E-Paper
Advertisement

Maruti Ignis: జస్ట్ రూ. 5 లక్షల్లో స్టైలిష్ కారు, మతిపోగొట్టేస్తున్న మారుతి ఇగ్నిస్!

Maruti Ignis: జస్ట్ రూ. 5 లక్షల్లో స్టైలిష్ కారు, మతిపోగొట్టేస్తున్న మారుతి ఇగ్నిస్!
Advertisement

Maruti Ignis 2026: మారుతి సుజుకి ఇగ్నిస్ కారు దేశీ మార్కెట్ లో కాంపాక్ట్ హ్యాచ్‌ బ్యాక్ మోడల్ గా కొనసాగుతోంది. ఇది స్టైలిష్ డిజైన్, మంచి మైలేజ్, లేటెస్ట్ ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఇది నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా అందుబాటులో ఉంది. ఈ కారుకు సంబంధించిన ధరలు, స్పెసిఫికేషన్లతో పాటు పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

మారుతి సుజుకి ఇగ్నిస్ ధరలు  

మారుతి సుజుకి ఇగ్నిస్ కారు ధరలు రూ.5.35 లక్షల నుంచి రూ. 7.55 లక్షల వరకు ఉంటుంది. వేరియంట్ల వారీగా ధరలు మారుతాయి. ఇగ్నిస్ సిగ్మా వేరియంట్ ధర రూ. 5.35 లక్షలు ఉంటుంది. డెల్టా వేరియంట్ ధర రూ. 5.85 లక్షల నుంచి రూ. 6.30 లక్షలు ఉంటుంది. జీటా వేరియంట్ ధర రూ. 6.38 లక్షల నుంచి రూ. 6.95 లక్షలు ఉంటుంది. ఆల్ఫా వేరియంట్ ధర రూ. 6.97 లక్షల నుంచి రూ. 7.55 లక్షలు ఉంటుంది.  ఆన్ రోడ్ రేట్లు కాస్త ఎక్కువగా ఉంటాయి. అదనపు ఛార్జీలు ముఖ్యంగా రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ట్యాక్స్ కారణంగా మారుతాయి.

ఇగ్నిస్ స్పెసిఫికేషన్లు

Advertisement

ఈ కారులో 1.2L VVT పెట్రోల్ (BS VI 2.0 కంప్లయంట్) ఇంజిన్ ఉంటుంది.  డిస్‌ప్లేస్‌మెంట్ 1197 cc ఉంటుంది. నాలుగు సిలిండర్లు ఉంటాయి. 81.80 bhp @ 6000 rpm పవర్, టార్క్113 Nm @ 4200 rpm ప్రొడ్యూస్ అవుతుంది. ట్రాన్స్‌ మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ లేదంటే ఆటోమేటిక్ ఉంటుంది.  మైలేజ్ లీటర్ కు 20.89 కిలో మీటర్లు ఇస్తుంది. బూట్ స్పేస్ 260 లీటర్లు ఉంటుంది. 5 సీట్ల కెపాసిటీ ఉంటుంది.  ఫ్రంట్ డిస్క్, రియర్ డ్రమ్ బ్రేకులు ఉంటాయి.

ఇగ్నిస్ ఫీచర్లు

ఈ కారులో LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, LED DRLs, క్రోమ్ గ్రిల్, స్పోర్టీ రూఫ్ రైల్స్,  అల్లాయ్ వీల్స్, రియర్ స్పాయిలర్, ఫాగ్ లైట్స్ ఉంటాయి. ఆటో క్లైమేట్ కంట్రోల్,  హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, పుష్ స్టార్ట్, స్టాప్ బటన్, కీలెస్ ఎంట్రీ, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. 7 ఇంచుల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్‌ ప్లే స్టూడియో, బ్లూటూత్, USB, వాయిస్ కమాండ్స్, 4 స్పీకర్లు, 2 ట్వీటర్లు ఉంటాయి.

Advertisement

Read Also: అన్ కంఫర్టబుల్ ఫ్రంట్ సీట్లు ఉన్న కార్లు ఇవే.. కొనేటప్పుడు కాస్త జాగ్రత్త!

ఇగ్నిస్ సేఫ్టీ ఫీచర్లు

ఈ కారులో 2 ఎయిర్‌ బ్యాగులు ఉంటాయి. ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ ఉంటుంది. ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, చైల్డ్ సేఫ్టీ లాక్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ కెమెరా విత్ గైడ్‌ లైన్స్,  స్పీడ్ అలర్ట్, సీట్ బెల్ట్ వార్నింగ్, యాంటీ థెఫ్ట్ అలారం, ఇంజిన్ ఇమ్మొబిలైజర్ ఉంటుంది. గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్ 1 స్టార్ ను పొందింది. ఈ కారు నెక్సా బ్లూ, పెర్ల్ ఆర్క్టిక్ వైట్, టర్క్వాయిస్ బ్లూ, గ్రానైట్ గ్రే, లూసెంట్ ఆరెంజ్, సిల్కీ సిల్వర్ రంగుల్లో ఉంటాయి.

Read Also: వచ్చేస్తోంది హోండా యాక్టివా 7G, లాంచింగ్ ఎప్పుడో తెలుసా?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×