E-Paper
Advertisement

Mahindra XEV 9e: ICOTY 2026లో సత్తా చాటిన మహీంద్రా XEV 9e, ఆ కేటగిరీలో అవార్డు కైవసం!

Mahindra XEV 9e: ICOTY 2026లో సత్తా చాటిన మహీంద్రా XEV 9e, ఆ కేటగిరీలో అవార్డు కైవసం!

 Green Car of the Year Award 2026: మహీంద్రా కంపెనీకి చెందిన ప్రతిష్టాత్మక ఎలక్ట్రిక్ కారు XEV 9e, ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ (ICOTY) 2026లో సత్తా చాటింది. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో మిగతా పోటీదారులను ఓడించి..గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది, పవర్ ఫుల్ ఎలక్ట్రిక్, పర్యావరణ అనుకూలమైన ఇతర కార్లను కాంపిటీషన్ లో అధిగమించింది టాప్ లో నిలిచింది. XEV జ్యూరీ మెంబర్స్ నుంచి ఎక్కువ స్కోర్ ను పొందింది.  రేంజ్, టెక్నాలజీ, సౌకర్యం, బ్రాండ్ వ్యాల్యూ లాంటి అంశాల్లో మంచి స్కోర్ సాధించింది. ఎలక్ట్రిక్ విభాగంలో ICOTY 2026 అవార్డును పొందింది.

ఏ కార్లతో మహీంద్రా XEV 9e పోటీపడిందంటే?

గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం మహీంద్రా XEV 9e.. BMW iX1 LWB, BYD సీలియన్ 7, కియా కారెన్స్ క్లావిస్ EV, MG సైబర్‌స్టర్, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా హారియర్ EV, టెస్లా మోడల్ Y లాంటి వాటితో పోటీ పడింది. అన్ని అంశాలలో మిగతా కార్లను అధిగమించింది.

మహీంద్రా XEV 9e గురించి..

మహీంద్రా XEV 9e ప్రీమియం ఎలక్ట్రిక్ కూపే SUV. ఇది INGLO ప్లాట్‌ఫాం పై బిల్ట్ అయ్యింది. ఫ్యూచరిస్టిక్ డిజైన్, హై పర్ఫార్మెన్స్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో వచ్చింది. 2024 నవంబర్‌ లో లాంచ్ అయ్యింది. డెలివరీస్ 2025 మార్చి నుంచి స్టార్ట్ అయ్యాయి.

మహీంద్రా XEV 9e ధరలు (ఎక్స్-షోరూమ్)

బేస్ వేరియంట్ (Pack One – 59 kWh): రూ.21.90 లక్షల నుంచి స్టార్ట్..

టాప్ వేరియంట్ (Pack Three – 79 kWh): రూ.30.50 లక్షల వరకు

మహీంద్రా XEV 9e బ్యాటరీ, రేంజ్

59 kWh బ్యాటరీ: ARAI సర్టిఫైడ్ రేంజ్ 542కిలో మీటర్లు

79 kWh బ్యాటరీ: ARAI సర్టిఫైడ్ రేంజ్ 656 కిలో మీటర్లు

ఫాస్ట్ చార్జింగ్: 175 kW DCతో 20-80% కేవలం 20 నిమిషాల్లో అవుతుంది.

మహీంద్రా XEV 9e కీ ఫీచర్స్

ట్రిపుల్ 12.3-ఇంచ్ స్క్రీన్ సెటప్ (డ్రైవర్, ఇన్ఫోటైన్‌మెంట్, ప్యాసింజర్)

పనోరమిక్ గ్లాస్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్స్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్

Harman Kardon 16-స్పీకర్ సౌండ్ సిస్టమ్ విత్ Dolby Atmos

Level 2 ADAS, ఆటో పార్క్ అసిస్ట్, 360° కెమెరా

5-స్టార్ Bharat NCAP సేఫ్టీ రేటింగ్

Read Also: బుకింగ్స్ లో దుమ్మురేపుతున్న టాటా సియెర్రా, 24 గంటల్లో ఏకంగా 70 వేల బుకింగ్స్!

డిజైన్, డైమెన్షన్స్

కూపే-స్టైల్ SUV విత్ బోల్డ్ LED లైట్స్, ఇల్యూమినేటెడ్ లోగో, 19-20 ఇంచ్ అల్లాయ్ వీల్స్తో వస్తుంది.  ఫన్ టు డ్రైవ్, స్టైలిష్, కంఫర్టబుల్ రైడ్, గుడ్ రియల్ వరల్డ్ రేంజ్ లాంటి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. ఈ కారు Tata Harrier EV, BYD Atto 3తో పోటీ పడుతుంది.

Read Also: వోక్స్ వ్యాగన్ గోల్ఫ్ GTIకి అరుదైన గుర్తింపు, ప్రతిష్టాత్మక అవార్డు కైవసం!

Related News

ఇండియన్ మార్కెట్ లోకి యమహా NMax 155 ఎంట్రీ, ఫీచర్లు చూస్తే షాక్!

టీవీఎస్, బజాజ్ జోరు.. ఓలా బేజారు.. ఈవీ స్కూటర్ అమ్మకాల్లో టాప్ 5 మోడల్స్ ఇవే!

ఒకే ఇంజిన్.. రెండు బైక్స్.. బుల్లెట్ 650 vs క్లాసిక్ 650 డిఫరెన్స్ ఇవే!

అవెంజర్ లవర్స్ కు గుడ్ న్యూస్.. రెండు రంగుల్లో స్ట్రీట్ 220 మళ్లీ ఎంట్రీ!

95 కి.మీ క్లెయిమ్.. కానీ, నిజంగా ఇ-యాక్సెస్ ఇచ్చిన రేంజ్ ఎంతో తెలుసా?

టాటా మోటార్స్ మాస్టర్ ప్లాన్.. అవిన్యా X లాంచింగ్ డేట్ ఫిక్స్!

మహీంద్రాను దాటేసిన టాటా.. మే 2026 ఈవీ అమ్మకాల్లో సరికొత్త రికార్డు!

పెట్రోల్‌ తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కొత్త వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ ప్రత్యేకతలు ఇవే!

Big Stories

×