E-Paper
Advertisement

Telangana News: మావోలకు ఎదురుదెబ్బ.. చిక్కిన హిడ్నా వారసుడు బార్సే, తెలంగాణ పోలీసుల అదుపులో

Telangana News: మావోలకు ఎదురుదెబ్బ.. చిక్కిన హిడ్నా వారసుడు బార్సే, తెలంగాణ పోలీసుల అదుపులో
Advertisement

Telangana News: దేశంలో మావోయిస్టులకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఓ వైపు ఎన్‌కౌంటర్లలో హతం కావడం, మరోవైపు కేడర్ లొంగిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తాజాగా మావోయిస్టు టాప్ కమాండర్ హిడ్మా హతం తర్వాత ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టాడు బార్సే దేవా అలియాస్ సుక్కా. ఇప్పుడు ఆయన తెలంగాణ పోలీసులకు చిక్కాడు. ఆయనతోపాటు మరో 15 మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం.

Advertisement

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ

Advertisement

దేశంలో ఈ ఏడాది మార్చి చివరినాటికి  మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదే పదే చెబుతున్నారు. అన్నట్లుగా బలగాలు ఆ విధంగా దూసుకుపోతున్నాయి. మంచి ఫలితాలు వస్తున్నాయి.  ఇటీవల జరిగిన చాలా ఎన్‌కౌంటర్లలో మావోయిస్టుల అగ్రనేతలు హతమయ్యారు.  ఇప్పుడు మావోలకు ఊహించని దెబ్బ తగిలింది. 

మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ వన్ కమాండర్ బార్సే దేవా అలియాస్ సుక్కు తెలంగాణ పోలీసులకు చిక్కాడు. అతడు ప్రస్తుతం బెటాలియన్ 1 కమాండర్‌గా ఉన్నాడు. స్వగ్రామం ఛత్తీస్‌గఢ్‌లోని పువర్తి గ్రామం. మిలిటరీ శిక్షణలో ఆరితేరిన దేవా, బెటాలియాన్ 1కు 2017లో బాధ్యతలు చేపట్టాడు.   గతంలో హిడ్మాతో కలిసి పని చేసిన అనుభవం బార్సే దేవా ఉంది.  అతడిపై రూ.50 లక్షల రివార్డు ఉంది. 

తెలంగాణ పోలీసుల అదుపులో హిడ్మా వారసుడు  బార్సే దేవా

ఇటీవల మావోల టాప్ కమాండర్ మడావి హిడ్మా ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అతని స్థానంలోబార్సే దేవా బాధ్యతలు తీసుకున్నాడు. ములుగు- భూపాలపల్లి సరిహద్దు అటవీ ప్రాంతంలో అతడ్ని తెలంగాణ  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవాతోపాటు మరో 15 మంది మావోలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.  నేడో, రేపో మీడియా ముందు ప్రవేపెట్టనున్నట్లు సమాచారం.

దండకారణ్యంలో మావోయిస్టు పార్టీని దూకుడుగా నడిపించిన టాప్‌ కమాండర్‌ మడావి హిడ్మా మరణం తర్వాత ఆ స్థానం కోసం అన్వేషణ సాగింది. చివరకు హిడ్మాకు సహచరుడు, ఆయన గ్రామం పువర్తికే చెందిన బార్సె దేవాను  ఆ స్థానంలో నియమితులయ్యాడు. తాజాగా బార్సెదేవను సైతం తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలినట్లైంది.

ALSO READ:  గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం.. బళ్లారిలో ఉద్రిక్తత

మరోవైపు మావోయిస్టు కమాండర్ బార్సే దేవా మరో 15 మంది మావోయిస్టులను వెంటనే కోర్టులో హాజరు పరచాలని ఫొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసి రెండురోజులు గడుస్తున్నా, వారిని కోర్టులో హాజరు పరచకపోవడం అప్రజాస్వామికమేనన్నారు. చట్టప్రకారం రాజ్యాంగబద్ధంగా కోర్టులో హాజరు పరచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

 

 

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×