Feb 2026: ఫిబ్రవరి 2026లో కార్ల అమ్మకాలు గతంలో ఎప్పుడూ లేనంతగా పెరిగాయి. గత నెలలో ఎక్కువ అమ్మకాలు జరుపుకున్న టాప్ 10 కార్ల జాబితాలో SUVలు, కాంపాక్ట్ సెడాన్ల ముందున్నాయి. టాప్ 10 మోడల్స్ ఏకంగా 1,70,127 యూనిట్ల అమ్మకాలు సాధించాయి. ఫిబ్రవరి 2025లో1,56,425 యూనిట్లు సేల్ కాగా, ఇప్పుడు ఏకంగా 8.76% వృద్ధిని సాధించాయి.
⦿ టాటా నెక్సాన్: ఫిబ్రవరిలో ఎక్కువ అమ్మకాలు జరుపుకున్న కార్లలో టాటా నెక్సాన్ టాప్ లో నిలిచింది. ఈ కారు ఏకంగా 19,430 యూనిట్ల అమ్మకాలతో అత్యధికంగా అమ్ముడైన కారుగా గుర్తింపు తెచ్చుకుంది. గత సంవత్సరం ఫిబ్రవరిలో 15,349 యూనిట్లతో పోల్చితే 26.59 శాతం ఎక్కువ అమ్మకాలు కొనసాగించింది.
⦿ మారుతి డిజైర్: రెండో స్థానంలో మారుతి డిజైర్ నిలిచింది. ఈ కారు 19,326 యూనిట్ల సేల్ సాధించింది. గత ఏడాదితో పోల్చితే 31.52 శాతం ఎక్కువ అమ్మకాలు కొనసాగించింది.
⦿ టాటా పంచ్: మూడో స్థానంలో టాటా పంచ్ నిలిచింది. ఇటీవల అప్ డేట్ చేసిన టాటా పంచ్ (EVతో సహా) ఫిబ్రవరి 2026లో 18,748 యూనిట్లు సేల్ అయ్యింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 28.77 శాతం అమ్మకాలు పెరిగాయి.
⦿ హ్యుందాయ్ క్రెటా: ఈ కారు 17,938 యూనిట్ల అమ్మకాలతో నాల్గవ స్థానంలో నిలిచింది. గత సంవత్సరంతో పోలిస్తే 9.93 వృద్ధిని సాధించింది. స్థిరమైన నెలవారీ పనితీరును కనబరిచింది.
⦿ మారుతి బ్రెజ్జా: ఈ కారు 17,863 యూనిట్లతో ఐదవ స్థానంలో నిలిచింది. గత సంవత్సరంతో పోలిస్తే 16.05 ఎక్కువ అమ్మకాలను సాధించింది. మరికొద్ది వారాలలోనే బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది.
⦿ ఎర్టిగా: ఈ కారు 17,807 యూనిట్లతో ఆరవ స్థానంలో నిలిచింది. గత ఏడాదిలో పోల్చితే అమ్మకాల్లో 19.77 శాతం పెరుగుదలను కనబరిచింది.
⦿ మారుతి వాగన్ R: ఈ కారు 14,885 యూనిట్లతో ఏడవ స్థానానికి పడిపోయింది. ఇది 25.12 శాతం తక్కువగా అమ్మకాలను నమోదు చేసింది.
⦿ స్విఫ్ట్: ఈ కారు 14,833 యూనిట్లను సేల్స్ సాధించి 8వ స్థానానికి చేరింది. ఇది వార్షిక పెరుగుదలలో 8.83 సాధించింది.
⦿ మహీంద్రా స్కార్పియో: స్కార్పియో ఎన్ 14,665 యూనిట్లతో తొమ్మిదవ స్థానంలో నిలిచింది. ఇది 7.69 శాతం వార్షిక వృద్ధిని సాధించింది.
⦿ బాలెనో: ఈ కారు 14,632 యూనిట్లతో పదో స్థానంలో ఉంది. ఇది 5.48 శాతం తగ్గుదలు చూసింది.
Read Also: వామ్మో ఒక్క నెలలో ఇన్ని కార్లు అమ్ముడయ్యాయా? ఎక్కువ సేల్స్ సాధించిన బ్రాండ్ ఇవే!
⦿ SUVలు ఈ లిస్టులో సత్తా చాటుతున్నాయి. నెక్సాన్, పంచ్, క్రెటా, బ్రెజ్జా, స్కార్పియో ఎక్కువ సేల్ అవుతున్నాయి.
⦿ టాటా మోటార్స్ రెండు మోడళ్లను నెక్సాన్, పంచ్ మంచి అమ్మకాలను సాధించాయి.
⦿ మారుతి టాప్ 10లో ఆరు మోడళ్లతో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
Read Also: నెల రోజుల్లో 5.58 లక్షల బైక్స్ సేల్.. అదరగొట్టిన హీరో మోటోకార్ప్!