E-Paper
Advertisement

మారుతి ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు రేపే లాంచ్.. ఇంతకీ వాగన్ ఆరా? ఫ్రాంక్సా?

మారుతి ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు రేపే లాంచ్.. ఇంతకీ వాగన్ ఆరా? ఫ్రాంక్సా?
Advertisement

Maruti’s Flex-Fuel Revolution: ఇండియన్ ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి సరికొత్త ముందడుగు వేయబోతోంది. ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును జూన్ 4న అధికారికంగా ఆవిష్కరించబోతోంది. 100 శాతం ఇథనాల్‌ తో నడిచే  ఈ కారు దేశంలో మాస్ మార్కెట్ విభాగంలో ఫస్ట్ ప్యాసింజర్ వెహికల్ కాబోతోంది. అయితే, ఈ కొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ వాగన్ ఆరా? లేక ఫ్రాంక్సా? అనేది ఆసక్తికరంగా మారింది.  మారుతి సుజుకి ఈ ప్రాజెక్ట్‌ ను అధికారికంగా ప్రకటించినప్పటికీ, ఏ మోడల్‌ను విడుదల చేయబోతున్నదనే విషయాన్ని ఇప్పటి వరకు సీక్రెట్ గానే ఉంచింది. దీంతో ఆటోమొబైల్ రంగంలో ఆసక్తి మరింత పెరిగింది.

ప్రత్యామ్నాయ ఇంధన టెక్నాలజీపై మారుతి ఫోకస్

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ దృష్టి ఉన్నప్పటికీ, మారుతి మాత్రం ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతికతపై దృష్టి పెడుతోంది. ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనం స్వచ్ఛమైన ఇథనాల్‌ తో పాటు వివిధ ఇథనాల్-పెట్రోల్ మిశ్రమాలపై కూడా నడిచేలా రూపొందించబడింది. ఈ కారు పెట్రోల్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణహిత రవాణా వైపు కీలక అడుగు వేస్తోంది.

ఇంతకీ వ్యాగన్ ఆరా? ఫ్రాంక్సా?

Advertisement

మారుతి ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారుగా వాగన్ ఆర్ రానున్నట్లు టాక్ విపిపిస్తోంది దానికి కారణం, 2024లో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌ పోలో మారుతి వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రోటోటైప్‌ ను ప్రదర్శించింది. దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే హ్యాచ్‌ బ్యాక్‌ లలో వాగన్ ఆర్ ఒకటి కావడంతో, ఈ కొత్త టెక్నాలజీని సామాన్య వినియోగదారులకు చేరవేయడానికి ఇది సరైన ఎంపికగా భావిస్తున్నారు. అయితే, ఫ్రాంక్స్‌ ను కూడా తక్కువ అంచనా వేయలేమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 2025 జపాన్ మొబిలిటీ షోలో మారుతి ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కాన్సెప్ట్‌ ను ప్రదర్శించింది. ప్రస్తుతం కంపెనీకి అత్యంత ఎక్కువ అమ్మకాలు జరుపుకుంటున్న మోడళ్లలో ఫ్రాంక్స్ ఒకటి. అందువల్ల ఈ కొత్త సాంకేతికతను మరింత ప్రీమియం స్థాయిలో చూపించేందుకు కంపెనీ ఫ్రాంక్స్‌ ను ఎంపిక చేసే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

రేపే అధికారికంగా ప్రారంభం

ఇటీవల కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మారుతి తీసుకురాబోయే వాహనం 100 శాతం ఇథనాల్‌ తో నడిచే సామర్థ్యం కలిగి ఉంటుందన్నారు. జూన్ 4న ఢిల్లీలో జరిగే ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయనతో పాటు మరో కేంద్రమంత్రి హరిదీప్ సింగ్ పూరి కూడా హాజరుకానున్నారు.

ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లతో లాభం ఏంటి?

Advertisement

ఇథనాల్ ఆధారిత వాహనాలు ఇంధన దిగుమతులను తగ్గించడంలో, కాలుష్యాన్ని నియంత్రించడంలో, రైతులకు అదనపు ఆదాయ అవకాశాలను కల్పించడంలో ఉపయోగపడతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదే కారణంగా ఈ సాంకేతికతకు ప్రోత్సాహం అందిస్తోంది. వాగన్ ఆర్ అయినా, ఫ్రాంక్స్ అయినా, జూన్ 4న ఆవిష్కరించబోయే ఈ వాహనం భారత ఆటోమొబైల్ రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికే అవకాశం ఉంది.

Read Also: జూన్ 9న BYD సర్‌ప్రైజ్.. 1,092 కి.మీ రేంజ్ హైబ్రిడ్ కారు వచ్చేస్తోంది!

Related News

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?

మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లే ఫాస్టా? ఇదీ అసలు కథ!

ఏంటీ.. మారుతీ, హుందాయ్‌లో 5 స్టార్ సేఫ్టీ కార్లు ఉన్నాయా? ఇదిగో లిస్టు!

యమహా R2 వచ్చేసింది.. ఈ బైక్‌ లో అదిరిపోయే 5 హైలైట్స్ ఇవే!

సింపుల్ ఫ్లిప్ అప్ కాదు.. ఈ హెల్మెట్ 180 డిగ్రీలు తిరుగుతుంది!

Big Stories

Advertisement
×