E-Paper
Advertisement

పెళ్లయిన 12 ఏళ్ల తర్వాత తల్లైన అయిన ‘శీను వాసంతి లక్ష్మీ’ బ్యూటీ!

పెళ్లయిన 12 ఏళ్ల తర్వాత తల్లైన అయిన ‘శీను వాసంతి లక్ష్మీ’ బ్యూటీ!
Advertisement

Tollywood:వివాహం తర్వాత ఏ మహిళ అయినా సరే అమ్మ అని పిలిపించుకోవడానికి ఎంతో పరితపిస్తుంది. అయితే ఆ అదృష్టం కొంతమందికి పెళ్లయిన కొన్నాళ్లకే వరిస్తే.. మరి కొంతమందికి దశాబ్దాలు గడిచినా ఆ భాగ్యానికి నోచుకోక ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే సడన్ గా అదృష్టం వారి జీవితంలోకి వస్తే మాత్రం ఆ సంతోషం వర్ణనాతీతం. ఈ క్రమంలోనే ఒక నటి పెళ్లయిన.. 12 ఏళ్ల తర్వాత తల్లి కాబోతున్నాను అంటూ ఆ శుభవార్తను అభిమానులతో పంచుకుంది.ఆ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఆమె ఎవరు? అనే విషయం ఇప్పుడు చూద్దాం..

తల్లైన శర్వానంద్ హీరోయిన్..

ఆమె ఎవరో కాదు 2004లో శీను వాసంతి లక్ష్మి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పద్మప్రియ జానకీ రామన్ (padmapriya Janaki Raman). అందరి బంధువయా, పటేల్ సార్ వంటి చిత్రాలలో నటించి మంచి పేరు సొంతం చేసుకున్న ఈమె.. ఆ తర్వాత హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ , ఇంగ్లీష్ భాషల్లో కూడా విలక్షణ పాత్రలు పోషించి నటిగా మంచి పేరు సొంతం చేసుకుంది. ముఖ్యంగా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఆ నటనకు తగ్గ గౌరవాన్ని కూడా అందుకుంది. నేషనల్ ఫిలిం అవార్డుతో పాటు కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, మూడు ఫిలింఫేర్ అవార్డులను కూడా దక్కించుకుంది.

Advertisement

ALSO READ:పదహారేళ్లకే టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్.. అప్పుడే షూటింగ్ పూర్తి!

పెళ్లయిన 12 ఏళ్ల తర్వాత..

కెరియర్ పీక్స్ లో ఉండగానే 2014లో గుజరాత్ కి చెందిన జాస్మిన్ షాను ముంబైలో ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ సినిమాల్లో నటిస్తున్న ఈమె గత ఏడాది డియర్, యువ సస్నాన్ కా సఫర్ వంటి చిత్రాలలో నటించింది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ అభిమానులను ఆకట్టుకునే ఈమె.. తాజాగా ఒక శుభవార్తను అభిమానులతో పంచుకుంది. తాను పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అంతేకాదు తన బిడ్డ చేతులను పట్టుకున్న ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యింది.

పుట్టింది ఎవరు?

Advertisement

ఇప్పటివరకు తన ప్రెగ్నెన్సీ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచడమే కాకుండా సడన్గా ఈ పిక్ చూసిన నెటిజన్స్ మాత్రం ఆశ్చర్యపోతున్నారు. అయితే తనకు పుట్టింది పాపా ?లేక బాబా? అన్న విషయాన్ని ఈమె అధికారికంగా వెల్లడించలేదు. మొత్తానికి అయితే పెళ్లయిన 12 ఏళ్లకు అంటే 46 సంవత్సరాల వయసులో తల్లి కావడంతో సినీ సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్స్ పద్మప్రియ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Related News

పిల్లలు ఉన్నా.. లేకపోయినా ఒకే అనుకున్నాం..కానీ: సమంత

ఫౌజీ అసలు వస్తుందా? ప్రభాస్ సినిమా చుట్టూ పెరుగుతున్న సస్పెన్స్!

ఫ్యాన్స్ అంటే సెలబ్రేషన్స్ మాత్రమే కాదు..మనసులు గెలిచిన అల్లు అర్జున్ ఫ్యాన్స్!

మనవడి కోసం నాగబాబు సంచలన నిర్ణయం!

అప్పుడే ఏడాది..క్యూట్ పిక్ తో కొడుకుకి స్పెషల్ విషెస్ చెప్పిన వరుణ్ తేజ్ !

ఫ్యాన్స్ కి విజయ్ దేవరకొండ పిలుపు!

నిఖిల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘స్వయంబు’ రిలీజ్ అప్పడే..?

‘సర్దార్ 2’ ట్విట్టర్ రివ్యూ.. కార్తీ అకౌంట్లో హిట్ పడిందా..?

Big Stories

Advertisement
×