E-Paper
Advertisement

Maruti Suzuki Victoris VS Tata Curvv: మారుతి సుజుకి విక్టోరిస్ VS టాటా కర్వ్.. ఏది బెస్ట్? ఎందుకు?

Maruti Suzuki Victoris VS Tata Curvv:  మారుతి సుజుకి విక్టోరిస్ VS టాటా కర్వ్.. ఏది బెస్ట్? ఎందుకు?

భారతీయ ఆటో మోబైల్ మార్కెట్ లో మారుతి సుజుకి విక్టోరిస్, టాటా కర్వ్..  కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌ లో గట్టి పోటీదారులుగా కొనసాగుతున్నాయి. రెండు కార్లూ వినియోగదారుల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయి. వీటి ధరలు కూడా దాదాపు సమానంగా ఉన్నాయి. ఫీచర్లు, పవర్‌ ట్రైన్‌లు ఆకట్టుకుంటున్నాయి. ఈ రెండు కార్ల మధ్య తేడాలు ఏంటి? ఏది ఎవరికి బెస్ట్? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ ధర (ఎక్స్-షోరూమ్)

❂ మారుతి సుజుకి విక్టోరిస్: వేరియంట్లు ఆధారంగా రూ.10.49 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుంది.

❂ టాటా కర్వ్: రూ.9.99 లక్షల నుంచి రూ.19.5 లక్షల వరకు ఉంటుంది.

టాటా కర్వ్ బేస్ మోడల్ కొంచెం చౌకగా ఉంటుంది. కానీ, టాప్ వేరియంట్లలో రెండింటి ధర సమానంగా ఉంటుంది.

⦿ డిజైన్- డైమెన్షన్స్

❂ విక్టోరిస్: ట్రెడిషనల్ SUV లుక్, షార్ప్ లైన్స్, మస్క్యులర్ బాడీ. యంగ్ బయ్యర్లను ఆకట్టుకుంటుంది. వీల్‌ బేస్ 2600mm, బూట్ స్పేస్ బాగుంటుంది. CNGలో అండర్‌ బాడీ ట్యాంక్ వల్ల ఎక్కువ స్పేస్.

❂ కర్వ్: కూప్ SUV స్టైల్. స్లోపింగ్ రూఫ్‌లైన్, యూనిక్,  స్పోర్టీ లుక్. పెద్ద సైజు, వైడ్ బాడీ ఉంటుంది.

కర్వ్ డిజైన్‌ లో హెడ్ టర్నర్, విక్టోరిస్ ప్రాక్టికల్, ఫ్యామిలీ ఫ్రెండ్లీగా ఉంటుంది.

⦿ ఇంజన్- పవర్‌ట్రైన్ ఆప్షన్స్

❂ విక్టోరిస్: 1.5L పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్ (91-103 hp),  స్ట్రాంగ్ హైబ్రిడ్ టయోటా టెక్, CNG ఆప్షన్, టాప్ వేరియంట్లలో AWD ఆప్షన్. మైలేజ్: 21-28 kmpl, హైబ్రిడ్‌లో ఎక్కువ ఉంటుంది.

❂ కర్వ్:  1.2L టర్బో పెట్రోల్ (118-125 hp), 1.5L డీజల్ (118 hp, DCT) ఆప్షన్‌ తో వస్తుంది. EV వేరియంట్ కూడా ఉంది. మైలేజ్: పెట్రోల్ 18-20 kmpl, డీజల్ 22+ kmpl ఇస్తుంది.

విక్టోరిస్‌లో హైబ్రిడ్, CNG వల్ల మైలేజ్, ఇంధన ఆదా బెటర్. కర్వ్‌ లో డీజల్ DCT యూనిక్, పవర్‌ ఫుల్.

⦿ ఫీచర్లు

❂ విక్టోరిస్: 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్, డిజిటల్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్స్, అలెక్సా వాయిస్, ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్, జెస్చర్ టెయిల్‌గేట్ కలిగి ఉంటుంది.

❂ కర్వ్: 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్, డిజిటల్ క్లస్టర్, పవర్డ్ డ్రైవర్ సీట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, పనోరమిక్ సన్‌రూఫ్ తో వస్తుంది.

కర్వ్ ఇన్ఫోటైన్‌మెంట్ పెద్దది, మోడర్న్. విక్టోరిస్ ప్రీమియం ఆడియో, కనెక్టివిటీలో ముందుంటుంది.

⦿ సేఫ్టీ

❂ విక్టోరిస్: 5-స్టార్ భారత్ NCAP, 6 ఎయిర్‌ బ్యాగ్స్ స్టాండర్డ్, లెవల్-2 ADAS, 360° కెమెరా.

❂ కర్వ్: 5-స్టార్ గ్లోబల్ NCAP, లెవల్-2 ADAS, మల్టిపుల్ ఎయిర్‌ బ్యాగ్స్.

రెండూ సేఫ్టీలో టాప్ క్లాస్. విక్టోరిస్ ADAS, స్టాండర్డ్ ఎయిర్‌ బ్యాగ్స్‌ తో ముందుంటుంది.

⦿ పెర్ఫార్మెన్స్, డ్రైవింగ్

❂ విక్టోరిస్: స్మూత్, ఫ్యామిలీ ఓరియెంటెడ్, హైబ్రిడ్ వల్ల సైలెంట్, ఎఫిషియెంట్.

❂ కర్వ్: స్పోర్టీ, టర్బో పెట్రోల్/డీజల్ వల్ల ఫన్ టు డ్రైవ్, బెటర్ రైడ్ క్వాలిటీ.

⦿ ఏది బెటర్ అంటే?

❂ మైలేజ్, CNG/హైబ్రిడ్, ప్రాక్టికల్ బూట్ స్పేస్, ADAS, మారుతి సర్వీస్ నెట్‌వర్క్ కావాలంటే  విక్టోరిస్ బెస్ట్.

❂ యూనిక్ కూప్ డిజైన్, డీజల్ ఆప్షన్, పెద్ద స్క్రీన్స్, స్పోర్టీ డ్రైవ్ కావాలంటే  టాటా కర్వ్ మంచిది.

Read Also: సత్తా చాటిన సుజుకి విక్టోరిస్.. ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్- 2026గా గుర్తింపు!

Related News

జూపిటర్ CNG To అపాచీ RR 450.. టీవీఎస్ నుంచి రాబోతున్న క్రేజీ మోడల్స్ ఇవే!

స్పీడ్‌ తో పాటు సేఫ్టీ కూడా కావాలా? అయితే ఈ కారు మీ కోసమే!

ఇది స్కూటరా? లేక టూరింగ్ మెషీనా? ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

సిటీ రోడ్లకు పర్ఫెక్ట్ ఆటోమేటిక్ SUVలు ఇవే.. కొనేముందు ఈ లిస్ట్ చూడండి!

246 కి.మీ రేంజ్‌ తో కొత్త సిట్రోయెన్ eC3 ఫేస్‌లిఫ్ట్.. ఫీచర్లు చూస్తే అదిరిపోవాల్సిందే!

టాటా ఈవీలకు చైనా టెక్నాలజీ.. ఇండియన్ ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్‌ షేకవ్వక తప్పదా?

భారత ఆటో రంగంలో సరికొత్త అధ్యాయం.. ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాగన్ ఆర్ విడుదల!

అవెంజర్ స్ట్రీట్ కొంటే బెటరా? క్రూజ్ కొంటే బెటరా? రెండింటిలో ఏది బెస్ట్?

Big Stories

×