E-Paper
Advertisement

DWCRA Fraud: మెప్మా, డ్వాక్రా సంఘాల ఉద్యోగుల భారీ మోసం.. ఏకంగా రూ.65 కోట్లు స్కామ్

DWCRA Fraud: మెప్మా, డ్వాక్రా సంఘాల ఉద్యోగుల భారీ మోసం.. ఏకంగా రూ.65 కోట్లు స్కామ్
Advertisement

DWCRA Fraud: పల్నాడు జిల్లాలో మెప్మా, డ్వాక్రా సంఘాల ఉద్యోగులు భారీ మోసానికి పాల్పడ్డారు. గ్రూపు సభ్యులకు తెలియకుండా పెద్దమొత్తంలో లోన్లు తీసుకున్నారు మెప్మా సీవో లు, ఆర్.పి లు, డ్వాక్రా సంఘాల సీసీ లు, యానిమేటర్లు. గ్రూప్ సభ్యులు చెల్లించిన సొమ్మును బ్యాంక్ లో జమ చేయకుండా కాజేశారు. నరసరావుపేట మండలంలోని జొన్నలగడ్డ, పెట్లూరివారిపాలెం, చిన్నతురకపాలెం గ్రామాల్లో సుమారు 50 లక్షల రూపాయలు కాజేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. చిలకలూరిపేట, సత్తెనపల్లి, నరసరావుపేటలో నకిలీ గ్రూపులు ఏర్పాటు చేసి మొత్తం రూ.40 కోట్లు కాజేసినట్టు ఆరోపణలు.

పల్నాడు జిల్లా మెప్మా శాఖలో జరిగిన నిధుల గోల్‌మాల్‌పై సీఎం చంద్రబాబుకి వివరించారు కలెక్టర్ కృతికా శుక్లా. నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అవసరమైతే నిందితుల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికైనా వెనుకాడొద్దని చెప్పారు సీఎం.

Advertisement

ఇటీవల నల్లపాడు సొసైటీలో భారీ స్కామ్‌కు పాల్పడింది కీలక ఉద్యోగిని. ఆమెను నల్లపాడు నుంచి నరసరావుపేటకు బదిలీ చేశారు అధికారులు. బదిలీ తర్వాత కూడా తీరు మార్చుకోని ఉద్యోగిని.. మరికొంతమందితో కలసి నరసరావుపేటలో 25 కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. పలు బ్యాంకుల్లో నకిలీ మెప్మా, డ్వాక్రా గ్రూప్ లు క్రియేట్ చేసి కోట్ల రూపాయలు పక్కదారి పట్టించనట్లు గుర్తించారు. జిల్లాలో జరిగిన మెప్మా, డ్వాక్రా గ్రూప్ ల స్కామ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ALSO READ: Shocking Murder: వీడు భర్త కాదు..రాక్షసుడు.. కట్నం కోసం భార్యను ఎలా చంపాడంటే!

Related News

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

Big Stories

Advertisement
×