E-Paper
Advertisement

KTR: రేవంత్ సర్కార్‌పై విషప్రచారం.. అడ్డంగా దొరికిపోయిన కేటీఆర్, సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్

KTR: రేవంత్ సర్కార్‌పై విషప్రచారం.. అడ్డంగా దొరికిపోయిన కేటీఆర్, సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్
Advertisement

తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి కేటీఆర్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రేవంత్ సర్కార్ పై నిత్యం బురద చల్లడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే ఎదురుదెబ్బ తగులుతున్నాయి. హైదరాబాద్ వేదికగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఒకే అంశంపై రెండు భిన్నమైన మాటలు చెప్పి సోషల్ మీడియాలో నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను అడ్డుకోవడంతో పాటు ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు ఆయన ఫేక్ ప్రచారాన్ని నమ్ముకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హైదరాబాద్‌లోని మధు పార్క్ అపార్ట్‌మెంట్స్ అంశంపై కేటీఆర్ మాట్లాడిన తీరు కొంత విస్మయానికి గురి చేస్తోంది. ప్రసంగం ప్రారంభించిన రెండు నిమిషాల వ్యవధిలోనే ఆయన తన మాటను మార్చుకున్నారు. మొదట మాట్లాడుతూ.. ‘మధు పార్క్ అపార్ట్‌మెంట్లను కూల్చివేసి అక్కడ గాంధీ విగ్రహం కడతారు’ అని ఆరోపించారు. సరిగ్గా రెండు నిమిషాల తర్వాత అదే నోటితో.. ‘అక్కడ అపార్ట్‌మెంట్‌లు కూల్చి ఫైవ్ స్టార్ హోటల్ నిర్మిస్తారు’ అంటూ మరో బాంబు పేల్చారు. ఒకే వేదికపై ఒకే అంశం గురించి పొంతన లేని వ్యాఖ్యలు చేయడంతో కేటీఆర్ నిజ స్వరూపం బయటపడిందని బయట జనాలు మాట్లాడుకుంటున్నారు.

Advertisement

అసలు నిజమేంటి అంటే..?

వాస్తవానికి మధు పార్క్ అపార్ట్‌మెంట్‌ల స్థానంలో హైదరాబాద్ నగర భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఒక భారీ రిజర్వాయర్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. పెరుగుతున్న జనాభాకు తాగునీటి ఎద్దడి కలగకుండా ఉండాలనే ముందుచూపుతో ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజలకు ఉపయోగపడే రిజర్వాయర్ నిర్మాణంపై విషం చిమ్ముతూ.. అబద్ధపు ప్రచారాలు చేయడమే కేటీఆర్ పనిగా పెట్టుకున్నారని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి.

Advertisement

సోషల్ మీడియాలో మస్త్ ట్రోల్స్.. 

కేటీఆర్ చేసిన ఈ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలపై నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్లు చేస్తున్నారు. ‘ఫేక్ ప్రచారం అంటే ఇలాగే ఉంటుంది’ అంటూ మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం కేటీఆర్‌కు అలవాటేనని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన ప్రసంగాల్లో కనిపించే అహంకారం ఏమాత్రం తగ్గలేదని.. ప్రజలు అన్ని గమనిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

కాంగ్రెస్ శ్రేణులు ఫైర్.. 

రేవంత్ సర్కార్‌ను ఎలాగైనా బద్నాం చేయాలనే కుట్రతోనే బీఆర్ఎస్ నేతలు ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. కేటీఆర్ తన శైలిని మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే ఆయనకు మరోసారి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి కేటీఆర్ చేసిన డబుల్ టాక్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో, ఇటు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ వస్తున్నాయి.

ALSO READ: CM Revanth Reddy: లక్ష్యం ఒక్కటే.. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే, సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×