E-Paper
Advertisement

2026 బ్రెజ్జా Vs హ్యుందాయ్ వెన్యూ.. ఏ SUV కొనడం బెస్ట్?

2026 బ్రెజ్జా Vs హ్యుందాయ్ వెన్యూ.. ఏ SUV కొనడం బెస్ట్?
Advertisement

2026 Maruti Brezza Facelift vs Hyundai Venue: భారత్ లో సబ్ కాంపాక్ట్ SUVల మధ్య రోజురోజుకూ మరింత పోటీ పెరుగుతోంది. ఈ విభాగంలో మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ రెండు గట్టి పోటీ పడుతున్నాయి. తాజాగా 2026 మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ కొత్త డిజైన్, అప్‌డేటెడ్ ఇంజిన్, మరిన్ని ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. మరోవైపు హ్యుందాయ్ వెన్యూ ఇప్పటికే ప్రీమియం లుక్, లేటెస్ట్ టెక్నాలజీ, బలమైన ఇంజిన్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరి ఈ రెండింటిలో ఏది కొనడం మంచిదో చూద్దాం.

ధరలో బ్రెజ్జాకే ఓటు   

2026 మారుతి బ్రెజ్జా ప్రారంభ ధర రూ.7.40 లక్షలు కాగా, హ్యుందాయ్ వెన్యూ ధర రూ.8 లక్షల నుంచి రూ.15.65 లక్షల వరకు ఉంది. అంటే, బ్రెజ్జా బేస్ వేరియంట్ దాదాపు రూ.60 వేల వరకు తక్కువ ధరలో లభిస్తోంది. అయితే, బ్రెజ్జా అన్ని వేరియంట్ల ధరలను మారుతి ఇంకా ప్రకటించలేదు.

సైజు పరంగా పెద్ద తేడా లేదు!

Advertisement

రెండు SUVల పొడవు 3995 మి.మీ.గానే ఉంది. వెన్యూ 10 మి.మీ. ఎక్కువ వెడల్పు, 20 మి.మీ. ఎక్కువ వీల్‌ బేస్‌ ను అందిస్తుంది. అయితే, బ్రెజ్జా 20 మి.మీ. ఎక్కువ ఎత్తు కలిగి ఉంటుంది. అందువల్ల రెండింటిలోనూ మంచి రోడ్ ప్రెజెన్స్ ఉంటుంది.

కలర్ ఆప్షన్స్

రెండు కంపెనీలు అదరిపోయే కలర్ ఆప్షన్లు అందిస్తున్నాయి. హ్యుందాయ్ వెన్యూ మ్యాట్ ఫినిష్ కలర్స్, బ్లాక్ రూఫ్‌ తో డ్యూయల్ టోన్ ఆప్షన్లు, నైట్ ఎడిషన్‌ ను కూడా అందిస్తోంది. మరోవైపు మారుతి బ్రెజ్జా వైట్, రెడ్, బీజ్ లాంటి రంగుల్లో డ్యూయల్ టోన్ ఆప్షన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఫీచర్లలో ఏది బెస్ట్?   

Advertisement

ఫీచర్ల విషయానికి వస్తే.. రెండు SUVలు కూడా లేటెస్ట్ సౌకర్యాలను అందిస్తున్నాయి. LED హెడ్‌ ల్యాంప్స్, LED DRLs, 360 డిగ్రీ కెమెరా, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌ లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లాంటి ఫీచర్లు రెండింటిలో ఉన్నాయి. అయితే, వెన్యూలో 12.3 అంగుళాల పెద్ద టచ్‌ స్క్రీన్, డిజిటల్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌ రూఫ్, బోస్ సౌండ్ సిస్టమ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ లాంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. మరోవైపు బ్రెజ్జాలో హెడ్స్ అప్ డిస్‌ ప్లే, LED ఫాగ్ ల్యాంప్స్ లాంటి ప్రత్యేక ఫీచర్లు లభిస్తున్నాయి.

భద్రతలో వెన్యూ కాస్త ముందు!     

రెండు SUVలు కూడా భారత్ NCAPలో 5 స్టార్ భద్రతా రేటింగ్ సాధించాయి. ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ESC, TPMS, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు రెండింటిలోనూ ఉన్నాయి.అయితే హ్యుందాయ్ వెన్యూ లెవెల్-2 ADAS, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, నాలుగు డిస్క్ బ్రేకులు, ట్రాక్షన్ కంట్రోల్ లాంటి అదనపు భద్రతా ఫీచర్లతో కొంత ఆధిక్యం చూపిస్తుంది. బ్రెజ్జాలో మాత్రం   లెవెల్-1 ADAS ఫీచర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఇంజిన్ ఆప్షన్స్

మారుతి బ్రెజ్జాలో 1.5 లీటర్ పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్‌తో పాటు ఫ్యాక్టరీ ఫిటెడ్ CNG ఆప్షన్ కూడా లభిస్తుంది. మంచి మైలేజ్ కోరుకునే అనుకూలంగా ఉంటుంది. హ్యుందాయ్ వెన్యూ 1.2 లీటర్ పెట్రోల్, 1 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ లాంటి మూడు ఇంజిన్ ఎంపికలను అందిస్తోంది. ముఖ్యంగా టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజిన్లు మంచి పనితీరును అందిస్తాయి. ఎక్కువ పవర్ కోరుకునే వారికి వెన్యూ తీసుకోవచ్చు.

ఏది కొంటే బెస్ట్?

తక్కువ ధర, మంచి మైలేజ్, CNG ఆప్షన్ కావాలంటే 2026 మారుతి బ్రెజ్జా తీసుకోవాలి. ప్రీమియం ఇంటీరియర్, ఎక్కువ టెక్నాలజీ, లెవెల్-2 ADAS, పనోరమిక్ సన్‌రూఫ్, టర్బో, డీజిల్ ఇంజిన్ కావాలంటే హ్యుందాయ్ వెన్యూ బెస్ట్ ఆప్షన్.

Read Also: తక్కువ ధరలో.. అదిరిపోయే ఫీచర్లు.. ఫోర్స్ అర్బానియా డీలక్స్ వచ్చేసింది!

Related News

జూలైతో పోల్చితే ఆగస్టులో తగ్గిన EV స్కూటర్ అమ్మకాలు.. కారణం ఏంటంటే?

కైనెటిక్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఏకంగా 132 కి.మీ రేంజ్!

టెస్లా సైబర్‌ ట్రక్‌కు ఇండియన్ టచ్.. ఫొటోలు చూస్తే నవ్వు ఆపుకోలేరు!

నెక్సాన్ To కర్వ్.. సెప్టెంబర్ లో టాటా కార్లపై ఊహించని డిస్కౌంట్లు!

మహీంద్రా SUVలపై భారీ డిస్కౌంట్లు.. స్కార్పియో Nపై ఏకంగా రూ.3 లక్షల తగ్గింపు!

ఎలక్ట్రిక్ స్కూటర్లకు సూపర్ డిమాండ్.. 8 నెలల్లోనే 13 లక్షలకు పైగా అమ్మకాలు!

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

Big Stories

Advertisement
×