E-Paper
Advertisement

Maruti Celerio Carsh Test: మారుతి సెలెరియో క్రాష్ టెస్ట్.. రిజల్ట్ చూస్తే షాక్!

Maruti Celerio Carsh Test: మారుతి సెలెరియో క్రాష్ టెస్ట్..  రిజల్ట్ చూస్తే షాక్!
Advertisement

Global NCAP Maruti Celerio Crash Teste: కారు బయ్యర్లు.. రెండు అంశాలను అత్యంత కీలకంగా భావించి కొనుగోలు చేస్తున్నారు. ఒకటి కారు లుక్ కాగా, మరొకటి సేఫ్టీ రేటింగ్. ఎంత సేఫ్టీ రేటింగ్ ఎక్కువ ఉంటే, కొనుగోలుదారులు అంత మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే తాజాగా మారుతి సుజుకి సెలెరియో క్రాష్ టెస్ట్ జరిగింది. గ్లోబల్ NCAP తాజాగా ఈ టెస్ట్ ఫలితాలను విడుదల చేసింది. 2-ఎయిర్‌ బ్యాగ్స్, 6-ఎయిర్‌బ్యాగ్స్ వేరియంట్స్ కు సంబంధించిన వివరాలను వెల్లడించింది. భారత్ లో తయారై దేశీయ మార్కెట్లో అమ్ముడవుతున్న ఈ హ్యాచ్‌ బ్యాక్, అడల్ట్, పిల్లల రక్షణకు సంబంధించి గ్లోబల్ NCAP లేటెస్ట్ టెస్ట్ ప్రోటోకాల్స్ ప్రకారం అంచనా వేసింది.  కింద అంచనా వేయబడింది.

సెలెరియో క్రాష్ టెస్ట్ ఫలితాలు  

మారుతి సుజుకి సెలెరియో (6 ఎయిర్‌ బ్యాగ్స్ స్టాండర్డ్)ను గ్లోబల్ NCAP లేటెస్ట్, స్ట్రింజెంట్ ప్రోటోకాల్స్ కింద టెస్ట్ చేశారు. ఇవాళ రిజల్ట్స్ ను విడుదల చేశారు.

సెలెరియో సేఫ్టీ రేటింగ్

Advertisement

⦿ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్:  3 స్టార్స్  రేటింగ్ సాధించింది. మొత్తం 34 పాయింట్లలో 18.04 పాయింట్లు సాధించింది.

⦿ చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్: 2 స్టార్స్ రేటింగ్ సాధించింది. మొత్తం 49 పాయింట్లలో 18.57 పాయింట్లు సాధించింది.

Advertisement

2 ఎయిర్‌ బ్యాగ్స్ వేరియంట్ ఎక్స్‌ పోర్ట్ మార్కెట్లకు కూడా టెస్ట్ చేశారు. అడల్ట్‌ కు 2 స్టార్స్, చైల్డ్‌ కు 1 స్టార్ రేటింగ్ మాత్రమే సాధించింది. ఇండియాలో అమ్మే సెలెరియోలో 6 ఎయిర్‌ బ్యాగ్స్ స్టాండర్డ్ కాబట్టి 3-స్టార్ రేటింగ్ లభించింది.

సెలెరియో క్రాష్ టెస్ట్ కీలక అంశాలు

⦿ ఫ్రంటల్ ఇంపాక్ట్: డ్రైవర్,  ప్యాసింజర్ హెడ్ అడిక్వేట్, నెక్ ప్రొటెక్షన్ గుడ్. కానీ, ఫుట్‌ వెల్ ఏరియా, బాడీషెల్ అన్‌ స్టేబుల్.

⦿ సైడ్ ఇంపాక్ట్: హెడ్, చెస్ట్ ప్రొటెక్షన్ మార్జినల్, అబ్డామెన్ అడిక్వేట్, పెల్విస్ గుడ్.

⦿ సైడ్ పోల్ ఇంపాక్ట్: పాస్ అయింది, కానీ చెస్ట్, అబ్డామెన్ మార్జినల్.

⦿ చైల్డ్ సేఫ్టీ: ఫ్రంటల్ ఇంపాక్ట్‌ లో పిల్లల డమ్మీలకు హెడ్, నెక్, చెస్ట్ ప్రొటెక్షన్ పూర్. చైల్డ్ సీట్స్ ఇన్‌స్టాలేషన్, ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్ డిసేబుల్ చేయలేకపోవడం సమస్యలు తలెత్తాయి.

⦿ ఇతర ఫీచర్లు: ESC స్టాండర్డ్, సీట్‌ బెల్ట్ రిమైండర్స్, ISOFIX మౌంట్స్ ఉన్నాయి.

మారుతి సుజుకి కొత్త మోడల్స్ (Dzire, Victoris)లో 5-స్టార్ పెర్ఫార్మెన్స్ చూపిస్తోంద.  కానీ, లెగసీ మోడల్స్ లాంటి సెలెరియోలో ఇంకా స్ట్రక్చరల్ ఇంప్రూవ్‌మెంట్స్ అవసరం అని ఆటో నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 6 ఎయిర్‌ బ్యాగ్స్ యాడ్ చేయడం వల్ల మెరుగైన రేటింగ్ సాధించింది. కానీ, బాడీ స్ట్రక్చర్ లిమిటేషన్స్ వల్ల 5 స్టార్స్ రాలేదు. తాజాగా టెస్ట్ చేసిన మోడల్ మన దేశంలో తయారు చేయబడింది. ఈ రేటింగ్ భారత మార్కెట్లో విక్రయించే కార్లకు వర్తిస్తుంది. సెలెరియో లాంటి ఎంట్రీ లెవల్ హ్యాచ్‌ బ్యాక్‌ లలో అధునాతన భద్రతా ఫీచర్లను మరిన్ని యాడ్ చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read Also:  వోక్స్‌ వ్యాగన్ నుంచి మైండ్ బ్లోయింగ్ కార్లు, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×