E-Paper
Advertisement

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!
Advertisement

Upcoming Cars in India 2026: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌ లో జూలై నెల మరింత సందడి తీసుకురానుంది. మరో పది రోజుల్లో మూడు కొత్త కార్లు భారత మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయి. మారుతి సుజుకి నుంచి కొత్త బ్రెజ్జా ఫేస్‌ లిఫ్ట్, హోండా నుంచి తొలి ZR-V హైబ్రిడ్ SUV, టయోటా నుంచి కొత్త తరం హిలక్స్ పికప్ ట్రక్ విడుదలకు రెడీ అయ్యాయి. కొత్త డిజైన్, అత్యాధునిక ఫీచర్లు, మెరుగైన ఇంజిన్లతో ఈ మూడు వాహనాలు వినియోగదారులను ఆకట్టుకునే అవకాశం ఉంది.

మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్

ఈ SUVని జూలై 24న అధికారికంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే రూ.11,000 టోకెన్‌తో బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈసారి బ్రెజ్జాలో కొత్త 1.0 లీటర్ బూస్టర్‌ జెట్ టర్బో పెట్రోల్ ఇంజిను అందించనున్నారు. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌ బాక్స్ యాడ్ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లు కూడా కొనసాగనున్నాయి. డిజైన్ పరంగా బ్రెజ్జాలో కొన్ని మార్పులు కనిపించనున్నాయి. కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన హెడ్‌ ల్యాంప్స్, కొత్తత బంపర్లు, సరికొత్త అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో కొత్త బ్రాండింగ్ ఇవ్వనున్నారు. క్యాబిన్‌ లో పెద్ద టచ్‌ స్క్రీన్, కొత్త సీట్ డిజైన్, అప్‌డేటెడ్ ఇంటీరియర్ థీమ్ లాంటి మార్పులు ఉండే అవకాశం ఉంది.

హోండా ZR-V

Advertisement

ఇక హోండా ZR-V  భారత్ లో కంపెనీ నుంచి వస్తున్న తొలి స్ట్రాంగ్ హైబ్రిడ్ SUVగా నిలవనుంది. దీని ధరలను జూలై 20న ప్రకటించనున్నారు. ఇందులో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు డ్యూయల్ మోటార్ హైబ్రిడ్ సిస్టమ్ ఉంటుంది. మొత్తం 184 బీహెచ్‌పీ పవర్, 315 ఎన్ఎం టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. e-CVT గేర్‌ బాక్స్‌ తో వచ్చే ఈ SUV గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 8 సెకన్లలో అందుకుంటుంది. లీటరుకు 22.79 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఫీచర్ల విషయానికొస్తే.. పూర్తి LED లైటింగ్, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, కనెక్టెడ్ టెయిల్‌ ల్యాంప్స్, 9 అంగుళాల టచ్‌ స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే, వైర్‌ లెస్ ఛార్జింగ్, లెవెల్-2 ADAS లాంటి ఆధునిక సదుపాయాలు ఇందులో ఉండనున్నాయి.

టయోటా హిలక్స్

మరోవైపు టయోటా హిలక్స్ కొత్త తరం మోడల్ జూలై 28న విడుదల కానుంది. బాడీ-ఆన్-ఫ్రేమ్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన ఈ పికప్ ట్రక్‌ కు మరింత రగ్గడ్ లుక్ ఇవ్వనున్నారు. కొత్త హనీకోంబ్ గ్రిల్, LED హెడ్‌ ల్యాంప్స్, రీడిజైన్ చేసిన టెయిల్‌ గేట్, బ్లాక్ వీల్ ఆర్చ్‌ లు, సిల్వర్ స్కిడ్ ప్లేట్ లాంటి మార్పులు ఇందులో కనిపించనున్నాయి. ఇంజిన్ పరంగా ప్రస్తుతం ఉన్న 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్‌నే కొనసాగించే అవకాశం ఉంది. ఇది 204 బీహెచ్‌పీ పవర్, మాన్యువల్ గేర్‌బాక్స్‌లో 420 ఎన్ఎం, ఆటోమేటిక్ వేరియంట్‌ లో 500 ఎన్ఎం టార్క్‌ ను అందిస్తుంది.

Advertisement

Read Also: వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

Related News

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

Big Stories

Advertisement
×